Peddi: పెద్ది’కి నార్త్’లో సాలిడ్ బ్యాకప్..ట్రైలర్ లాంచ్ అక్కడే!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ హీరోగా నటిస్తున్న మోస్ట్ అవైటెడ్ మూవీ ‘పెద్ది’. బుచ్చిబాబు డైరెక్షన్లో రూపుదిద్దుకుంటున్న ఈ రూరల్ యాక్షన్ స్పోర్ట్స్ డ్రామా మరికొద్ది రోజుల్లో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. అయితే, ఈ సినిమా ట్రైలర్ లాంచ్‌కు ఇప్పటికే ముహూర్తం ఖరారైంది. మే 18వ తేదీన ట్రైలర్ లాంచ్ చేస్తామని సినిమా టీమ్ అధికారికంగా ప్రకటించింది.
అయితే, ఈ ట్రైలర్ ముంబైలో లాంచ్ చేసే అవకాశం ఉందని ఎన్టీవీ ముందే చెప్పింది. ఎన్టీవీ చెప్పినట్టుగానే సినిమా ట్రైలర్‌ను ముంబైలో లాంచ్ చేయబోతున్నట్లు తెలుస్తోంది. ఈ సినిమా హిందీ డిస్ట్రిబ్యూషన్‌ను ‘జియో స్టూడియోస్’ సంస్థ చేస్తోంది. ఈ క్రమంలోనే నార్త్ బెల్ట్‌లో సినిమాను ఒక రేంజ్లో ప్రమోట్ చేసే బాధ్యతలను కూడా ఆ సంస్థ తమ భుజానికెత్తుకుంది. ఈ క్రమంలోనే ముంబైలో జరిగే ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌ను కనీవినీ ఎరుగని రీతిలో, అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహించడానికి జియో స్టూడియోస్ భారీ ఎత్తున ఏర్పాట్లు చేస్తోంది.
Also Read
- KVN : ‘టాక్సిక్’ మీ పల్స్ రేట్‌ను కూడా మారుస్తుంది!
- Yash: తెలుగు ప్రేక్షకులు నాకు ఇచ్చిన బలం, సపోర్ట్‌కు నేను రెండింతలు తిరిగి ఇస్తాను
- Huma Qureshi: ‘టాక్సిక్’ తర్వాత టాలీవుడ్లోకి హ్యూమా.. దిల్ రాజు ముందే మాట ఇచ్చేసిందా?
- Rukmini Vasanth: యశ్‌తో పనిచేయడం బకెట్ లిస్ట్ మూమెంట్.. ‘టాక్సిక్’ హీరోయిన్ కామెంట్స్ వైరల్!
ఆర్ఆర్ఆర్ లాంటి గ్లోబల్ హిట్ అనంతరం చరణ్ హీరోగా చేసిన సినిమా కావడంతో, నార్త్‌లో కూడా ‘పెద్ది’ మీద భారీ అంచనాలు ఉన్నాయి. దానికి తోడు బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ హీరోయిన్గా నటిస్తుండటం, ఆస్కార్ విన్నర్ ఏఆర్ రెహమాన్ సంగీతం అందిస్తుండటం కూడా ఈ సినిమా హిందీ మార్కెట్‌కి మరింత ప్లస్ కానుంది. ఇక ఈ క్రేజ్‌ను పర్ఫెక్ట్గా క్యాష్ చేసుకుని, ముంబై ఈవెంట్‌తో దేశమంతటా ‘పెద్ది’ మేనియా క్రియేట్ చేయాలని జియో స్టూడియోస్ ప్లాన్ చేసింది. మునుపెన్నడూ కనిపించని విధంగా ఊర మాస్ లుక్‌లో చరణ్ కనిపించబోతున్న ఈ సినిమా ట్రైలర్, ముంబై ఈవెంట్ తర్వాత సోషల్ మీడియాను షేక్ చేయడం ఖాయం అని టీమ్ చెబుతోంది.
తాజావార్తలు
-
KVN : ‘టాక్సిక్’ మీ పల్స్ రేట్‌ను కూడా మారుస్తుంది!
-
Yash: తెలుగు ప్రేక్షకులు నాకు ఇచ్చిన బలం, సపోర్ట్‌కు నేను రెండింతలు తిరిగి ఇస్తాను
-
Hockey World Cup 2026: భారత్‌కు షాక్.. చివరి 15 నిమిషాల్లో కథ మారింది.. నెదర్లాండ్స్ చేతిలో ఓటమి
-
Huma Qureshi: ‘టాక్సిక్’ తర్వాత టాలీవుడ్లోకి హ్యూమా.. దిల్ రాజు ముందే మాట ఇచ్చేసిందా?
-
Rukmini Vasanth: యశ్‌తో పనిచేయడం బకెట్ లిస్ట్ మూమెంట్.. ‘టాక్సిక్’ హీరోయిన్ కామెంట్స్ వైరల్!
ట్రెండింగ్
-
Maharashtra: “ఇది కదా విశ్వాసం అంటే”.. యజమానులు తిరిగిరారని తెలియక.. తిండి, నీళ్లు మానేసిన పెంపుడు కుక్క
-
Karnataka: పెళ్లి కొడుకు రాహుల్ గాంధీ ఫ్యాన్.. పెళ్లి క్యాన్సల్ చేసిన యువతి? షాకింగ్ కారణం!
-
64MP కెమెరా, 5,700mAh బ్యాటరీతో వచ్చేసిన Philips S7221 5G ఫోన్.. ధర ఎంతంటే?
-
Crispy Veggie Fingers: బయట క్రిస్పీ.. లోపల సాఫ్ట్.! నోరూరించే ‘క్రిస్పీ వెజ్జీ ఫింగర్స్’ సింపుల్ అండ్ టేస్టీ స్నాక్ చేసేయండి ఇలా.!
-
7 సీటర్‌కు బదులు 6 సీటర్.. క్యాప్టెన్ సీట్లతో Mahindra XEV 9S కొత్త వేరియంట్..!