PM Modi: ప్రధానమంత్రి గురువారం అమెరికా ఉభయ సభల సంయుక్త సమావేశంలో చారిత్రాత్మక ప్రసంగం చేశారు. భారతదేశంలో ‘‘భిన్నత్వంలో ఏకత్వం’’ని ప్రస్తావించారు. భారతదేశం అన్ని ప్రపంచంలోని అన్ని విశ్వాసాలకు నిలయం ప్రధాని మోడీ అన్నారు. ‘‘ఇండియాలో 2500 రాజకీయ పార్టీలు ఉన్నాయి.. 22 అధికారిక భాషలు ఉన్నాయి.. అయినప్పటికీ మేమంతా ఒకే మాటపై ఉంటాము, ప్రతీ 100 మైళ్లకు మా వంటలు దోశ నుంచి ఆలూ పరాటా వరకు మారుతుంటాయి’’ అని ఆయన అన్నారు. నేడు ప్రపంచం భారత్ గురించి మరింత తెలుసుకోవాలని అనుకుంటోందని అన్నారు.
Read Also: Titan Submarine: టైటాన్ ఆచూకీ లభ్యం.. అమెరికన్ కోస్ట్ గార్డ్ వెల్లడి
అమెరికా కాంగ్రెస్ లో మాట్లాడటం ఎప్పుడూ గౌరవమే అని.. నేను భారతీయుల తరుపున కృతజ్ఞతలు తెలియజేస్తున్నానని అన్నారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(AI)ని ప్రస్తావిస్తూ భారత్ అమెరికా బంధాన్ని AI గా అభివర్ణించారు. భారతదేశ మూలాలు ఉన్న చాలా మంది ఇక్కడ ఉన్నారని.. ఇందులో చరిత్ర సృష్టించిన కమలా హారిస్ కూడా ఇక్కడ ఉన్నారని ఆయన అన్నారు. భారతదేశం ప్రజాస్వామ్యానికి తల్లిగా అభివర్ణించారు. అమెరికా అత్యంత పురాతనమైనదని, భారతదేశం అతిపెద్ద ప్రజాస్వామ్యమని ప్రధాని మోదీ పేర్కొన్నారు.
ప్రధాని హోదాలో తొలిసారిగా అమెరికా సందర్శించిన సమయంలో భారత్ 10వ ఆర్థిక వ్యవస్థగా ఉందని.. ఇప్పుడు 5వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థాగా ఉందని.. త్వరలోనే మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా మారుతామని.. భారత అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతోందని మోడీ అన్నారు. భారత్ అభివృద్ధి చెందితే.. ప్రపంచం అభివృద్ధి చెందుతుందని ఆయన అన్నారు.