BrahMos: ఫిలిప్పీన్స్‌కి భారత బ్రహ్మోస్ క్షిపణులు.. రేపటి నుంచి సరఫరా..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
BrahMos: భారత్ తన బ్రహ్మోస్ క్షిపణులను ఫిలిప్పీన్స్‌కి ఎగుమతి చేయనుంది. ఫిలిప్పీన్స్ ఆర్డర్ చేసిన బ్రహ్మోస్ లాంచర్లను, క్షిపణులను రేపటి నుంచి సరఫరా చేయనుంది. మొదటి విడత బ్యాచ్‌ని శుక్రవారం డెలివరీ చేయనుంది. రక్షణ రంగంలో ఎగుమతులను పెంచుకునే భారత లక్ష్యంలో ఇది కీలక మైలురాయి. మరోవైపు దక్షిణ చైనా సముద్రంలో డ్రాగన్ కంట్రీ చైనాను అడ్డుకునేందుకు బ్రహ్మోస్ క్షిపణులు అవసరమని ఫిలిప్పీన్స్ భావిస్తోంది.
ఫిలిప్పీన్స్‌లోని పంపంగా ప్రావిన్స్‌లోని క్లార్క్ అంతర్జాతీయ విమానాశ్రయానికి భారత వైమానిక దళం (IAF)కి చెందిన రెండు విమానాలు, కార్గో విమానాల ద్వారా డెలివరీ జరుగుతుందని రక్షణ, భద్రతా వ్యవస్థ వర్గాలు తెలిపాయి. క్షిపణి వ్యవస్థలో భాగంగా లాంచర్లు, వాహనాలు, లోడర్లు, కమాండ్ కంట్రోల్ సెంటర్‌తో సహా అనేక ఉప వ్యవస్థలు ఇందులో భాగంగా ఉంటాయి.
Also Read
- Salman Nadwi D*eath: అయోధ్య వివాదంపై చర్చలకు మద్దతిచ్చిన మౌలానా సల్మాన్ నద్వీ మృతి..
- Tamil Nadu Politics: విజయ్ సర్కార్ ఎప్పుడైనా కూలిపోవచ్చు.. ఎన్నికలకు సిద్ధం కండి..! స్టాలిన్ సంచలన వ్యాఖ్యలు
- MEA: కరాచీ దాడిని భారత్‌పై నెట్టొద్దు.. పాక్‌పై ఘాటు వ్యాఖ్యలు..
- Ketan Agarwal Murder Case: కేతన్ హత్యలో పట్టుబడకుండా 10 గంటల మాస్టర్ ప్లాన్.. చివరకు అదే పట్టించింది!
Read Also: Karnataka: ప్రేమించడం లేదని కాంగ్రెస్ కార్పొరేటర్ కుమార్తె దారుణహత్య..
జనవరి 2022లో 374.96 మిలియన్ల ఒప్పందాన్ని ఫిలిప్పీన్స్, భారత్‌తో కుదుర్చుకుంది. ఇందులో భాగంగా ఇప్పటికే భారత్ ఆ దేశానికి చెందిన ఒక దీవిలో స్టోరేజ్ బిల్డింగ్ నిర్మాణాన్ని పూర్తి చేసింది. భారత రక్షణ రంగానికి సంబంధించి ఇదే మొదటి అతిపెద్ద అంతర్జాతీయ ఎగుమతి ఒప్పందం. ప్రస్తుతం ఫిలిప్పీన్స్‌కి ఎగుమతి చేస్తున్న బ్రహ్మోస్ పరిధి 290 కి.మీ. ప్రస్తుతం భారత్ సుదూర క్షిపణులను కలిగి ఉండగా.. ఫిలిప్పీన్స్‌కి డెలివరీ చేసేది షార్ట్ వెర్షన్.
ఫిలిప్పీన్స్-చైనా మధ్య ఇటీవల కాలంలో ఉద్రిక్తతలు పెరిగిన నేపథ్యంలో ఈ డెలివరీ జరుగుతోంది. ఇటీవల భారత విదేశాంగ శాఖ మంత్రి జైశంకర్ ఫిలప్పీన్స్ వెళ్లి ఆ దేశానికి సంఘీభావం ప్రకటించారు. స్కార్‌బరో షోల్ మరియు స్ప్రాట్లీ దీవులు, ఫిలిప్పీన్స్ మరియు చైనాల మధ్య గత రెండు సంవత్సరాలుగా ఉద్రిక్తతలకు కారణమవుతున్నాయి. బ్రహ్మోస్ ఇండియా-రష్యా జాయింట్ వెంచర్. ఈ క్షిపణి ధ్వని కన్నా మూడు రెట్ల(మాక్ 2.8) వేగంతో దూసుకెళ్తుంది. ప్రపంచంలో ఇప్పటి వరకు ఉన్న ఏకైక సూపర్ సోనిక్ క్రూయిజ్ మిస్సైల్ బ్రహ్మోస్ మాత్రమే. ఇది కోస్టల్ డిఫెన్స్, గ్రౌండ్ అటాక్ రోల్స్ రెండిండిని నిర్వహించగలదు.
తాజావార్తలు
-
Team India: టీమిండియాకు ఒక్క పరుగు షాక్.. ఇదేం మొదటిసారి కాదు!
-
iPhone 18 Launch Date: యాపిల్ ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్.. ఐఫోన్ 18 ప్రో లాంచ్ డేట్ లీక్..! ఫీచర్లు, ధరలు వైరల్..
-
Tilak Varma Fifty: కీలక హాఫ్ సెంచరీ చేసినా.. చెత్త జాబితాలో తెలుగు బ్యాటర్ తిలక్ వర్మ!
-
Boondi Sev Curry Recipe: ఇంట్లో కూరగాయలు లేవా..? పెరుగు, బూందీ, సేవ్‌తో సూపర్ టేస్టీ కూర..
-
G2: అడివి శేష్ స్పై థ్రిల్లర్‌కు బ్రేకులు.. ఈ ఏడాది రిలీజ్ కష్టమేనా?
ట్రెండింగ్
-
Gautam Gambhir: అయ్యా బాబోయ్.. గంభీర్ మాకు కోచ్‌గా వద్దు.. పసికూన క్రికెట్ బోర్డు ఎద్దేవా!
-
Smriti Mandhana: నీయవ్వ తగ్గేదేలే.. ఆస్ట్రేలియా అంటే బయపడుతామా?.. మా సత్తా ఏంటో చూపిస్తాం!
-
Kitchen Tips : ప్రెషర్ కుక్కర్ రబ్బర్ వదులై గ్యాస్ లీక్ అవుతుందా? ఈ సింపుల్ చిట్కాలు ట్రై చేయండి.!
-
Lunch Box Cleaning : లంచ్ బాక్స్ రబ్బరు మురికితో నల్లబడిందా..? ఇలా సింపుల్‌గా మెరిపించండి.!
-
Positive Energy at Home: ఇంట్లో నెగెటివ్ ఎనర్జీకి చెక్.. ఈ చిట్కాలతో పాజిటివ్ ఎనర్జీ మీ సొంతం.!