Basit Ali: ‘తిలక్ వర్మనే అసలైన హీరో’.. తెలుగు తేజంపై పాకిస్థాన్ మాజీ దిగ్గజం కీలక వ్యాఖ్యలు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Basit Ali: న్యూజిలాండ్‌తో జరిగిన రసవత్తరమైన టీ20 మ్యాచ్‌లో భారత్ విజయం సాధించడంపై పాకిస్థాన్ మాజీ క్రికెటర్ బాసిత్ అలీ ప్రశంసల వర్షం కురిపించాడు. క్రిస్ట్‌చర్చ్ వేదికగా జరిగిన ఈ మ్యాచ్ ముగిసిన తర్వాత తన యూట్యూబ్ ఛానెల్లో మాట్లాడిన అతడు.. భారత్ విజయం వెనుక ఉన్న అసలు కారణాలను విశ్లేషించాడు. ‘తిలక్ వర్మనే అసలు హీరో’ అంటూ ప్రశంసించాడు. భారత జట్టు ప్రారంభంలోనే వరుసగా వికెట్లు కోల్పోయి ఓటమి అంచున నిలిచిన దశలో, యువ బ్యాటర్ తిలక్ వర్మ అద్భుతమైన పరిణతితో ఇన్నింగ్స్‌ను చక్కదిద్దారని బాసిత్ అలీ కొనియాడాడు. పెద్ద షాట్లు ఆడే రిస్క్ తీసుకోకుండా, సింగిల్స్, డబుల్స్‌తో పాటు చిన్న బౌండరీలను తెలివిగా ఉపయోగించుకుని ఇన్నింగ్స్‌ను విజయతీరాలకు చేర్చారని తెలిపాడు. ఓటమి ఖాయమనుకున్న మ్యాచ్‌ను తిలక్ వర్మ తన ఒంటరి పోరాటంతో భారత్ సొంతం చేశారని పేర్కొన్నాడు.
ఇదే మ్యాచ్‌లో కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ మూడో స్థానంలో వైభవ్ సూర్యవంశీని బ్యాటింగ్‌కు పంపిన నిర్ణయాన్ని ఆయన అభినందించాడు. అయితే, భవిష్యత్తులో ఇషాన్ కిషన్ ఫిట్నెస్ సాధించి తిరిగి జట్టులోకి వస్తే ప్లేయింగ్ ఎలెవన్ సమీకరణాలు మారే అవకాశం ఉందని అభిప్రాయపడ్డాడు. కేవలం తిలక్ వర్మ మాత్రమే కాకుండా, లోయరార్డర్లో వచ్చి మెరుపు ఇన్నింగ్స్‌లతో మ్యాచ్ స్వరూపాన్ని మార్చేసిన నమన్ ధీర్, నితీష్ కుమార్ రెడ్డిల ప్రదర్శనను కూడా ఆయన ప్రత్యేకంగా ప్రశంసించాడు. ఈ యువ ఆటగాళ్ల రాకతో టీమిండియా బెంచ్ బలం ఎంత పటిష్టంగా ఉందో మరోసారి రుజువైందని అన్నాడు. మరోవైపు, న్యూజిలాండ్ జట్టుపై బాసిత్ అలీ విమర్శలు గుప్పించాడు. కివీస్ కెప్టెన్ మిచెల్ సాంట్నర్ బౌలింగ్‌లో అద్భుతంగా రాణించి 4 వికెట్లు తీసినప్పటికీ, కీలక సమయాల్లో చేసిన వ్యూహాత్మక తప్పిపాల వల్లే చేతికొచ్చిన మ్యాచ్‌ను కోల్పోయిందని చెప్పాడు. గెలిచిన మ్యాచ్‌ను ప్రత్యర్థికి ఎలా సమర్పించుకున్నామోనని కివీస్ ఆటగాళ్లకు రాత్రంతా నిద్రపట్టి ఉండదని ఎద్దేవా చేశాడు. పరిమిత ఓవర్ల క్రికెట్లో ఆఖరి బంతి పడే వరకు మ్యాచ్ ఎప్పుడైనా మలుపు తిరగొచ్చని ఈ మ్యాచ్ మరోసారి నిరూపించిందన్నాడు.
Also Read
తాజావార్తలు
-
Basit Ali: ‘తిలక్ వర్మనే అసలైన హీరో’.. తెలుగు తేజంపై పాకిస్థాన్ మాజీ దిగ్గజం కీలక వ్యాఖ్యలు..
-
Jio IPO Creates 12 Records: జియో ఐపీఓ సరికొత్త రికార్డ్స్.. రూ.7.4 లక్షల కోట్ల బిడ్స్, 1.38 కోట్ల దరఖాస్తులు!
-
Nitish Kumar Reddy: మ్యాచ్ మా వైపు తిప్పుకోవడానికి మేము చేసిన ప్లాన్ ఇదే.. సక్సెస్ అయ్యాం..
-
Mitchel Santner: మేము గెలిచాం అనుకున్నాం.. అంతలోనే వాళ్లు మా కొంపముంచారు..
-
HYDRAA: సున్నం చెరువు చుట్టూ అక్రమ నీటి దందా.. రంగంలోకి దిగిన హైడ్రా
ట్రెండింగ్
-
Humanoid Robot : కత్తి దాడినే అడ్డుకుంది.. చైనా రోబో విన్యాసాలు చూస్తే మైండ్ బ్లాక్
-
Incredible India : ప్రపంచ రికార్డుల ఖజానా.. భారత్‌లో ఈ ప్రదేశాలు చూశారా.?
-
Spine Health : చిన్న అలవాట్లే వెన్నెముకకు ముప్పు.. మీ పొజిషన్స్ సరిగ్గా లేకపోతే ఇబ్బందే
-
Bottle Gourd Roti Recipe: సొరకాయతో టేస్టీ రోటీలు.. బ్రేక్‌ఫాస్ట్‌కు అదిరిపోయే హెల్తీ రెసిపీ..
-
Shreyas Iyer History: మరో 25 పరుగులే.. మొదటి టీమిండియా కెప్టెన్‌గా శ్రేయస్ అయ్యర్ చరిత్ర!