INS Arighaat: అణు జలాంతర్గామి ఐఎన్‌ఎస్ అరిఘాత్ నుంచి బాలిస్టిక్ క్షిపణి పరీక్ష
- భారత్‌కు చెందిన అణు జలాంతర్గామి ఐఎన్‌ఎస్ అరిఘాత్ ద్వారా కే4 బాలిస్టిక్ క్షిపణి పరీక్ష..
- 3,500 కిలో మీటర్ల దూరంలోని లక్ష్యాలను ఛేదించేలా సిద్ధం చేసిన రక్షణ శాఖ..
- ప్రపంచంలోనే క్షిపణులను ప్రయోగించగల అణు జలాంతర్గాములు కలిగిన దేశాల్లో భారత్ ఆరోది
- Follow Us :
-
-
Add as a preferred
source on google
INS Arighaat: భారత్‌కు చెందిన అణు జలాంతర్గామి ఐఎన్‌ఎస్ అరిఘాత్ నుంచి కే4 బాలిస్టిక్ క్షిపణిని ప్రయోగించారు. విశాఖ తీరంలో భారత నౌకాదళం దీనిని నిర్వహించిందని రక్షణ రంగ అధికారులు చెప్పారు. అరిఘాత్ నుంచి కే4 క్షిపణిని పరీక్షించడం ఇదే మొదటిసారి. 3,500 కిలో మీటర్ల దూరంలోని లక్ష్యాలను ఛేదించేలా మంగళవారం నిర్వహించిన ఈ ప్రయోగం యొక్క ఫలితాలను విశ్లేషిస్తున్నారు. ఐఎన్‌ఎస్ అరిఘాత్‌ను రెండు నెలల క్రితమే కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్ జాతికి అంకితం చేస్తున్నట్లు ప్రకటించారు. ఐఎన్‌ఎస్ అరిహంత్ మాదిరిగానే అరిఘాత్ నిర్మాణాన్ని కూడా తూర్పు నౌకాదళానికి చెందిన యుద్ధ నౌకల స్థావరం విశాఖపట్నం నేవల్ డాక్ యార్డులోని ‘షిప్ బిల్డింగ్ సెంటర్’లో 2011 డిసెంబరులో చేపట్టగా.. తొలిదశ నిర్మాణం తర్వాత 2017 నవంబర్ 19న జల ప్రవేశం చేసింది. ఆ తర్వాత అంతర్గత విభాగాల పరికరాల బిగింపు, ఆధునిక టెక్నాలజీతో రాడార్ వ్యవస్థ, ఆయుధ సంపత్తిని సమకూర్చడం లాంటి కీలక పనులన్నింటినీ కంప్లీట్ చేశారు.
Read Also: Pawan Kalyan : చివరి దశలో ‘హరి హర వీర మల్లు పార్ట్-1 షూటింగ్
Also Read
- Brahmaputra: వాటర్ బాంబ్ కంటే డేంజర్.. పెను ముప్పు రానుందా?
- Gargi story Explained: నరమేధపు నేలపై పూసిన గులాబీ! 200 ఏళ్ల తర్వాత ఆ గ్రామంలో పుట్టిన తొలి ఆడపిల్ల!
- UNEP: భారత్‌కు బిగ్ అలర్ట్! విపత్తులు ముంచుకొస్తున్నాయా?
- IndiGo Plane Hits Pole: ఎయిర్‌పోర్టులో ఇండిగో విమానానికి ప్రమాదం.. పోల్‌ను ఢీకొన్న ఫ్లైట్!
అయితే, ప్రపంచంలోనే బాలిస్టిక్ క్షిపణులను ప్రయోగించ గల అణు జలాంతర్గాములు కలిగి ఉన్న దేశాల్లో భారతదేశం ఆరోది. ఇక, భారత్ కంటే ముందు అమెరికా, రష్యా, యూకే, ఫ్రాన్స్, చైనా ఉన్నాయి. అలాగే, ఉపరితలం నుంచి ఉపరితలానికి ప్రయోగించే కే-15, కే-4 క్షిపణులను కూడా భారత్ ప్రస్తుతం అభివృద్ధి చేస్తుంది. చైనాను దృష్టిలో ఉంచుకొని 3500 కిలో మీటర్ల దూరంలోని టార్గెట్ లను ఈజీగా ఛేదించేలా వాటిని రూపొందిస్తున్నట్లు రక్షణ శాఖ అధికారులు వెల్లడించారు.
తాజావార్తలు
-
Hanuman Ansh: అప్పుడు సహాయం చేయలేదు.. ఇప్పుడేమో పొగుడుతున్నారు.. బాలీవుడ్‌పై డైరెక్టర్ షాకింగ్ కామెంట్స్!
-
Baswaraju Saraiah: దమ్ముంటే రాజీనామా చేసి ఇండిపెండెంట్‌గా పోటీ చేయాలి.. కొండా సురేఖకు ఎమ్మెల్సీ సారయ్య సవాల్!
-
Mukesh Ambani: ఇన్వెస్టర్లకు దీపావళి ఆఫర్ ప్రకటించిన ముకేష్ అంబానీ! రాబోతుంది ఇదే..
-
Infinix Hot 70 Pro 5G: ఇన్ఫినిక్స్ హాట్ 70 ప్రో భారత్‌లో లాంచ్.. 50MP కెమెరా, 6000mAh బ్యాటరీ, 144Hz డిస్ప్లే!
-
SBI ATM Rules 2026: SBI ఖాతాదారులకు భారీ షాక్.. ATM రూల్స్ మారుతున్నాయ్! కొత్త రూల్స్ తెలుసుకోండి
ట్రెండింగ్
-
Shubman Gill Uncle: అకాయ్‌కు ‘అంకుల్’గా శుభ్‌మన్ గిల్.. వైరల్‌గా స్కూల్ రీల్.. పగలబడి నవ్వుకుంటున్న ఫాన్స్!
-
243 కి.మీ రేంజ్, 90 కి.మీ టాప్ స్పీడ్.. రూ.1.10 లక్షలకే Simple Wave ఎలక్ట్రిక్ స్కూటర్ లాంచ్..!
-
Rohit Sharma Retirement: రిటైర్మెంట్కు అంగీకరించిన రోహిత్ శర్మ.. సంచలన రిపోర్ట్!
-
6 రోజుల బ్యాటరీ, 24 గంటల బీపీ మానిటరింగ్.. HUAWEI WATCH D3 లాంచ్.!
-
204hp పవర్, 480Nm టార్క్.. 7-సీటర్ SUVగా రీఎంట్రీ ఇవ్వబోతున్న Mitsubishi Pajero.!