NTV Telugu Site icon

India-Pakistan: వక్రబుద్ధి మార్చుకోని పాకిస్థాన్‌.. భారత్ స్ట్రాంట్ కౌంటర్

Ind

Ind

India-Pakistan: ఎన్నిసార్లు భంగపడినా పాక్ మాత్రం తన వక్రబుద్ధిని మార్చుకోవడం లేదు. ఈసారి ఐక్యరాజ్య సమితి వేదికగా భారత్‌పై పాకిస్థాన్‌ అక్కసు వెళ్లగక్కింది. దీనికి మన దౌత్యవేత్త భవిక మంగళానందన్‌ స్ట్రాంట్ కౌంటర్ ఇచ్చింది. పాక్‌ ప్రధాని షెహబాజ్‌ కశ్మీర్‌ అంశాన్ని లేవనెత్తడంతో పాటు ఆర్టికల్‌ 370 రద్దుపై అసత్య ప్రచారం చేస్తుందని పేర్కొనింది. ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశమైన భారత్‌ గురించి పాక్ మాట్లాడటమేంటో అని ప్రశ్నించింది.

Read Also: Bus Accident: ట్రావెల్స్‌ బస్సును ఢీకొట్టిన కంటైనర్‌ లారీ.. ఇద్దరు మృతి, 11 మందికి గాయాలు

ఈ ప్రపంచ వేదిక మీద అవాస్తవాలను వినాల్సి వస్తుందని భారత దౌత్యవేత్త భవిక మంగళానందన్ తెలిపారు. పాక్‌ సుదీర్ఘకాలంగా సీమాంతర ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తూ.. పొరుగు దేశాలపై దాడులకు చేస్తుందని చెప్పుకొచ్చారు. ఎన్నికల్లో రిగ్గింగ్‌ చేసే దేశం.. ప్రజాస్వామ్యం గురించి మాట్లాడుతోంది అని ఆమె మండిపడింది. పాకిస్థాన్ మా భూభాగాన్ని కోరుకుంటోంది. జమ్మూకశ్మీర్‌లో ఎన్నికలకు అవాంతరం కలిగించేందుకు నిరంతరం ఉగ్రవాదాన్ని ఉపయోగిస్తోంది అని ఆరోపించింది. మిలిటరీ సాయంతో నడుస్తూ.. ఉగ్రవాదం విషయంలో వరల్డ్ వైడ్ గా గుర్తింపుపొందిన పాక్‌.. భారత్‌ గురించి మాట్లాడే హక్కు లేదని భవిక హెచ్చరించింది.

Read Also: Chiranjeevi – Venkatesh – Balakrishna: చూడడానికి రెండు కళ్లు సరిపోవట్లేదుగా.. ఒకే ఫ్రేములో ముగ్గురు లెజెండ్స్!

ఇక, ఐక్యరాజ్యసమితి జనరల్‌ అసెంబ్లీ 79వ సెషన్‌లో సాధారణ చర్చ సందర్భంగా పాక్ ప్రధాని షరీఫ్ జమ్మూకశ్మీర్‌ విషయాన్ని లేవనెత్తడంతో పాటు ఆర్టికల్‌ 370 గురించి ప్రస్తావించారు. దాదాపు 20 నిమిషాల పాటు చేసిన ప్రసంగంలో పాక్ లోని సమస్యలను వదిలేసిన షరీఫ్‌.. కేవలం కశ్మీర్‌ గురించే సుదీర్ఘంగా ప్రసంగించారు. పాలస్తీనా ప్రజల వలే జమ్మూకశ్మీర్‌ ప్రజలు కూడా స్వేచ్ఛ, నిర్ణయాధికారం కోసం పోరాడుతున్నట్లు అతడు కామెంట్స్ చేశారు. శాంతిస్థాపన కోసం 2019 ఆగస్టులో భారత్‌ ఏకపక్షంగా చేపట్టిన చర్యలను వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఐరాస భద్రతా తీర్మానాలకు అనుగుణంగా కశ్మీర్‌ సమస్యపై శాంతియుత పరిష్కారం కోసం చర్చలకు రావాలని తెలిపారు.