Turkey: పాకిస్తాన్ మిత్ర దేశాలైన టర్కీ, అజర్ బైజాన్‌లకు భారతీయులు షాక్ ఇస్తున్నారు. తమతో పెట్టుకుంటే ఎలా ఉంటుందో రుచిచూపిస్తున్నారు. ఇప్పటికే, టర్కీకి వెళ్లే పర్యాటకుల సంఖ్య గణనీయంగా తగ్గింది. మరోవైపు, అజర్ బైజాన్ కూడా ఇదే పరిస్థితిని ఎదుర్కొంటోంది. ఈ నేపథ్యంలో తాజాగా, ఈ రెండు దేశాలకు సంబంధించిన వీసా అప్లికేషన్స్ 42 శాతం తగ్గినట్లు ఒక నివేదిక తెలిపింది.
Read Also: Mumbai: తల్లి ముందే రెండేళ్ల పాపపై అత్యాచారం.. అఘాయిత్యానికి పాల్పడింది ఆమె ప్రియుడే..
ఇటీవల, ఆపరేషన్ సిందూర్ సమయంలో పాకిస్తాన్‌కి టర్కీ, అజర్ బైజాన్ మద్దతు తెలిపాయి. టర్కీ ఏకంగా తన డ్రోన్లను ఇండియాకు వ్యతిరేకంగా పాకిస్తాన్‌కి ఇచ్చింది. దీంతో పాటు వీటిని ఆపరేట్ చేయడానికి ఇద్దరు టర్కీష్ వ్యక్తుల్ని కూడా నియమించింది. అయితే, భారత దాడుల్లో వీరిద్దరు కూడా మరణించారని తెలుస్తోంది.
వీసా ప్రాసెసింగ్ ప్లాట్‌ఫామ్ అయిన అట్లీస్ అందించిన డేటా ప్రకారం, కేవలం 36 గంటల్లోనే, వీసా దరఖాస్తు ప్రక్రియ నుండి నిష్క్రమించిన భారతీయుల సంఖ్య 60 శాతం పెరిగింది. ఢిల్లీ, ముంబై వంటి మెట్రో నగరాల నుంచి టర్కీకి వెళ్లే వారు పెట్టుకున్న అప్లికేషన్స్‌లో 53 శాతం తగ్గదల కనిపించగా, ఇండోర్ జైపూర్ వంటి టైర్ -2 నగరాల నుంచి 20 శాతం తగ్గింది. కుటుంబ పర్యటనలతో సహా, గ్రూప్ వీసా అభ్యర్థనలు దాదాపుగా 49 శాతం తగ్గాయి. సోలో, కపుల్ అప్లికేషన్స్ 27 శాతం తగ్గాయి. టర్కీ, అజర్ బైజాన్ బదులుగా చాలా మంది థాయ్‌లాండ్, వియత్నాం వంటి ఆగ్నేయాసియా దేశాలతో పాటు ఈజిప్ట్ వంటి దేశాల వీసాల కోసం అప్లికేషన్స్ పెరిగినట్లు డేటా చూపిస్తోంది.