IndiGo Shares Crash: దేశీయ వైమానిక సంస్థ ఇండిగో మాతృసంస్థ ఇంటర్‌గ్లోబ్ ఏవియేషన్ లిమిటెడ్ షేర్లు భారీగా పతనం అవుతున్నాయి. ఇప్పటికే గత ఐదు సెషన్లలో 9 శాతానికి పైగా విలువ కోల్పోయాయి. ఈరోజు (డిసెంబర్ 8న) ట్రేడింగ్ ప్రారంభంలో ఒక్కసారిగా 7శాతం షేర్లు పతనమైపోయాయి. అనంతరం కొద్దిగా కోలుకుంది. ఉదయం 10 గంటల సమయంలో 3.92 శాతం (రూ.210.50) నష్టంతో రూ.5,160 దగ్గర ట్రేడింగ్ అవుతున్నాయి. అయితే, డీజీసీఏ నూతన ఎఫ్‌డీటీఎల్ రూల్స్ కు అనుగుణంగా రెడీ కావడంలో ఇండిగో విమానయాన సంస్థ వైఫల్యం చెందింది. దీంతో గత కొన్ని రోజులుగా ఆ కంపెనీకి చెందిన వందల ఫ్లైట్స్ క్యాన్సిల్ అయ్యాయి.
Read Also: Krithi Shetty : ఆ హీరోతో చాలా కంఫర్ట్‌గా ఉంటుంది..
అయితే, ఎట్టకేలకు సోమవారం నుంచి తమ సంస్థ కార్యకలాపాలు సాధారణ స్థితికి చేరుకుంటున్నాయి. ఈరోజు ఇండిగో 1,650 విమాన సర్వీసులను నడిపిస్తుంది. ఇక, ఇప్పటికే రద్దైన, ఆలస్యమైన నడుస్తున్న విమానాలకు సంబంధించి కస్టమర్లకు రిఫండ్ల రూపంలో సంస్థ.. రూ.610 కోట్లు రిలీజ్ చేసిందని కేంద్ర పౌర విమానయాన శాఖ వెల్లడించింది. అలాగే, మూడు వేల బ్యాగేజీలను కూడా ప్రయాణికులకు అప్పగించినట్లు పేర్కొనింది.