తగ్గేదే లే… ఒక్కరోజులో 1.41 లక్షల కరోనా కేసులు, 285 మరణాలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
దేశంలో కరోనా కేసులు మరింత తీవ్రరూపం దాలుస్తున్నాయి. వారం కిందటి వరకు ప్రతిరోజూ వేలల్లో నమోదైన కరోనా కేసులు ప్రస్తుతం లక్షల్లో నమోదవుతున్నాయి. దేశంలో గడిచిన 24 గంటల్లో 1,41,986 కరోనా పాజిటివ్ కేసులు నమోదైనట్లు కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడించింది. దీంతో దేశంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 3,53,68,312కి చేరింది. నిన్న 285 మంది కరోనాతో మృతి చెందినట్లు కేంద్రం తెలిపింది. దీంతో ఇప్పటివరకు మొత్తం కరోనా మరణాల సంఖ్య 4,83,178కి చేరింది.
India reports 1,41,986 fresh COVID cases, 40,895 recoveries, and 285 deaths in the last 24 hours
Also Read
- Priyanka Gandhi: ‘మహిళలకు భద్రత లేకపోతే ఎన్ని పథకాలు పెడితే ఏం లాభం?’.. బీహార్, ఢిల్లీ ఘటనలపై ప్రియాంక గాంధీ ఆవేదన
- Minister Keerthana Health Controversy: మంత్రి కీర్తన లండన్ వెళ్లకపోవడంపై వివాదం.. అసలు కారణం ఇదేనా?
- Sahil Wakode Death: ‘‘నా కొడుకును బెదిరించారు’’.. ప్రొఫెసర్లపై సాహిల్ తండ్రి ఆరోపణ..
- CJP: మరో విద్యాశాఖ మంత్రి రాజీనామాకు సీజేపీ డిమాండ్..
Daily positivity rate: 9.28%
Active cases: 4,72,169
Total recoveries: 3,44,12,740
Death toll: 4,83,463Total vaccination: 150.06 crore doses pic.twitter.com/ptYMOqdegy
— ANI (@ANI) January 8, 2022
ప్రస్తుతం దేశంలో కరోనా యాక్టివ్ కేసుల సంఖ్య 4,72,169గా నమోదైంది. కొత్తగా 40,895 మంది కరోనా నుంచి కోలుకున్నారు. దీంతో దేశవ్యాప్తంగా రికవరీల సంఖ్య 3,44,12,740కి చేరింది. దేశంలో కరోనా పాజిటివిటీ రేటు 98.36 శాతంగా ఉంది. గడిచిన 24 గంటల్లో 90,59,360 మందికి కరోనా వ్యాక్సిన్లు వేశామని… ఇప్పటి వరకు దేశ వ్యాప్తంగా 150.06 కోట్ల మందికి కరోనా వ్యాక్సిన్లు వేసినట్లు ఆరోగ్యశాఖ ప్రకటించింది.
మరోవైపు దేశంలో ఒమిక్రాన్ కేసుల సంఖ్య 3,071కి చేరింది. అత్యధికంగా మహారాష్ట్రలో 876, ఢిల్లీలో 513, కర్ణాటకలో 333, రాజస్థాన్లో 291, కేరళలో 284, గుజరాత్లో 204, తెలంగాణలో 123, తమిళనాడులో 121, హర్యానాలో 114, ఒడిశాలో 60, ఏపీలో 28 ఒమిక్రాన్ కేసులు నమోదయ్యాయి. ఇప్పటివరకు 1,203 మంది ఒమిక్రాన్ నుంచి కోలుకున్నారు.

తాజావార్తలు
-
Off The Record: తెలంగాణ మహిళా శిశు సంక్షేమ శాఖలో కాంట్రాక్టర్స్ రాజ్యం..!
-
Honda CB500 Launched in India: రాయల్ ఎన్ఫీల్డ్కు పోటీ..! హోండా CB500 విడుదల.. ధర, ఫీచర్లు ఇవే..
-
iQOO Z11 Lite 5G: 6500mAh బ్యాటరీ, 44W ఫాస్ట్ ఛార్జింగ్, IP65 రేటింగ్.. iQOO నుంచి కొత్త ఫోన్ లాంచ్..
-
Off The Record : రేపల్లెలో వైసీపీ కోవర్ట్ పాలిటిక్స్? మోపిదేవి సస్పెన్షన్ వెనుక కథేంటి?
-
AP Local Body Elections: స్థానిక ఎన్నికలకు మరో ముందడుగు..
ట్రెండింగ్
-
మిలిటరీ గ్రేడ్ బాడీ, 120Hz డిస్ప్లే, 7,000mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో OnePlus N6 Lite.. ధర ఎంతంటే?
-
Team India History: భారత్ @ 200.. టీ20ల్లో తొలి జట్టుగా భారత్ వరల్డ్ రికార్డ్!
-
1.5K 144Hz OLED డిస్ప్లే, 7200mAh బ్యాటరీతో అక్టోబర్ 6న రాబోతున్న VIVO V80..!
-
India Win Gold Medal: ఆసియా క్రీడలు 2026 మహిళా క్రికెట్ విజేతగా టీమిండియా..! స్వర్ణ పతకం కైవసం..
-
Asian Games 2026 Final: శ్రీలంక బౌలర్లపై స్మృతి మంధాన శివతాండవం.. లంక ముందు భారీ టార్గెట్.!