NTV Telugu Site icon

Israel-Lebanon War: కాల్పుల విరమణ నిర్ణయాన్ని స్వాగతించిన భారత్

Israellebanonwar

Israellebanonwar

ఇజ్రాయెల్-లెబనాన్‌ మధ్య జరుగుతున్న యుద్ధానికి ముగింపు పడింది. గత కొద్ది రోజులుగా యుద్ధంతో ఇరు దేశాల మధ్య ఉద్రిక్తతలతో అట్టుడికాయి. క్షిపణి, బాంబు దాడులతో రెండు దేశాలు దద్దరిల్లాయి. మొత్తానికి అమెరికా జోక్యంతో కాల్పులకు ఫుల్‌స్టాప్ పడింది. అటు అమెరికా.. ఇటు ఇజ్రాయెల్‌కు కూడా యుద్ధం ఆపేస్తున్నట్లు ప్రకటించాయి. దీంతో ఇజ్రాయెల్ నిర్ణయాన్ని భారత్ స్వాగతించింది. కాల్పుల విరమణకు ఇజ్రాయెల్ తీసుకున్న నిర్ణయాన్ని స్వాగతిస్తున్నట్లు భారత్ ప్రకటించింది.

ఇది కూడా చదవండి: Sambhal Violence: యోగితో అట్లుంటది.. సంభాల్ హింసకు పాల్పడి వారి నుంచి నష్టపరిహారం..

ఇరు దేశాల నిర్ణయాన్ని స్వాగతిస్తున్నట్లు భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ ఒక ప్రకటనలో తెలిపింది. ఈ నిర్ణయం పశ్చిమాసియాలో ఉద్రిక్తతలను తగ్గిస్తుందని పేర్కొంది. తాజా నిర్ణయంతో శాంతి నెలకొంటుందని.. పరిస్థితులు సాధారణ స్థితికి వస్తాయని అభిప్రాయపడింది. ఇక ఇజ్రాయెల్‌లో భారతీయ పౌరులంతా క్షేమంగా ఉన్నారని.. వారితో భారత రాయబార కార్యాలయం సంప్రదింపులు జరుపుతోందని శనివారం విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రతినిధి రణధీర్ జైస్వాల్ తెలిపారు.

ఇది కూడా చదవండి: IND vs AUS 2nd test: అడిలైడ్ టెస్టుకు ముందే టీమిండియాకు షాక్..!

ఇటీవల యూఎస్ ప్రత్యేక రాయబారి అమోస్ హోచ్‌స్టెయిన్ లెబనాన్‌లో పర్యటించారు. ఈ సందర్భంగా యుద్ధం ముగింపుపై చర్చించారు. అనంతరం అమోస్.. ఇజ్రాయెల్‌లో కూడా పర్యటించి ఇదే విషయంపై చర్చించారు. దీంతో రెండు దేశాలు యుద్ధం ముగింపునకు అంగీకారం తెలిపాయి. అంతేకాకుండా ఇజ్రాయెల్ కేబినెట్ కూడా తీర్మానం చేసింది. యుద్ధానికి ముగింపు పలకాలని నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించింది. అలాగే లెబనాన్‌కు మీడియా ద్వారా వెల్లడించింది. యుద్ధం ఆపేస్తున్నట్లు ప్రకటించింది. కాల్పుల విరమణకు అంగీకారం తెల్పడంతో ఇజ్రాయెల్ దళాలు.. లెబనాన్ నుంచి వైదొలుగుతున్నాయి.

అక్టోబర్ 7, 2023లో హమాస్.. ఇజ్రాయెల్‌పై ఆకస్మిక దాడులు చేసి పౌరులను బందీలుగా తీసుకెళ్లారు. దీంతో అప్పటి నుంచి ఇజ్రాయెల్ పగతో రగిలిపోయింది. ఆ నాటి నుంచి బందీలను విడిపించేందుకు హమాస్ అంతమే లక్ష్యంగా గాజాపై ఇజ్రాయెల్ దళాలు భీకరదాడులు చేశాయి. గాజా పట్టణాన్ని ధ్వంసం చేశాయి. అంతేకాకుండా హమాస్ అగ్ర నేతలందరినీ హతమార్చాయి. అనంతరం లెబనాన్‌లోని హిజ్బుల్లా దళాలు హమాస్ మద్దతుగా.. ఇజ్రాయెల్‌పై దాడులకు దిగింది. ప్రతీకారంగా ఐడీఎఫ్ దళాలు కూడా హిజ్బుల్లా అంతమే లక్ష్యంగా లెబనాన్‌పై దాడి చేశాయి. ఇందులో భాగంగా హిజ్బుల్లా చీఫ్ హసన్ నస్రల్లాను హతమార్చాయి. ఇలా హిజ్బుల్లా కమాండర్లను చంపుకుంటూ పోయాయి. అలాగే లెబనాన్‌లో ముఖ్య ప్రాంతాలను ధ్వంసం చేశాయి. మొత్తానికి అమెరికా జోక్యంతో ఇరు దేశాల మధ్య యుద్ధానికి ముంగిపు పడింది.

ఇది కూడా చదవండి: ICC Test Ranking: ఐసీసీ టెస్టు ర్యాంకింగ్‌లో నెంబర్-1 బౌలర్‌ మనోడే..