దేశ రాజధాని ఢిల్లీలో భారీ కుట్రకు ప్లాన్ చేసిన ఐసిస్‌కు చెందిన ఇద్దరు ఉగ్రవాదులను శుక్రవారం ఢిల్లీ పోలీసులు అరెస్ట్ చేశారు. ఢిల్లీలోని సాదిక్ నగర్‌కు చెందిన ఎండీ అద్నాన్ ఖాన్, అలియాస్ అబూ ముహారిబ్ (19), భోపాల్‌కు చెందిన అద్నాన్ ఖాన్ అలియాస్ అబూ మొహమ్మద్ (20) అనే ఇద్దరు వ్యక్తులను అరెస్ట్ చేశారు
దేశ రాజధాని ఢిల్లీలో భారీ ఉగ్ర కుట్ర భగ్నం అయింది. ఐసిస్ ఉగ్రవాదులు భారీ కుట్రకు ప్లాన్ చేసినట్లుగా ఢిల్లీ స్పెషల్ పోలీసులు గుర్తించారు. దీంతో మధ్యప్రదేశ్‌లో ఒకరు.. సౌత్ ఢిల్లీలో మరొకరిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఐఈడీ బాంబులను తయారు చేస్తున్నట్లుగా పోలీసులు గుర్తించారు.