Aghori Arrested: రాజన్న సిరిసిల్ల జిల్లా తంగళ్ళపల్లి మండలం జిల్లేల చెక్ పోస్ట్ దగ్గర నాగ సాధు అఘోరిని పోలీసులు అడ్డుకున్నారు. వేములవాడలోని శ్రీ రాజ రాజేశ్వరి దేవస్థానంలో ఉన్న దర్గాను కూల్చి వేస్తానంటూ ఇటీవల ఆయన ఛాలెంజ్ చేశారు. ఇందులో భాగంగానే, ఆ దర్గాను కూల్చి వేయడానికి బయలుదేరిన అఘోరిని.. తంగళ్ళపల్లి మండలం జిల్లేల గ్రామ శివారులోని జిల్లా సరిహద్దు చెక్ పోస్ట్ వద్ద పోలీసులు అడ్డుకొని తిరిగి వెనక్కి వెళ్లాలని ఆదేశాలు జారీ చేశారు.
బక్రీద్ పండుగ దగ్గరకు రానే వచ్చింది. ఇస్లామిక్ మతం రెండవ అత్యంత ప్రసిద్ధ, పవిత్రమైన పండుగను జరుపుకోవడానికి, ప్రపంచవ్యాప్తంగా ఉన్న ముస్లింలు పండుగ సన్నాహాల్లో ఉత్సాహంగా, బిజీగా ఉన్నారు. ఈద్-ఉల్-అధా అనేది త్యాగం యొక్క పండుగ.