Love jihad: హిందూ మహిళలను వలలో వేసుకుని, పెళ్లి చేసుకుని వారిని ఇస్లాంలోకి మార్చే పెద్ద కుట్రను మధ్యప్రదేశ్ పోలీసులు గుర్తించారు. ‘‘లవ్ జిహాద్’’ ద్వారా హిందూ యువతులను టార్గెట్ చేస్తున్నట్లు పోలీసుల విచారణలో తేలింది. ఈ కేసులో ఇండోర్‌కు చెందిన కాంగ్రెస్ కౌన్సిలర్ అన్వర్ ఖాద్రీ కీలకంగా వ్యవహరిస్తున్నట్లు తేలింది. ఇతను యువకులను ‘‘లవ్ జిహాద్’’ చేయాలని ప్రేరేపిస్తున్నాడు. ఈ కేసులో ఖాద్రీపై జాతీయ భద్రతా చట్టం (ఎన్ఎస్ఏ) కింద కేసు నమోదు చేయబడింది.
హిందూ మహిళల్ని ట్రాప్ చేయాలని ఖాద్రీ ముగ్గురు వ్యక్తులకు డబ్బులు ఇచ్చినట్లు తేలడంతో ఈ కేసు రాష్ట్రంలో సంచలనంగా మారింది. రెండు వారాల క్రితం క్రితం బంగంగా పోలీస్ స్టేషన్లో దాఖలైన ఫిర్యాదుల నేపథ్యంలో సాహిల్ షేక్,అల్తాఫ్ అలీ అనే ఇద్దరు పురుషులను ఇండోర్ పోలీసులు అరెస్టు చేసినప్పుడు ఈ విషయం వెలుగులోకి వచ్చింది. హిందూ యువతులను వలలో వేసుకునేందుకు వీరిద్దరు తమ మతపరమైన గుర్తింపును దాచిపెట్టి, హిందువుగా నటిస్తూ, లైంగిక వేధింపులకు పాల్పడినట్లు ఇద్దరు మహిళలు ఫిర్యాదు చేశారు.
Read Also: Citroën India: టాటా కర్వ్ తో పోటీ పడుతున్న ఈ కారుపై రూ.2.80 లక్షలు తగ్గింపు..! 31 వరకే ఛాన్స్..
పోలీసు విచారణలో ఈ మొత్తం కుట్రకు కాంగ్రెస్ నేత ఖాద్రీ సూత్రధారి అని తేలింది. హిందూ మహిళల్ని వివాహం చేసుకుని, వారిని ఇస్లాంలోకి మార్చేందుకు సాహిల్ కు రూ. 2 లక్షలు, అల్తాఫ్ కు రూ. 1 లక్ష ఇచ్చినట్లు తేలింది. పోలీసులు ఖాద్రీపై మత స్వేచ్ఛా చట్టం మరియు భారత శిక్షాస్మృతిలోని ఇతర విభాగాల కింద కేసు నమోదు చేశారు. ఇండోర్ జిల్లా కలెక్టర్ ఇతడిపై జాతీయ భద్రతా చట్టాన్ని అమోదించారు. ప్రస్తుతం, ఖాద్రీ పరారీలో ఉన్నాడు.
దీనిపై మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి మోహన్ యాదవ్ కూడా ఈ ఘటనపై స్పందించారు. నిందితుడిని అరెస్ట్ చేయడానికి పోలీసులకు పూర్తి స్వేచ్ఛ ఇచ్చినట్లు చెప్పారు. దోషిగా తేలితే ఎవరూ తప్పించుకోలేరని హెచ్చరించారు. కాంగ్రెస్ పార్టీ దేశ వ్యతిరేక శక్తులకు ఆశ్రయం కల్పిస్తోందని, అన్వర్ ఖాద్రీని ఎన్కౌంటర్ చేయాలని బీజేపీ నేత రామేశ్వర్ శర్మ డిమాండ్ చేశారు.