India At UN: ఐక్యరాజ్య సమితిలో పాకిస్తాన్ ప్రధాని షహబాజ్ షరీఫ్ అబద్ధాలకు భారత్ ధీటుగా బదులిచ్చింది. నిన్న యూఎన్ జనరల్ అసెంబ్లీ సమావేశాల్లో షరీఫ్ మాట్లాడుతూ.. తాము ఆపరేషన్ సిందూర్ సమయంలో భారత్‌ను ఓడించామని ప్రగల్భాలు పలికారు. ట్రంప్ మధ్యవర్తిత్వంతో కాల్పుల విరమణకు పాకిస్తాన్ అంగీకరించిందని చెప్పుకొచ్చారు. ట్రంప్ శాంతి కాముకుడని, ఆయనకు నోబెల్ బహుమతి ఇవ్వాలని పాకిస్తాన్ ప్రతిపాదించింది. హిందుత్వ ఉగ్రవాదం ప్రపంచానికి ప్రమాదకరమని అసత్యాలను ప్రచారం చేశాడు.
Read Also: Trump: లీసా మోనాకోను ఉద్యోగం నుంచి తొలగించండి.. మైక్రోసాఫ్ట్‌కు ట్రంప్ ఆదేశాలు
అయితే, ఈ రోజు పాకిస్తాన్ తీరుపై భారత్ యూఎన్ వేదికగా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. భారత దౌత్యవేత్త పెటల్ గహ్లోత్ మాట్లాడుతూ.. ఉగ్రవాదం పాకిస్తాన్ విదేశాంగ విధానానికి కేంద్ర బిందువుగా ఉందని అన్నారు. అల్ ఖైదా చీఫ్ ఒసామా బిన్ లాడెన్‌కు పాకిస్తాన్ ఆశ్రయం కల్పించిన విషయాన్ని భారత్ మరోసారి గుర్తు చేసింది. పాకిస్తాన్ ఉగ్రవాదాన్ని ఎగుమతి చేయడంలో ప్రసిద్ధి చెందిందని భారత్ ఆగ్రహం వ్యక్తం చేసింది.
‘‘ మేము యుద్ధం గెలిచాము. ఈ ప్రాంతంలో శాంతిని గెలుచుకోవడానికి ప్రయత్నిస్తున్నాము’’ అని షెహబాజ్ షరీఫ్ చేసిన ప్రకటనపై భారత్ స్పందిస్తూ… మే 10న పాకిస్తాన్ సైన్యం దాడిని ఆపేయాలని భారత్ ను కోరుకున్న విషయాన్ని గహ్లోత్ గుర్తు చేశారు. పాకిస్తాన్ రన్ వేలు, హ్యాంగర్లు ధ్వంసమైన రుజువలు ఇప్పటికీ ఉన్నాయని, ఇవన్నీ ధ్వంసమైనా పాకిస్తాన్ దానిని ఆస్వాదిస్తోందని ఎద్దేవా చేశారు. నిజంగా పాకిస్తాన్ శాంతిని కోరుకుంటే, వెంటనే ఆ దేశం ఉగ్రవాద శిబిరాలను మూసేయాలని, భారత్ కోరుకునే ఉగ్రవాదుల్ని అప్పగించాలని ఆమె అన్నారు.
