India Russia: ‘‘యుద్ధంపై మోడీ, పుతిన్ చర్చించారు..’’ నాటో చీఫ్ వ్యాఖ్యలను తిరస్కరించిన భారత్..
- ఉక్రెయిన్ యుద్ధంపై మోడీ, పుతిన్ మాట్లాడారు..
- నాటో చీఫ్ వ్యాఖ్యల్ని ఖండించిన భారత్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
India Russia: రష్యా నుంచి చమురు కొనుగోలు చేస్తూ, భారత్ పరోక్షంగా ఉక్రెయిన్ యుద్ధానికి సహకరిస్తుందనే ఆరోపణతో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ 50 శాతం సుంకాన్ని విధించాడు. అయితే, దీనిపై నాటో ఛీఫ్ మార్క్ రుట్టే సంచలన వ్యాఖ్యలు చేశారు. ట్రంప్ విధించిన సుంకాల దెబ్బ మోడీకి తగిలిందని, అందుకే మోడీ, రష్యా అధ్యక్షుడు పుతిన్‌కు ఫోన్ చేసి ఉక్రెయిన్ యుద్ధంపై మాట్లాడారని, యుద్ధ వ్యూహాలను అడిగారని అన్నారు.
Also Read
- DMK: ఏజ్ లిమిట్.. రెండు సార్లే పదవులు! ఓటమి తర్వాత స్టాలిన్ సంచలన నిర్ణయం
- Karnataka: పెళ్లి కొడుకు రాహుల్ గాంధీ ఫ్యాన్.. పెళ్లి క్యాన్సల్ చేసిన యువతి? షాకింగ్ కారణం!
- Pahalgam Terror Attack Case: పహల్గామ్ దాడి కేసులో కీలక పరిణామం.. హఫీజ్ సయీద్‌కు NIA సమన్లు
- MK. Stalin: 110 రోజుల తర్వాత ఓటమిపై స్టాలిన్ సంచలన వ్యాఖ్యలు
అయితే, ఈ వ్యాఖ్యల్ని భారత్ తీవ్రంగా ఖండించింది. నాటో సెక్రటరీ జనరల్ మార్క్ రుట్టే చేసిన వాదనను పూర్తిగా తిరస్కరించింది. ఈ వ్యాఖ్యలు పూర్తిగా నిరాధారమైనవని విదేశాంగ మంత్రిత్వ శాఖ పేర్కొంది. ఒక ప్రకటనలో.. NATO నాయకత్వం అటువంటి ప్రకటనలు చేసేటప్పుడు మరింత బాధ్యతాయుతంగా ఉంటుందని ఆశిస్తున్నట్లు మంత్రిత్వ శాఖ పేర్కొంది. “ఎప్పుడూ జరగని సంభాషణలు” గురించి ఊహాజనిత వ్యాఖ్యలు “ఆమోదయోగ్యం కాదు” అని నొక్కి చెప్పింది.
“ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ మధ్య జరిగినట్లు చెబుతున్న ఫోన్ సంభాషణకు సంబంధించి నాటో సెక్రటరీ జనరల్ మార్క్ రుట్టే చేసిన ప్రకటనను మేము చూశాము. ఆ ప్రకటన వాస్తవంగా తప్పు, పూర్తిగా నిరాధారమైనది. ప్రధానమంత్రి మోడీ అధ్యక్షుడు పుతిన్‌తో సూచించిన విధంగా ఎప్పుడూ మాట్లాడలేదు. అలాంటి సంభాషణ జరగలేదు” అని మంత్రిత్వ శాఖ ప్రకటనలో పేర్కొంది. జాతీయ ప్రయోజనాలు, ఆర్థిక భద్రతను దృష్టిలో ఉంచుకుని భారత్ ఇంధన దిగుమతి నిర్ణయాలు తీసుకుంటుందని విదేశాంగ మంత్రిత్వ శాఖ పునరుద్ఘాటించింది.
తాజావార్తలు
-
DMK: ఏజ్ లిమిట్.. రెండు సార్లే పదవులు! ఓటమి తర్వాత స్టాలిన్ సంచలన నిర్ణయం
-
Karnataka: పెళ్లి కొడుకు రాహుల్ గాంధీ ఫ్యాన్.. పెళ్లి క్యాన్సల్ చేసిన యువతి? షాకింగ్ కారణం!
-
Tollywood Directors: రాజమౌళి హిట్ ఫార్ములా.. ఇప్పుడు సుక్కుతో సహా టాలీవుడ్ స్టార్ డైరెక్టర్లందరిదీ అదే దారేనా?
-
Pahalgam Terror Attack Case: పహల్గామ్ దాడి కేసులో కీలక పరిణామం.. హఫీజ్ సయీద్‌కు NIA సమన్లు
-
AP Job Calendar 2026: నిరుద్యోగులకు గుడ్‌న్యూస్.. 10,060 పోస్టులతో జాబ్ క్యాలెండర్ 2026..
ట్రెండింగ్
-
64MP కెమెరా, 5,700mAh బ్యాటరీతో వచ్చేసిన Philips S7221 5G ఫోన్.. ధర ఎంతంటే?
-
Crispy Veggie Fingers: బయట క్రిస్పీ.. లోపల సాఫ్ట్.! నోరూరించే ‘క్రిస్పీ వెజ్జీ ఫింగర్స్’ సింపుల్ అండ్ టేస్టీ స్నాక్ చేసేయండి ఇలా.!
-
7 సీటర్‌కు బదులు 6 సీటర్.. క్యాప్టెన్ సీట్లతో Mahindra XEV 9S కొత్త వేరియంట్..!
-
స్టీరియో స్పీకర్లు, 6 ఏళ్ల సెక్యూరిటీ అప్డేట్స్, 7,900mAh బ్యాటరీతో POCO M8x 5G వచ్చేసింది.. ధర, ఫీచర్లు ఇవే!
-
Saturday Horoscope: ఆ రాశివారికి చాలా కాలంగా నిలిచిపోయిన పనులను పూర్తి చేస్తారు.. నేటి దినఫలాలు ఇలా.!