India-Canada: కెనడా పౌరుల కోసం ఈ-వీసా పున:ప్రారంభించనున్న భారత్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
India-Canada: ఖలిస్తాన్ ఉగ్రవాది హర్దీప్ సింగ్ నిజ్జర్ హత్య భారత్, కెనడాల మధ్య దౌత్యవివాదంగా మారింది. ఈ హత్యలో భారత ప్రమేయం ఉందని కెనడా ఆరోపించడంతో ఇరు దేశాల మధ్య సంబంధాలు దెబ్బతిన్నాయి. కెనడాలోని భారత రాయబారిని అక్కడి ప్రభుత్వం బహిష్కరించింది. దీనికి ప్రతిగా భారత్ కూడా తీవ్రంగానే స్పందించింది. కెనడియన్ దౌత్యవేత్తను భారత్ వదిలివెళ్లాలని ఆదేశించింది. ఇదే కాకుండా కెనడియన్ పౌరులకు వీసాలను నిలిపివేస్తూ సంచలన నిర్ణయం తీసుకుంది.
ఇదిలా ఉంటే దాదాపు రెండు నెలల విరామం తర్వాత కెనడియన్ పౌరులకు ఈ-వీసా సేవల్ని భారత్ తిరిగి ప్రారంభించనున్నట్లు తెలుస్తోంది.. దౌత్యపరమైన వివాదం నేపథ్యంలో సెప్టెంబర్ 21న వీసాల సేవలను నిలివేశారు. టూరిస్ట్ వీసాలతో సహా అన్ని వీసా సేవల్ని ప్రస్తుతం పునరుద్ధరించనుంది. బిజినెస్, మెడికల్ వీసాలు గత నెలలోనే ప్రారంభమయ్యాయి. సెప్టెంబర్ నెలలో తదుపరి నోటీసులు వచ్చే వరకు వీసాలు నిలిపేస్తున్నట్లు భారత ప్రభుత్వం ప్రకటించింది.
Also Read
Read Also: Narendra Modi: తెలంగాణలో ప్రధాని మోడీ పర్యటన.. షెడ్యూల్ ఇదే.. !
హర్దీప్ సింగ్ నిజ్జర్ హత్య వెనక భారత ఏజెంట్ల ప్రమేయం ఉందని కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో ఆరోపించడం వివాదానికి కారణమైంది. తమ వద్ద నమ్మదగిన ఆరోపణలు ఉన్నాయని ఆయన అక్కడి పార్లమెంట్లో ప్రకటించారు. అయితే భారత్ కెనడా వ్యాఖ్యల్ని అసంబద్ద, రాజకీయ ప్రేరేపిత వ్యాఖ్యలుగా కొట్టేసింది. అయితే కెనడా తన మిత్ర దేశాల సాయంతో భారత్ పై ఒత్తిడి పెట్టేందుకు ప్రయత్నించింది.
ఈ నేపథ్యంలో ఇటీవల భారత విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ మాట్లాడుతూ.. కెనడా ఆరోపణలకు ఆధారాలు ఉంటే ఇవ్వాలని, ఇప్పటి వరకు తమకు ఎలాంటి ఆధారాలను కెనడా సమర్పించలేదని వెల్లడించారు. ఈ పరిణామాలు ఇరు దేశాల మధ్య ట్రేడ్ డీల్ నిలిచిపోవడానికి కారణమైంది. ఖలిస్తాన్ ఉగ్రవాది నిజ్జర్ని బ్రిటిష్ కొలంబియాలోని సర్రే ప్రాంతంలోని గురుద్వారా ముందు గుర్తుతెలియని వ్యక్తులు హత్య చేశారు. భారత ప్రభుత్వం 2020లో అధికారికంగా నిజ్జర్ని ఉగ్రవాదిగా ప్రకటించింది.
తాజావార్తలు
-
AK-203: AK-203 ‘షేర్’.. రష్యన్ టెక్నాలజీ, మేడ్ ఇన్ ఇండియా రైఫిల్
-
NMMS Scholarship : విద్యార్థులకు రూ.48 వేల స్కాలర్షిప్.. రేపే లాస్ట్ ఛాన్స్.!
-
Varanasi: 50కి పైగా భాషల్లో ‘వారణాసి’.. డబ్బింగ్ కోసం 1600 మందికి పైగా ఆర్టిస్టులు!
-
Bobby Deol: అప్పటివరకు సరైన హిట్ లేదు.. ‘యానిమల్’తో ఓవర్‌నైట్ సెన్సేషన్.. ఇప్పుడు ఆ ఇమేజ్‌పై పోరాటం!
-
Bangladesh: బంగ్లాదేశ్‌లో దారుణం.. హిందూ కుటుంబాన్ని చంపి ఇంట్లోనే తిని, స్నానం.
ట్రెండింగ్
-
Vaibhav Sooryavanshi: 8 పరుగులకే ఔట్.. అరంగేట్రంలోనే వైభవ్ సూర్యవంశీ అట్టర్ ఫ్లాఫ్!
-
Home Remedies: వర్షాకాలంలో ఇంట్లో జెర్రులు, దోమలు, చీమలు, నల్లులకు చెక్ పెట్టే చిట్కాలు ఇవే!
-
Home Safety Tips: పాములను ఇంట్లోకి రాకుండా తరిమికొట్టే చిట్కాలు ఇవే.. ఈ జాగ్రత్తలు తీసుకోండి..
-
Maharashtra: “ఇది కదా విశ్వాసం అంటే”.. యజమానులు తిరిగిరారని తెలియక.. తిండి, నీళ్లు మానేసిన పెంపుడు కుక్క
-
Karnataka: పెళ్లి కొడుకు రాహుల్ గాంధీ ఫ్యాన్.. పెళ్లి క్యాన్సల్ చేసిన యువతి? షాకింగ్ కారణం!