Tilak Varma: మ్యాచ్ గెలిచిన తర్వాత వర్మ వినూత్న సెలబ్రేషన్స్.. కౌంటర్ మాములుగా ఇవ్వలేదుగా..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
క్రైస్ట్‌చర్చ్ వేదికగా న్యూజిలాండ్‌తో జరిగిన రెండో టీ20లో టీమిండియా నాలుగు వికెట్ల తేడాతో అద్భుత విజయం సాధించి, ఐదు మ్యాచ్‌ల సిరీస్‌లో 2-0 ఆధిక్యంలో నిలిచింది. తొలి మ్యాచ్‌లో విఫలమయ్యాడనే విమర్శలు ఎదుర్కొన్న వైస్ కెప్టెన్ తిలక్ వర్మ, ఈ పోరులో తన బ్యాట్‌తోనే సమాధానం చెప్పాడు. ఒత్తిడిలో ఉన్న జట్టును విజయతీరాలకు చేర్చి తనపై వస్తున్న విమర్శలకు చెక్ పెట్టాడు.
ఈ మ్యాచ్‌లో ఆరంభంలో భారత బ్యాటర్లు త్వరత్వరగా పెవిలియన్ చేరడంతో జట్టు పీకల్లోతు కష్టాల్లో పడింది. గత మ్యాచ్‌లో ఆశించిన స్థాయిలో రాణించలేకపోవడంతో తిలక్ వర్మపై సోషల్ మీడియాలో తీవ్ర విమర్శలు వచ్చాయి. అయితే ఈసారి తనకి సరిపోయే ఆరో స్థానంలో బ్యాటింగ్‌కు దిగిన తిలక్, ఏ మాత్రం తడబడకుండా అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడాడు. ప్రత్యర్థి బౌలర్లను సమర్థవంతంగా ఎదుర్కొంటూ కేవలం 26 బంతుల్లోనే అజేయంగా 51 పరుగులు సాధించాడు.
Also Read
- International Men's Day: "నువ్వు మగాడివి.. ఏడవకూడదు".. నవ్వుతూ కనిపించే ప్రతి పురుషుడి వెనుక ఓ కన్నీటి గాథ..
- PM Modi: మాజీ ప్రధాని ఇందిరా గాంధీని స్మరించుకున్న ప్రధాన మంత్రి మోడీ..
- Yuzvendra Chahal Creates History: చరిత్ర సృష్టించిన చాహల్... టీ20 హిస్టరీలో ఒకే ఒక్కడు..!
- Bangladesh Violence: హింస గుప్పిట్లో బంగ్లాదేశ్.. మహ్మద్ యూనస్ ఇంటికి నిప్పు.. దేశవ్యాప్తంగా బాంబు పేలుళ్లు!
You know it’s clutch when @TilakV9 pulls out this celebration 🥶
#TeamIndia | #NZvIND https://t.co/WJTeZB1xzZ
— BCCI (@BCCI) October 24, 2026
తన ఇన్నింగ్స్‌లో ఆరు ఆకర్షణీయమైన ఫోర్లు, ఒక సిక్సర్ బాది జట్టును గెలిపించాడు. నితీశ్ కుమార్ రెడ్డితో కలిసి ఏడో వికెట్‌కు అజేయంగా అరవై తొమ్మిది పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పి చిరస్మరణీయ విజయాన్ని అందించాడు. మ్యాచ్ ముగిసిన తర్వాత తిలక్ వర్మ తన పెదవులపై వేలు ఉంచుతూ, చెవులను మూసుకునే సంజ్ఞలతో ప్రత్యేకంగా సెలబ్రేషన్స్ చేసుకున్నాడు. ఈ వినూత్న వేడుక తొలి మ్యాచ్ విమర్శకులకు అతడు ఇచ్చిన కౌంటర్‌గా చర్చనీయాంశమైంది. ఈ విజయంతో తిలక్ తన ఫామ్‌ను నిరూపించుకోవడంతో పాటు జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు.
తాజావార్తలు
-
International Men’s Day: “నువ్వు మగాడివి.. ఏడవకూడదు”.. నవ్వుతూ కనిపించే ప్రతి పురుషుడి వెనుక ఓ కన్నీటి గాథ..
-
Jasprit Bumrah Bowling: బుమ్రా మ్యాజిక్ బాల్.. నోరెళ్లబెట్టిన కివీస్ కెప్టెన్.. వీడియో చూడాల్సిందే!
-
Hyundai Neira Electric MPV: 51.4 kWh బ్యాటరీ, 490KM రేంజ్‌తో హ్యుందాయ్ కొత్త 7 సీటర్ EV..
-
PM Modi: మాజీ ప్రధాని ఇందిరా గాంధీని స్మరించుకున్న ప్రధాన మంత్రి మోడీ..
-
Yuzvendra Chahal Creates History: చరిత్ర సృష్టించిన చాహల్… టీ20 హిస్టరీలో ఒకే ఒక్కడు..!
ట్రెండింగ్
-
150 కి.మీ. రేంజ్, బ్యాటరీ స్వాపింగ్ సదుపాయంతో భారత్‌లోకి VinFast ఎలక్ట్రిక్ స్కూటర్లు..!
-
370 కి.మీ. రేంజ్, 10 అంగుళాల టచ్‌స్క్రీన్‌తో భారత్‌లోకి రానున్న VinFast VF5 ఫేస్‌లిఫ్ట్..!
-
India Wholesale Inflation: సామాన్యుడి నడ్డి విరుస్తున్న నిత్యావసరాల ధరలు.. నాలుగేళ్ల గరిష్టానికి టోకు ద్రవ్యోల్బణం!
-
38 గంటల బ్యాటరీ బ్యాకప్, IP57 రేటింగ్, 11mm డ్రైవర్లతో Xiaomi Clip Earbuds లాంచ్..!
-
21 రోజుల బ్యాటరీ లైఫ్, 150కి పైగా స్పోర్ట్స్ మోడ్ Xiaomi Watch S5 41mm వచ్చేసింది..! Smart Band 11 కూడానూ..