Land Missile: భారత అంబులపొదిలో మరో అస్త్రం.. భూతల దాడి క్రూయిజ్ క్షిపణి పరీక్ష విజయవంతం
- భారత అంబులపొదిలో మరో అస్త్రం
- భూతల దాడి క్రూయిజ్ క్షిపణి పరీక్ష విజయవంతం
- శాస్త్రవేత్తలను అభినందించిన రాజ్‌నాథ్‌సింగ్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
భారత రక్షణ పరిశోధన, అభివృద్ధి సంస్థ (డీఆర్డీఓ) స్వదేశీ సాంకేతికతతో అభివృద్ధి చేసిన లాంగ్ రేంజ్ ల్యాండ్ అటాక్ క్రూయిజ్ మిస్సైల్ ప్రయోగం విజయవంతమైంది. సోమవారం ఒడిశా తీరంలోని డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం ద్వీపం నుంచి విజయవంతంగా పరీక్షించారు. ఈ ప్రయోగం డీఆర్డీఓ చరిత్రలో మరో కీలక మైలురాయిగా మిగిలింది.
పరీక్ష సందర్భంగా నిర్దేశించిన అన్ని లక్ష్యాలు పూర్తిగా సాధించినట్లు డీఆర్డీఓ వెల్లడించింది. చాందీపూర్‌లోని ఇంటిగ్రేటెడ్ టెస్ట్ రేంజ్‌కు చెందిన వివిధ ట్రాకింగ్ పరికరాలు సేకరించిన సమాచారంలో క్షిపణి నిర్దేశిత పనితీరును విజయవంతంగా ప్రదర్శించినట్లు నిర్ధారణ అయింది. ఈ క్షిపణి పూర్తిగా స్వదేశీ సాంకేతిక పరిజ్ఞానంతో అభివృద్ధి చేశారు. ఇందులో ఉపయోగించిన అన్ని ఉపవ్యవస్థలను డీఆర్డీఓకు చెందిన పలు ప్రయోగశాలలు, భారతీయ పరిశ్రమ భాగస్వాములు రూపొందించారు. ఈ ప్రాజెక్టుకు బెంగళూరులోని ఏరోనాటికల్ డెవలప్మెంట్ ఎస్టాబ్లిష్మెంట్ (ఏడీఈ) ప్రధాన ప్రయోగశాలగా వ్యవహరించింది.
Also Read
- Maharashtra Tragedy: బీచ్ ట్రిప్‌లో విషాదం.. నీటిలో మునిగి 8 మంది స్టూడెంట్స్ మృతి..
- CJP Protest: ‘‘3 రోజులు కాదు.. 3 నెలలు జైల్లో పెట్టినా పోరాటం ఆగదు’’.. సీజేపీ హెచ్చరిక!
- Bank Holidays: అన్ని శనివారాలూ బ్యాంకు సెలవులా? వైరల్ వార్తపై కేంద్రం క్లారిటీ!
- Smit Machchhar: భారత హీరో పైలట్‌కు గుజరాత్ అత్యున్నత పురస్కారం..
క్షిపణి ప్రయోగాన్ని డీఆర్డీఓ సీనియర్ అధికారులు, భారత నౌకాదళం, భారత వైమానిక దళానికి చెందిన ప్రతినిధులు ప్రత్యక్షంగా వీక్షించారు. ఈ విజయవంతమైన పరీక్షపై రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్ డీఆర్డీఓ శాస్త్రవేత్తలు, సిబ్బంది, పరిశ్రమ భాగస్వాములను అభినందించారు. స్వదేశీ రక్షణ సామర్థ్యాల బలోపేతంలో ఇది మరో ముఖ్యమైన ముందడుగుగా పేర్కొన్నారు.
పరీక్షా కార్యక్రమం మొత్తం సందర్భంగా రక్షణ శాఖ కార్యదర్శి, రక్షణ పరిశోధన, అభివృద్ధి విభాగం కార్యదర్శి, డీఆర్డీఓ ఛైర్మన్ రాజేష్ కుమార్ సింగ్ అన్ని కార్యకలాపాలను పర్యవేక్షించారు. క్షిపణి పరీక్షను విజయవంతంగా పూర్తి చేసిన శాస్త్రవేత్తలు, ఇంజినీర్లు, ఇతర బృంద సభ్యులను అభినందించారు. ఈ విజయంతో భారత్ స్వదేశీ క్షిపణి సాంకేతికతలో మరో కీలక మైలురాయిని అధిగమించినట్లు రక్షణ వర్గాలు భావిస్తున్నాయి.
తాజావార్తలు
-
ODI World Cup 2027 Schedule: వన్డే వరల్డ్‌కప్ షెడ్యూల్ వచ్చేసింది.. భారత్ x పాకిస్థాన్ సమరం ఎప్పుడంటే!
-
Off The Record : బీఆర్ఎస్లో ఎమ్మెల్సీ టికెట్ల గందరగోళం! ఒక సీటు బీసీకేనా? అసలు లెక్కేంటి?
-
AP: వారంలో ఆరు రోజులు గుడ్లు, మూడ్రోజులు చికెన్.. విద్యార్థులకు చంద్రబాబు సర్కార్ దసరా గిఫ్ట్!
-
OTR: కూటమి ఎమ్మెల్యేలకు రెడ్ అలర్ట్! 95 మంది డేంజర్ జోన్లో ఉన్నారా?
-
OTR: సీఎం టూర్లో బయటపడ్డ కాంగ్రెస్ విభేదాలు
ట్రెండింగ్
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!
-
Breakfast Quesadillas: రోజూ టిఫిన్ గురించి టెన్షన్ వద్దు.. జస్ట్ 20 నిమిషాల్లో రెడీ అయ్యే ఈ బ్రేక్‌ఫాస్ట్‌ను ట్రై చేయండి..
-
50MP కెమెరా, 6,000mAh బ్యాటరీ, డైమెన్సిటీ 6300 చిప్‌తో రూ.20,999కే Redmi 17C 5G లాంచ్..!
-
Asian Games 2026: శ్రీలంకపై భారత్ భారీ విజయం.. బంగారు పతకం కోసం భారత్, పాక్ పోరు.!
-
Asian Games 2026: వైభవ్ మెరుపులు.. ఇషాన్ ఊచకోత..! శ్రీలంక టార్గెట్ ఎంతంటే.?