India message to China: గతేడాది పహల్గామ్ ఉగ్రవాద దాడి తర్వాత, భారత్ ‘‘ఆపరేషన్ సిందూర్’’ ద్వారా పాకిస్తాన్‌పై భీకర దాడి చేసింది. పీఓకే, పాకిస్తాన్‌లోని ఉగ్రవాద స్థావరాలపై దాడులు నిర్వహించింది. వందలాది మంది ఉగ్రవాదుల్ని హతమార్చింది. పాకిస్తాన్ సైన్యం భారత భూభాగాలపై దాడులు చేయడానికి ప్రయత్నిస్తే, పాక్ ఎయిర్ ఫోర్స్ బేసుల్ని ధ్వంసం చేసింది. అయితే, ఈ యుద్ధ సమయంలో పాకిస్తాన్‌కు చైనా సహకరించినట్లు ఇటీవల ఆ దేశానికి చెందిన అధికారులు వ్యాఖ్యానించారు.
Read Also: Peddi: పెద్ది’కి నార్త్’లో సాలిడ్ బ్యాకప్..ట్రైలర్ లాంచ్ అక్కడే!
అయితే, దీనిపై భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ(MEA) తీవ్రంగా స్పందించింది. ప్రపంచ శక్తులగా చెప్పబడుతున్న దేశాలు చేసే ఇలాంటి చర్యలు వాటి విశ్వసనీయత, ప్రపంచ ప్రతిష్టను దెబ్బతీస్తాయని చెప్పింది. ‘‘ఇంతకుముందు తెలిసిన విషయాలనున ధ్రువీకరించే నివేదికల్ని మేము చూశాము’’ అని విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రతినిధి రణధీర్ జైస్వాల్ అన్నారు. ‘‘ఉగ్రవాద మౌలిక సదుపాయాలను రక్షించే ప్రయత్నాలకు మద్దతు ఇవ్వడం తమ ప్రతిష్టను, స్థాయిని ప్రభావితం చేస్తుందో లేదో అనే అంశాన్ని, తమను తాము బాధ్యతాయుతంగా భావించే దేశాలు ఆలోచించుకోవాలి’’ అని హితవు పలికారు.
ఆపరేషన్ సిందూర్ సమయంలో చైనా మాత్రమే కాకుండా, టర్కీ కూడా బైరెక్టర్ డ్రోన్ల ద్వారా పాకిస్తాన్‌కు సాయాన్ని అందించింది. పాకిస్తాన్ అన్ని కుట్రల్ని భారత సైన్యం తిప్పికొట్టింది. ఇటీవల చైనా ప్రభుత్వ ప్రసార సంస్థ సీసీటీవీ, ఏవియేషన్ ఇండస్ట్రీ కార్పొరేషన్ ఆఫ్ చైనా (AVIC)కు చెందిన చెంగ్డూ ఎయిర్‌క్రాఫ్ట్ డిజైన్ అండ్ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్‌లోని ఇంజనీర్ల ఇంటర్వ్యూలను ప్రసారం చేసింది. ఇందులో జాంగ్ హెన్ అనే ఇంజనీర్ ఆపరేషన్ సిందూర్ సమయంలో పాకిస్తానీ సిబ్బందితో కలిసి పనిచేశామని చెప్పారు.
