ఇతర దేశాలకు మరోసారి భారత్ వ్యాక్సిన్..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
కరోనాతో ప్రపంచం అతలాకుతలం అవుతున్న సమయంలో రెండు వ్యాక్సిన్లను తయారు చేసిన భారత్.. అగ్రదేశాలు ఎవరూ చేయని విధంగా.. ఉదారంగా ఇతర దేశాలకు సాయం చేసింది. కోట్లాది డోసులు ఉచితంగా చిన్న దేశాలకు పంపిణీ చేసి మానవత్వం చాటుకుంది. అయితే, కోవిడ్ థర్డ్‌వేవ్ ఎఫెక్ట్, టీకా కొరత, విపక్షాల విమర్శలతో గత కొన్ని నెలలుగా విదేశాలకు వ్యాక్సిన్ సరఫరా నిలిపి వేసిన ఇండియా… మరోసారి కరోనా టీకాలను ప్రపంచ దేశాలకు విరాళంగా ఇచ్చేందుకు సిద్ధమైంది.
కొవిడ్ వ్యాక్సిన్లను అక్టోబర్ నుంచి మళ్లీ ప్రపంచ దేశాలకు ఎగుమతులు, వ్యాక్సిన్ల విరాళాలుగా ఇవ్వడం ప్రారంభించనున్నట్లు ప్రకటించారు కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి మన్సుఖ్ మాండవీయ. భారతీయులకు టీకా ఇవ్వడమే తొలి ప్రాధాన్యమన్న ఆయన.. దేశీయ అవసరాలకు సరిపోగా మిగిలిన డోసులను వ్యాక్సిన్ మైత్రి కార్యక్రమం, కొవాక్స్‌కు సరఫరా చేయనున్నట్టు తెలిపారు. ప్రధాని మోడీ అమెరికా పర్యటనకు వెళ్లనున్న నేపథ్యంలో ఈ ప్రకటన చేయడం ప్రాధాన్యత సంతరించుకుంది. ఇప్పటికే 100 దేశాలకు 6.6కోట్ల డోసులను విదేశాలకు సరఫరా చేసిన కేంద్రానికి.. వచ్చే మూడు నెలల్లో మొత్తం 100 కోట్లకుపైగా వ్యాక్సిన్ డోసులు అందనున్నాయి. దేశవ్యాప్తంగా ఇప్పటివరకు 81 కోట్లకుపైగా డోసులు పంపిణీ చేసినట్లు ప్రభుత్వం ప్రకటించింది.
Also Read
- Suvendu Adhikari: బీజేపీ ప్రభుత్వానికి బుద్ధదేవ్ భార్య కితాబు.. సీపీఎం ప్రశంసలపై బెంగాల్లో చర్చ
- Anil Vij: "బొద్దింకల్ని చెప్పుతో నలిపేస్తారు".. కాక్రోచ్ పార్టీకి బీజేపీ మంత్రి సలహా..
- Anganwadi: గర్భిణీలకు ఇచ్చే ఆహారంలో పాము.. అంగన్వాడీ కేంద్రంలో కలకలం
- Cockroach Janta Party: ఇది ట్రైలర్ మాత్రమే.. కాక్రోచ్ జనతా పార్టీ హెచ్చరిక..
తాజావార్తలు
-
Suvendu Adhikari: బీజేపీ ప్రభుత్వానికి బుద్ధదేవ్ భార్య కితాబు.. సీపీఎం ప్రశంసలపై బెంగాల్లో చర్చ
-
Vaibhav Sooryavanshi: కోహ్లీ నుంచి అద్భుతమైన సలహా.. ‘ఆరెంజ్ క్యాప్’ విజేత వైభవ్ సూర్యవంశీ భావోద్వేగం..
-
Nag Ashwin: నిజమైన స్టార్డమ్ అంటే ఇదేనేమో! చెన్నై ఈవెంట్లో వైరల్ అవుతున్న నాగ్ అశ్విన్ వీడియో..
-
Anil Vij: “బొద్దింకల్ని చెప్పుతో నలిపేస్తారు”.. కాక్రోచ్ పార్టీకి బీజేపీ మంత్రి సలహా..
-
Traffic Jam : శ్రీశైలం వద్ద ట్రాఫిక్ నరకం.. 5 కిలోమీటర్ల మేర నిలిచిపోయిన వాహనాలు!
ట్రెండింగ్
-
Vaibhav Sooryavanshi-BCCI: బుడ్డోడు భలే లక్కీ.. రోహిత్, కోహ్లీకి లేని ప్రత్యేక సౌకర్యం!
-
Kitchen Tips : వండిన తర్వాత వచ్చే వెల్లుల్లి, చేపల వాసనను తొలగించడానికి ఇవి ఉంటే సరిపోతుంది.
-
Ants Control Tips : ఇంట్లో చీమల దండయాత్రా..? మీకు తెలియకుండానే చేస్తున్న ఈ తప్పులే కారణం.!
-
Career Growth : AI ప్రపంచంలో రాణించాలంటే.. ఈ 4 నైపుణ్యాలు నేర్చుకోండి
-
WhatsApp: మీ వాట్సాప్ చాట్స్ సురక్షితమేనా.? ఈ ఒక్క సెట్టింగ్ ఆన్ చేస్తే సేఫ్.!