Fertility Rate: దేశంలో భారీగా తగ్గిన సంతానోత్పత్తి.. గత పదేళ్లలో 20% డౌన్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Fertility Rate: పిల్లలను కనాలని పెళ్లి చేసుకున్న దంపతులు తాపత్రయపడుతుంటారు. అయితే కొందరు కొన్ని సమస్యల కారణంగా పిల్లలను కనడం వాయిదా వేసినా ఎప్పటికైనా పిల్లలను అయితే తప్పకుండా కనాల్సిందే. కానీ ప్రస్తుత జీవన విధానం ఈతరం మహిళల సంతానోత్పత్తి తీవ్ర ప్రభావం చూపిస్తోంది. గడిచిన పదేళ్ల కాలంలో దేశంలో సాధారణ సంతానోత్పత్తి రేటు 20 శాతం పడిపోయిందని శాంపిల్ రిజిస్ట్రేషన్ డేటా 2020 రిపోర్టు వెల్లడించింది. దేశంలోని ప్రతి వెయ్యి మంది మహిళలకు ఒక ఏడాదిలో జన్మించిన చిన్నారుల సంఖ్యను జనరల్ ఫర్టిలిటీ రేట్(జీఎఫ్ఆర్)గా చెబుతారు. ముఖ్యంగా జమ్మూకాశ్మీర్‌లో జీఎఫ్ఆర్ 29 శాతం తగ్గిపోయిందని రిపోర్టు తెలిపింది.
Read Also: Prabhas: ‘ఆదిపురుష్’ టీజర్ విడుదలకు ముహూర్తం ఫిక్స్
Also Read
- DoT SIM Card Warning: మీ పేరు మీద సిమ్‌ను వేరొకరు వాడుతున్నారా? మీకు రూ.50 లక్షల వరకు జరిమానా!, పైగా శిక్ష..
- Harassment: మారండ్రా బాబు.. మరో దారుణం.. రోడ్డుపై మైనర్ బాలికపై వేధింపులు
- Import Duty Cuts on Edible Oils: పండుగలకు ముందే ఊరట.. వంట నూనెలపై గుడ్‌న్యూస్ చెప్పిన కేంద్రం..
- Uttar Pradesh: ఉత్తరప్రదేశ్ నాలుగు ముక్కలు? విభజన డిమాండ్ వెనుక ఉన్న కారణాలివే!
తెలుగు రాష్ట్రాల్లో సంతానోత్పత్తి రేటును పరిశీలిస్తే ఏపీలో 50.7 శాతం, తెలంగాణలో 52.6 శాతంగా ఉంది. దేశ రాజధాని ఢిల్లీలో 28.5 శాతం మేర సంతానోత్పత్తి రేటు ఉంది. సంతానోత్పత్తి రేటు కోసం 15-49 సంవత్సరాల వయసులోని వారిని ఈ గణాంకాల పరిధిలోకి తీసుకుంటారు. 2008 -2010లో సగటు జీఎఫ్ఆర్ 86.1గా ఉంటే, 2018-20 మధ్య కాలంలో ఇది 68.7కు తగ్గింది. పట్టణ ప్రాంతాల కంటే గ్రామీణ ప్రాంతాల్లోనే పరిస్థితి దారుణంగా ఉంది. పట్టణ ప్రాంతాల్లో సంతానోత్పత్తి క్షీణత 15.6 శాతంగా ఉంటే గ్రామీణ ప్రాంతాల్లో 20.2 శాతంగా ఉంది. జీఎఫ్ఆర్ గణాంకాలు జనాభావృద్ధి తగ్గుదలను సూచిస్తున్నాయని, ఇది మంచి సంకేతమేనని ఎయిమ్స్ ఆబ్సెట్రిక్స్ మాజీ హెడ్ సునీతా మిట్టల్ అన్నారు. వివాహం చేసుకుంటున్న వారి వయసు పెరగడం, మహిళల్లో అక్షరాస్యత శాతం పెరగడం, ఆధునిక సంతాన నిరోధక సాధనాల రాక సంతానోత్పత్తి తగ్గడానికి కారణాలుగా పరిశోధకులు విశ్లేషిస్తున్నారు.
తాజావార్తలు
-
Turkey Earthquake: టర్కీలో భారీ భూకంపం.. 5.8 తీవ్రతతో కంపించిన భూమి
-
DoT SIM Card Warning: మీ పేరు మీద సిమ్‌ను వేరొకరు వాడుతున్నారా? మీకు రూ.50 లక్షల వరకు జరిమానా!, పైగా శిక్ష..
-
Faria: నేనింకా ఇల్లు కొనలేదు.. సందీప్ కిషన్ చెప్పాక కొనాలనుకున్నా.!
-
Danam Nagender: సుప్రీం తీర్పును స్వాగతిస్తున్నా.. ఎన్నికలు ఎప్పుడొచ్చినా రెడీ..!
-
Xiaomi TV: Xiaomi TV S Pro RGB-Mini LED 2027 సిరీస్ లాంచ్.. 98 ఇంచెస్ స్క్రీన్, Dolby Atmos, HyperOS 4
ట్రెండింగ్
-
144Hz డిస్ప్లే, 11,000mAh బ్యాటరీతో కొత్త ట్యాబ్లెట్లు Xiaomi Pad 9, Pad 9 Pro లాంచ్..!
-
Mushroom Pulao: నాన్‌వెజ్‌ను తలపించే రుచితో హెల్తీ & టేస్టీ రెస్టారెంట్ స్టైల్ ‘మష్రూమ్ పులావ్’.. ఇంట్లోనే ఈజీగా చేసుకోండిలా.!
-
150+ స్పోర్ట్స్ మోడ్లు, 21 రోజుల బ్యాటరీతో Xiaomi Watch S5, Smart Band 11 లాంచ్.. ధర, ఫీచర్స్ ఇవే.!
-
100W ఫాస్ట్ ఛార్జింగ్, 200MP కెమెరా, 120Hz LTPO డిస్ప్లేతో Xiaomi 18 Pro లాంచ్.!
-
8500mAh బ్యాటరీ, ట్రిపుల్ స్టీరియో స్పీకర్లు, లైకా 200MP ట్రిపుల్ కెమెరాలతో కొత్త ఫ్లాగ్షిప్ Xiaomi 18 Pro Max వచ్చేసిందోచ్..!