Lok Sabha Election 2024 : దేశంలో లోక్‌సభ ఎన్నికలకు సన్నాహాలు ఊపందుకున్నాయి. ఎన్నికల సంఘం కూడా శనివారం ఎన్నికల తేదీలను ప్రకటించనుంది. అప్పుడు వచ్చే ఐదేళ్లపాటు అధికార పగ్గాలు ఎవరి చేతుల్లో ఉండాలో దేశ ప్రజల ఓటు నిర్ణయిస్తుంది.
Election Commission: మరికొన్ని రోజుల్లో దేశంలో సార్వత్రిక ఎన్నికలు జరగబోతున్నాయి. ఈ నేపథ్యంలో ఇప్పటికే కేంద్ర ఎన్నికల సంఘం అన్ని ఏర్పాట్లను చకచక పూర్తి చేస్తోంది. ఇదిలా ఉంటే త్వరలో జరగబోయే లోక్‌సభ ఎన్నికల్లో దాదాపుగా 97 కోట్ల మంది భారతీయులు ఓటు వేసేందుకు అర్హులని ఎన్నికల సంఘం శుక్రవారం వెల్లడించింది. 18-29 ఏళ్ల మధ్య గల యంగ్ ఓటర్లు 2 కోట్ల మంది కొత్తగా ఓటర్ లిస్టులో చేరినట్లు వెల్లడించింది.