‘నెక్స్ట్ టైమ్ కొడితే దిమ్మతిరిగిపోవాలి’.. ‘పారడైజ్’ టాక్ వేళ Nani-Srikanth Odela క్రేజీ ప్రామిస్!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Nani-Srikanth Odela:‘దసరా’తో బాక్సాఫీస్ వద్ద ప్రకంపనలు సృష్టించిన నేచురల్ స్టార్ నాని, దర్శకుడు శ్రీకాంత్ ఓదెల కాంబినేషన్ క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. వీరిద్దరి కలయికలో వచ్చిన తాజా చిత్రం ‘ది ప్యారడైజ్’ ప్రస్తుతం థియేటర్లలో సందడి చేస్తుంది. అయితే ఈ సినిమాపై ఫస్ట్ షో నుంచే మిక్సిడ్ రియాక్షన్స్ వ్యక్తమవుతున్నాయి. కొందరు సినిమాను ఆకాశానికెత్తేస్తుంటే, మరికొందరు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. సరిగ్గా ఇలాంటి విమర్శలు, మిశ్రమ స్పందనల వేళ.. హీరో నాని, డైరెక్టర్ శ్రీకాంత్ ఓదెల ఇచ్చిన ఒక అనూహ్యమైన స్టేట్మెంట్ ఇప్పుడు ఇండస్ట్రీ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది. తాము మళ్లీ కలిసి సినిమా చేస్తే, ఇప్పుడు వస్తున్న విమర్శలన్నింటికీ ఆ ప్రాజెక్ట్‌తోనే సమాధానం చెబుతామని శపథం చేశారు.
రిలీజ్ తర్వాత ఎదురైన మిక్సిడ్ రియాక్షన్స్ ఏమాత్రం దాచుకోకుండా, చాలా హుందాగా విశ్లేషించుకున్న నాని.. శ్రీకాంత్ ఓదెలతో తన భవిష్యత్ ప్రయాణంపై క్లారిటీ ఇచ్చారు. “ఈరోజు ‘ది పారడైజ్’ విషయంలో ఆడియన్స్ ఇచ్చిన ప్రతి ఫీడ్‌బ్యాక్‌ను, వాళ్లు చెప్తున్న నెగెటివ్స్ అన్నింటినీ మేము పూర్తి బాధ్యతతో స్వీకరిస్తున్నాం. ఇప్పుడు ఏ లోపాలైతే ఎత్తిచూపుతున్నారో.. అవన్నీ మాకు ఒక బిగ్ ప్లస్ పాయింట్‌గా మారాలి. శ్రీకాంత్ నుంచి నెక్స్ట్ వచ్చే సినిమా అయినా, లేదా మేమిద్దరం కలిసి మళ్లీ చేసే ప్రాజెక్ట్ అయినా సరే.. ఈరోజు ఎవరైతే నచ్చలేదని మాట్లాడుతున్నారో, వాళ్లు కూడా కాలర్ ఎగరేసి థియేటర్లలో సెలబ్రేట్ చేసుకునేలా ఉండాలి. ఆ స్థాయిలో కసిగా మా నెక్స్ట్ వర్క్ ఉంటుంది” అని నాని తేల్చిచెప్పారు. ప్రేక్షకుల నుంచి వస్తున్న రియాక్షన్స్‌ను నాని చాలా పాజిటివ్‌గానే తీసుకున్నారు. “నచ్చలేదనే వాళ్లలో ఎంత కోపం కనిపిస్తోందో.. సూపర్ హిట్ అనే వాళ్లలోనూ అంతే అగ్రెసివ్నెస్ ఉంది. అది కేవలం సినిమా మీద ఉన్న అభిప్రాయం మాత్రమే కాదు, మా ఇద్దరి కాంబినేషన్‌పై ప్రేక్షకులు పెట్టుకున్న అమితమైన నమ్మకం, ప్రేమ. ఆ ట్రస్ట్‌ను నిలబెట్టుకోవడానికి భవిష్యత్తులో మరింత పక్కాగా బరిలోకి దిగుతాం” అని నాని ధీమా వ్యక్తం చేశారు.
