India Russia: రష్యా నుంచి చమురు కొనుగోలు చేస్తూ, భారత్ పరోక్షంగా ఉక్రెయిన్ యుద్ధానికి సహకరిస్తుందనే ఆరోపణతో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ 50 శాతం సుంకాన్ని విధించాడు. అయితే, దీనిపై నాటో ఛీఫ్ మార్క్ రుట్టే సంచలన వ్యాఖ్యలు చేశారు. ట్రంప్ విధించిన సుంకాల దెబ్బ మోడీకి తగిలిందని, అందుకే మోడీ, రష్యా అధ్యక్షుడు పుతిన్‌కు ఫోన్ చేసి ఉక్రెయిన్ యుద్ధంపై మాట్లాడారని, యుద్ధ వ్యూహాలను అడిగారని అన్నారు.
మోడీ-పుతిన్ సంబంధాలపై నాటో చీఫ్ మార్క్ రుట్టే కీలక వ్యాఖ్యలు చేశారు. ఉక్రెయిన్‌తో యుద్ధం విషయంలో ఎలా ముందుకెళ్తున్నారన్న విషయంపై రష్యా అధ్యక్షుడు పుతిన్‌ను ప్రధాని మోడీ ఆరా తీసినట్లు నాటో చీఫ్ పేర్కొన్నారు.
భారత్ వంటి దేశాలపై బెదిరింపులు మంచిది కావనే అభిప్రాయాలు వెలువడుతున్నాయి. ఇక, యూరోపియన్ దేశాలు ఇప్పటికీ రష్యా నుంచి చమురును కొనుగోలు చేస్తున్నప్పటికీ, వాటిపై ఎందుకు మాట్లాడటం లేదని ప్రశ్నిస్తున్నారు.