Delhi: దీపావళి నాడు ఢిల్లీలో భారీ దాడులకు ఐసిస్ ప్లాన్.. వెలుగులోకి సంచలన విషయాలు
- దీపావళి నాడు ఢిల్లీలో భారీ దాడులకు ఐసిస్ ప్లాన్
- వెలుగులోకి సంచలన విషయాలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
దేశ రాజధాని ఢిల్లీలో భారీ కుట్రకు ప్లాన్ చేసిన ఐసిస్‌కు చెందిన ఇద్దరు ఉగ్రవాదులను శుక్రవారం ఢిల్లీ పోలీసులు అరెస్ట్ చేశారు. ఢిల్లీలోని సాదిక్ నగర్‌కు చెందిన ఎండీ అద్నాన్ ఖాన్, అలియాస్ అబూ ముహారిబ్ (19), భోపాల్‌కు చెందిన అద్నాన్ ఖాన్ అలియాస్ అబూ మొహమ్మద్ (20) అనే ఇద్దరు వ్యక్తులను అరెస్ట్ చేశారు. ఇద్దరిని అదుపులోకి తీసుకుని స్పెషల్ పోలీసులు విచారించారు. దర్యాప్తులో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. దీపావళి (20-10-2025)కి ఢిల్లీలో భారీ దాడులకు ప్రణాళిక రచించినట్లు అధికారులు తెలిపారు.
ఇద్దరు ఉగ్రవాదులు ఐసిస్ ఉగ్రవాద సంస్థకు విధేయత చూపుతున్నట్లు ఫొటోలు వెలుగులోకి వచ్చాయి. నిందితులిద్దరూ సిరియా సరిహద్దులో ఉన్నట్లు చెప్పుకునే హ్యాండ్లర్లతో నిరంతరం సంప్రదింపులు జరుపుతున్నారని.. భారతదేశంలో ఐసిస్ తరపున పనిచేయడానికి వీరిద్దరిని నియమించినట్లుగా వర్గాలు తెలిపాయి. ఇద్దరిలో కూడా చాలా తీవ్రవాద భావాలు ఉన్నట్లుగా అధికారులు గుర్తించారు. సిరియాకు చెందిన ఐసిస్ హ్యాండ్లర్ అబు ఇబ్రహీం అల్-ఖురేషితో నిరంతరం కమ్యూనికేషన్లో ఉన్నారని.. అతని సూచనల మేరకు ఢిల్లీలో భారీ కుట్రలకు ప్లాన్ చేసినట్లుగా అధికారులు తేల్చారు.
Also Read
- Reservation Hatao Andolan: "రిజర్వేషన్లు రద్దు చేయాలి".. సీజేపీ తరహాలో మరో ఉద్యమం.. లక్షల్లో ఫాలోవర్స్!
- Womens Shave Heads: విక్రమార్కుడు మూవీ సీన్ రిపీట్.. డబ్బు కోసం గుండు కొట్టించుకున్న మహిళలు.. చివరలో ఊహించని ట్విస్ట్!
- NEET-UG 2026 ప్రశ్నాపత్రం లీక్ కేసులో కీలక పరిణామం.. 13 మందిపై సీబీఐ ఛార్జ్‌షీట్ దాఖలు.!
- EPFO New Portal: PF డబ్బులు ఎక్కడున్నాయో ఇక ఈజీగా తెలుసుకోండి.. EPFO కీలక మార్పులు
ఇది కూాడా చదవండి: Maharashtra: డాక్టర్ ఆత్మహత్య కేసులో సంచలన విషయాలు.. ఓ ఎంపీ ఏం చేశాడంటే..!
ప్రాథమిక విచారణలో నిందితుల్లో ఒకడు కీలక విషయాలు వెల్లడించాడు. సోషల్ మీడియా ద్వారా భోపాల్‌కు చెందిన వ్యక్తితో సంప్రదింపులు జరిపినట్లు తెలిపాడు. జిహాదీ సిద్ధాంతాలను ఆన్లైన్ ద్వారా షేర్ చేసినట్లు ఒప్పుకున్నాడు. ఇద్దరు ఉగ్రవాదులు కూడా విద్యావంతులని.. సాధారణ జీవితాలను గడుపుతున్నారని అధికారులు వెల్లడించారు. స్మార్ట్‌ఫోన్, ల్యాప్‌టాప్ వాడకంతో ఇద్దరు కూడా ఐసిస్‌కి ఆకర్షితులైనట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే దీపావళి సమయంలో ఢిల్లీ భారీ దాడులకు కుట్ర పన్నినట్లుగా కనుగొన్నారు. ఢిల్లీలో రద్దీగా ఉండే ప్రాంతంలో ఒక ప్రముఖ మాల్ లేదా ఒక పబ్లిక్ పార్కును లక్ష్యంగా చేసుకుని ఉగ్రవాద దాడి చేయడానికి కుట్ర పన్నినట్లుగా విచారణలో తేలింది.
ఇది కూాడా చదవండి: Osama bin Laden: ఆ సమయంలో లాడెన్ ఆడ వేషంలో తప్పించుకున్నాడు.. మాజీ సీఐఏ అధికారి వెల్లడి
తాజావార్తలు
-
Reservation Hatao Andolan: “రిజర్వేషన్లు రద్దు చేయాలి”.. సీజేపీ తరహాలో మరో ఉద్యమం.. లక్షల్లో ఫాలోవర్స్!
-
Aakasamlo Oka Tara: దుల్కర్ సల్మాన్ మళ్లీ గట్టిగా ఏదో ప్లాన్ చేశాడుగా.. ‘ఆకాశంలో ఒక తార’ నుంచి ఫస్ట్ సింగిల్ రిలీజ్..!
-
Chennai Love Story: అమెరికాలోనూ ‘చెన్నై లవ్ స్టోరీ’ జోరు.. ఐదు రోజుల్లో హాఫ్ మిలియన్ డాలర్ల క్లబ్‌లోకి కిరణ్ అబ్బవరం సినిమా
-
The Paradise: నాని ‘ది ప్యారడైజ్’లో కీర్తి సురేష్ స్పెషల్ సాంగ్? మరోసారి కలవనున్న దసరా కాంబో!
-
Hyderabad: పెరుగుతున్న వరద ప్రవాహం.. మూసీ ప్రాజెక్ట్ పరివాహక ప్రాంత ప్రజలకు అలర్ట్..
ట్రెండింగ్
-
Subhadeep Ghosh: టీమిండియా కొత్త కోచ్‌గా మాజీ క్రికెటర్.. ఎవరీ సుభదీప్ ఘోష్?.. అంత తోపా!
-
Womens Shave Heads: విక్రమార్కుడు మూవీ సీన్ రిపీట్.. డబ్బు కోసం గుండు కొట్టించుకున్న మహిళలు.. చివరలో ఊహించని ట్విస్ట్!
-
200MP డ్యూయల్ కెమెరాలు, ARRI సినిమా టెక్నాలజీతో రానున్న HONOR Robot Phone..!
-
Kitchen Hacks : వంటగది స్విచ్బోర్డులపై జిడ్డు, నూనె మరకలా? ఈ చిట్కాలతో 5 నిమిషాల్లో క్లీన్..!
-
Cashew Nuts Price : రూ. 1,000 జీడిపప్పు.. రూ. 300కే ఎక్కడ దొరుకుతుందో తెలుసా.?