Also Read
డైరెక్టర్ శ్రీకాంత్ ఓదెల కూడా ఎడిటింగ్ విషయంలో జరిగిన కొన్ని తప్పుల వల్లే నరేషన్ సరిగ్గా కన్వే కాలేదని బహిరంగంగా ఒప్పుకున్నారు. అయితే ఈ అనుభవం తనను రాటుదేలేలా చేసిందని, నెక్స్ట్ స్టెప్ మరింత పవర్‌ఫుల్‌గా ఉంటుందని పరోక్షంగా స్పష్టం చేశారు. సాధారణంగా ఒక సినిమాకు మిక్సిడ్ టాక్ వస్తే హీరోలు, డైరెక్టర్స్ కాంబినేషన్‌ను రిపీట్ చేసేందుకు వెనుకాడతారు. కానీ లోపాలను నిక్కచ్చిగా అంగీకరిస్తూనే, “మా ప్రయాణం ఆగదు.. నెక్స్ట్ టైమ్ కొడితే అందరి నోళ్లూ మూతపడాల్సిందే” అనే రీతిలో నాని, శ్రీకాంత్ కలిసి మరో చిత్రానికి సిద్ధమవ్వడం ఫ్యాన్స్‌కు కొత్త ఉత్సాహాన్నిస్తోంది. ఈ ఇద్దరి కాంబినేషన్లో రాబోయే మూడో ప్రాజెక్ట్‌న ఇప్పుడే అధికారికంగా ప్రకటించిక పోయినా భవిష్యత్తులో మాత్రం పక్కా ఉంటుందని నాని – శ్రీకాంత్ ఓదెల ఫ్యాన్స్ మస్త్ ఖుషీ అవుతున్నారు.
తాజావార్తలు
-
‘నెక్స్ట్ టైమ్ కొడితే దిమ్మతిరిగిపోవాలి’.. ‘పారడైజ్’ టాక్ వేళ Nani-Srikanth Odela క్రేజీ ప్రామిస్!
-
CJP: కాక్రోచ్ పార్టీకి హిమంత మామ ట్రీట్మెంట్.. రాంకా అరెస్ట్, అభిజత్ దీప్కే ఆగ్రహం..
-
Kishan Reddy: మేము ఓట్లను చోరీ చేయం.. ప్రజల మనసులను గెలుచుకుంటాం..
-
Aadhaar Biometric Update: ఆధార్ కార్డుదారులకు బిగ్ అలర్ట్.. ఆ ఫ్రీ అప్డెట్కు సెప్టెంబర్ 30 చివరి తేదీ!
-
CM Vijay: కరూర్ తొక్కిసలాటకు ఏడాది.. ‘ఎప్పటికీ మానని గాయం’ అంటూ సీఎం విజయ్ భావోద్వేగం
ట్రెండింగ్
-
Why Do Dogs Howl at Night: రాత్రిపూట కుక్కలు ఎందుకు ఏడుస్తాయి? దెయ్యాలు కనిపిస్తాయా?.. అసలు రహస్యం ఇదే!
-
Xiaomi Pocket Guitar: చేతిలో ఫోన్.. వెనుక గిటార్..! Xiaomi సరికొత్త యాక్సెసరీ మాములుగా లేదుగా.!
-
Hardik Pandya: రీఎంట్రీకి మరో బ్రేక్.. స్కాన్‌లో బయటపడ్డ కొత్త గాయం.!
-
Saturday Horoscope: ఆ రాశి వారికి నేడు పట్టిందల్లా బంగారమే.. నేటి రాశిఫలాలు ఇలా.!
-
Nuclear Weapons: 12 వేలకుపైగా అణ్వాయుధాలు.. ప్రపంచానికి పొంచి ఉన్న ముప్పేంటి.?