Ram Mandir: అయోధ్యంలో శ్రీరామ మందిర ప్రారంభోత్సవానికి అన్ని ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఇప్పటికే దేశవ్యాప్తంగా సాధువులతో సహా 7000 మంది అతిథులకు శ్రీ రామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ ఆహ్వానాలు పంపింది. ఇదిలా ఉంటే రామజన్మభూమి-బాబ్రీ మసీదులో వివాదంలో మాజీ న్యాయవాదిగా ఉన్న ఇక్బాల్ అన్సారీని జనవరి 22న జరగబోయే కార్యక్రమానికి హాజరుకావాల్సిందిగా ఆలయ ట్రస్ట్ ఆహ్వానాన్ని అందించింది.