Manoj : మంచు మనోజ్ హీరోగా అప్పట్లో మంచి సినిమాలే చేశాడు. మరీ స్టార్ హీరోల రేంజ్ కు ఎదగలేకపోయాడు గానీ.. యావరేజ్ హీరోగా మంచి సినిమాలే చేశాడు. అవకాశాలు రాక ఇండస్ట్రీ నుంచి దూరం అవడం వేరు.. కానీ మనోజ్ తనంతట తానే సినిమాలు మానేసి ఏడేళ్ల పాటు టాలీవుడ్ కు దూరం అయ్యాడు. అలా అని ఆయనకు అవకాశాలు రావట్లేదని కాదు. ఆయన హీరోగా చేస్తే అవకాశాలు ఇవ్వడానికి చాలా మంది రెడీగానే ఉన్నారు. ఎంతో మంది చిన్న హీరోలకు కూడా వరుస ప్లాపులు వస్తున్నా సినిమా ఆఫర్లు వస్తున్నాయి. అలాంటిది మంచి ట్యాలెంట్ ఉన్న మనోజ్ కు ఏం తక్కువైంది.. బ్యాక్ గ్రౌండ్ ఉంది. నటన ఉంది. సినిమాలు చేయడానికి ప్రొడ్యూసర్లు రెడీగా ఉన్నారు. డైరెక్టర్లు కథలు పట్టుకుని మనోజ్ వద్దకు వస్తున్నారు. ఇన్ని అవకాశాలు ఉన్నా కూడా విలన్ గా ఎందుకు మారాడు అని ఆయన ఫ్యాన్స్ కొంత అసంతృప్తికి గురవుతున్నారు.
Read Also : PBKS vs MI: హాఫ్ సెంచరీతో చెలరేగిన సూర్యకుమార్.. ముంబై స్కోర్ ఎంతంటే..?
మనోజ్ ఇప్పుడు మిరాయ్ సినిమాలో విలన్ పాత్రలో నటిస్తున్నాడు. ఈ సినిమాలో హీరో తేజా సజ్జా. ఇప్పుడు తేజాకు మంచి క్రేజ్ ఉండొచ్చు. కానీ మనోజ్ స్థాయికి తేజా సజ్జా సినిమాలో విలన్ గా చేయడమేంటని ఆయన ఫ్యాన్స్ ఫీల్ అవుతున్నారు. ఒకవేళ విలన్ గా చేయాల్సి వస్తే ఏ పాన్ ఇండియా స్టార్ సినిమాలో చేసినా కొంచెం విలువ ఉండేదని అంటున్నారు. రానా లాగా బాహుబలిలో లేదంటే సూర్య లాగా విక్రమ్ సినిమాలో చేసినట్టు.. మనోజ్ కూడా ఏదైనా స్టార్ హీరో సినిమాలో బలమైన పాత్ర చేసి ఉంటే.. దేశ వ్యాప్తంగా గుర్తింపు కూడా వచ్చేదని అంటున్నారు.
అంతే గానీ.. ఇలా తన స్థాయిని తానే తగ్గించుకోవడం ఏంటని అడుతున్నారు. ఇప్పుడు ఆయన భైరవం సినిమాలో కీలక పాత్ర చేస్తున్నాడు. మరో వైపు శేఖర్ రెడ్డి డైరెక్షన్ లో ‘అత్తరు సాయిబు’ సినిమాలో హీరోగా చేస్తున్నాడు. హీరోగా అవకాశాలు వస్తున్నా సరే విలన్ గా చేయాల్సిన అవసరం ఏమొచ్చిందని ప్రశ్నిస్తున్నారు ఆయన ఫ్యాన్స్. అప్పట్లో మోహన్ బాబు విలన్ గా చేయడానికే ఇంట్రెస్ట్ చూపించారు. అలా తన తండ్రి లాగా విలన్ పాత్రలు చేసి మెప్పించాలని అనుకుంటున్నాడా అనే ప్రచారం కూడా జరుగుతోంది. ఏదేమైనా మనోజ్ కు ఇది కీలక మైన సమయం. ఇప్పుడు వీలైనంత వరకు హీరోగా సినిమాలు చేస్తేనే బెటర్ అంటూ సలహాలు ఇస్తున్నారు ఆయన ఫ్యాన్స్. ఎందుకంటే ఒకసారి విలన్ గా చేస్తే.. తర్వాత హీరోగా క్రేజ్ తగ్గుతుందనేది వారి వాదన.
Read Also : Nidhhi Agerwal: పాపం నిధి.. అడుగు పడితే లేటే!