Nitish Kumar Reddy: మ్యాచ్ మా వైపు తిప్పుకోవడానికి మేము చేసిన ప్లాన్ ఇదే.. సక్సెస్ అయ్యాం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
క్రైస్ట్‌చర్చ్‌లోని హాగ్లీ ఓవల్ వేదికగా న్యూజిలాండ్‌తో జరిగిన రెండో టీ20లో భారత్ అద్భుత విజయాన్ని నమోదు చేసింది. ఈ విజయంతో ఐదు మ్యాచ్‌ల సిరీస్‌లో టీమిండియా 2-0 తేడాతో ఆధిక్యంలోకి దూసుకెళ్లింది. వంద పరుగులకే సగం వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడిన దశ నుంచి జట్టు అద్భుతంగా కోలుకుంది. కివీస్ పేసర్లు మాట్ హెన్రీ, జాకోబ్ డఫీ వేగంతో బంతులేస్తూ ఇబ్బంది పెట్టినప్పటికీ, మన తెలుగు తేజాలు తిలక్ వర్మ, నితీశ్ కుమార్ రెడ్డి అసాధారణ పోరాటపటిమను కనబరిచారు. ఒకానొక దశలో ఓటమి ఖాయమనిపించినా, ఏడో వికెట్‌కు ఈ జోడీ కేవలం 30 బంతుల్లోనే అజేయంగా 69 పరుగులు జోడించి జట్టును విజయతీరాలకు చేర్చింది.
మ్యాచ్ అనంతరం నితీశ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ.. కచ్చితంగా గెలుస్తామనే పూర్తి నమ్మకంతోనే బ్యాటింగ్ చేశామని, చివరి వరకు పట్టువదలకుండా పోరాడితే విజయం మనదే అవుతుందని గట్టిగా విశ్వసించామని తెలిపాడు. ఒక్క ఓవర్ కరెక్ట్‌గా దొరికితే మ్యాచ్‌ను పూర్తిగా మలుపు తిప్పొచ్చని అనుకున్నామని, అనుకున్నట్లే ఆ అవకాశం దొరికిందని, ఆ ఒక్క ఓవర్‌తోనే మ్యాచ్‌ను మా వైపునకు తిప్పుకోగలిగామని వివరించాడు.
Also Read
- Human Skull Found : మొన్న మహిళ కాలు.. నేడు మనిషి పుర్రె.. ఇబ్రహీంపట్నంలో మిస్టరీ
- Akhilesh Yadav: కాంగ్రెస్‌తో పొత్తుపై అఖిలేష్ కీలక ప్రకటన.!
- Traditional Indian Textile Recycling : పాత చీరలతో కొత్త మ్యాజిక్.. మన అమ్మమ్మల ఫ్యాషన్ సీక్రెట్.!
- AP Govt: ఒకవైపు పుష్కర ఏర్పాట్లు, మరోవైపు రిలయన్స్ ప్లాంట్ ప్రారంభం.. ఏపీలో డబుల్ ధమాకా..
ఈ క్లిష్ట సమయంలో కోచ్ గౌతమ్ గంభీర్ అందించిన మద్దతు, మైదానంలో ప్రశాంతంగా ఉండాలన్న సూచనలు తమకు ఎంతగానో సహాయపడ్డాయని తెలిపాడు. ఒత్తిడిని జయించి, వికెట్లు పడుతున్న సమయాల్లోనూ సంయమనం పాటిస్తే ఎలాంటి లక్ష్యాన్నైనా ఛేదించవచ్చని ఈ మ్యాచ్ నిరూపించింది. యువ ఆటగాళ్ల ఈ అద్భుత ప్రదర్శన రాబోయే మ్యాచ్‌ల్లో టీమిండియాకు మరింత ఆత్మవిశ్వాసాన్ని ఇస్తుందనడంలో ఎలాంటి సందేహం లేదు.
తాజావార్తలు
-
Koti Deepotsavam 2026 Day-8 Live: నేడు మరో విశేష ఘట్టం.. నరసింహస్వామి మహాభిషేకం.. తులసీ దామోదర కల్యాణం
-
Chandrabose: ‘నాటు నాటు’ ఆస్కార్ పాటకు 19 నెలలు కష్టపడ్డా!
-
Hanuman 2 : వివాదానికి తెరలేపనున్న హనుమాన్ 2 ప్రకటన?
-
Human Skull Found : మొన్న మహిళ కాలు.. నేడు మనిషి పుర్రె.. ఇబ్రహీంపట్నంలో మిస్టరీ
-
Anchor Suma: మాట్లాడాలంటే వణికిపోతున్నారా? ఆ భయాన్ని పోగొట్టడానికి సుమ కొత్త అవతారం
-
Akhilesh Yadav: కాంగ్రెస్‌తో పొత్తుపై అఖిలేష్ కీలక ప్రకటన.!
ట్రెండింగ్
-
Traditional Indian Textile Recycling : పాత చీరలతో కొత్త మ్యాజిక్.. మన అమ్మమ్మల ఫ్యాషన్ సీక్రెట్.!
-
Best Winter Destinations in India : వింటర్ ట్రిప్ ప్లాన్ చేస్తున్నారా?.. ఈ 10 ప్రదేశాలు మిస్ కావొద్దు.!
-
Curry Leaves Pickle: కమ్మని రుచితో, నెలల తరబడి నిల్వ ఉండే ‘కరివేపాకు పచ్చడి’.. వేడి వేడి అన్నంలోకి తింటే వావ్ అనాల్సిందే..!
-
Ambati Rayudu: హైదరాబాద్ ఆటగాళ్లకు ఎప్పుడూ అన్యాయమేనా..? ముంబై ఆటగాళ్లపై సంచలన వ్యాఖ్యలు..!
-
Ambati Rayudu: పని చేయాలంటే కోహ్లీలా.. పని చేయించాలంటే ధోనీలా ఉండాలి.!