IndiGo flight makes emergency landing after man starts bleeding mid-air: ఇండిగో విమానంలో ఒక విషాద సంఘటన చోటు చేసుకుంది. విమానం గాల్లో ఉన్నప్పుడు ఒక ప్రయాణికుడు తీవ్ర అస్వస్థతకు గురవ్వగా.. పైలట్ ఎమర్జెన్సీ ల్యాండింగ్ చేశాడు. అయినా ప్రయోజనం లేకుండా పోయింది. ఆ ప్రయాణికుడు ప్రాణాలు కోల్పోయాడు. ఇండోర్ విమానాశ్రయంలో జరిగిన ఈ ఘటన వివరాల్లోకి వెళ్తే.. మధురై నుంచి ఢిల్లీకి ఇండిగో విమానం 6E-2088 బయలుదేరింది. అయితే.. మార్గమధ్యంలో అతుల్ గుప్తా అనే 60 ఏళ్ల వ్యక్తికి అకస్మాత్తుగా నోటి నుంచి రక్తం వచ్చింది. ఆ కాసేపటికే అతనున తీవ్ర అస్వస్థతకు గురయ్యాడు. ఈ విషయం తెలుసుకున్న పైలట్.. ఇండోర్‌లోని ఇండోర్‌లోని దేవి అహల్యబాయి హోల్కర్ అంతర్జాతీయ విమానాశ్రయంలో ఎమర్జెన్సీ ల్యాండ్ చేశాడు. అనంతరం ఆ ప్రయాణికుడ్ని హుటాహుటినా ఆసుపత్రికి తరలించారు. అయితే.. అతడు అప్పటికే చనిపోయినట్లు వైద్యులు తెలిపారు.
Ashwini Kumar Choubey: ఘోర రోడ్డు ప్రమాదం.. తృటిలో తప్పించుకున్న కేంద్రమంత్రి
ఈ ఘటనపై ఇండిగో ఇన్‌చార్జ్ డైరెక్టర్ ప్రబోధ్ చంద్ర శర్మ మాట్లాడుతూ.. అతుల్ గుప్తా అనే వ్యక్తి తీవ్ర అస్వస్థతకు గురవ్వడంతో విమానాన్ని దారి మళ్లించి, ఎమర్జెన్సీ ల్యాండింగ్ చేయాల్సి వచ్చింది. అనంతరం ఎయిర్‌పోర్ట్ సిబ్బంది ఆంబులెన్స్‌తో పాటు వైద్యుడ్ని సిద్ధం చేశారన్నారు. అయితే.. స్థానిక ఆసుపత్రికి తరలించిన అనంతరం అక్కడి వైద్యుడు అప్పటికే అతుల్ గుప్తా మరణించినట్టు ధృవీకరించారన్నారు. నిజానికి.. అతుల్ గుప్తా అంతకుముందే మధుమేహం, తీవ్ర రక్తపోటు, గుండె నొప్పితో బాధపడుతున్నట్టు వైద్యులు తెలిపారని అన్నారు. విమానం గాల్లో ఉన్నప్పుడు ఆయన ఆరోగ్యం ఒక్కసారిగా క్షీణించిందని చెప్పారు. మధ్యలో ఎమర్జెన్సీ ల్యాండింగ్ చేయడం వల్ల.. న్యూఢిల్లీకి విమానం సాయంత్రం 6:40 గంటలకు చేరుకుందని వెల్లడించారు. మరోవైపు.. మృతుడు నోయిడా నివాసి అని పోలీసులు తెలిపారు. పోస్ట్‌మార్టం తర్రవాత బంధవులకు మృతదేహాన్ని అప్పగిస్తామని పేర్కొన్నారు.
Ranil Wickramasinghe: శ్రీలంక ముందున్న ఏకైక మార్గం అదే.. లేదంటే కోలుకోలేం