NTV Telugu Site icon

Corona Cases: దేశంలో 46వేలకు పైగా కరోనా యాక్టివ్ కేసులు

India Corona Cases

India Corona Cases

Corona Cases In India: దేశంలో కరోనా కేసులు స్వల్పంగా తగ్గాయి. నిన్నటితో పోలిస్తే.. గురువారం నుంచి శుక్రవారం ఉదయం 8 గంటల వరకు 6,298 మందికి కరోనా వైరస్‌ సోకినట్లు నిర్ధరణ అయింది. కరోనా మహమ్మారి బారిన పడి 23 మంది ప్రాణాలు కోల్పోయారు. రికవరీ రేటు 98.71 శాతంగా ఉంది. యాక్టివ్​ కేసులు 0.10 శాతంగా ఉన్నాయని కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది. ఇక యాక్టివ్ కేసుల సంఖ్య 46 వేల పైకి చేరుకుంది. దేశంలో ప్రస్తుతం యాక్టివ్ కేసులు 46,748కు చేరాయి.

దేశంలో కరోనా మొదలైనప్పటి నుంచి ఇండియాలో మొత్తం కేసుల సంఖ్య 4,45,22,777కి చేరుకుంది. దేశంలో మొత్తం కరోనా మరణాల సంఖ్య 5,28,273గా ఉంది. ఇండియాలో 4,39,47,756 మంది వ్యాధి బారినుంచి కోలుకున్నారు. మరణాల రేటు 1.19 శాతంగా ఉంది. డైలీ పాజిటివిటీ రేటు 1.89 శాతంగా ఉంది. భారతదేశంలో కోవిడ్ మహమ్మారి ప్రారంభం అయినప్పటి నుంచి చూస్తే.. డిసెంబర్, 2020లో కోటి కేసులు నమోదు అవ్వగా.. ఈ సంఖ్య మే 4,2021 నాటికి రెండు కోట్లకు, జూన్ 23,2021 నాటికి మూడు కోట్లకు.. జవవరి 25, 2022 నాటికి నాలుగు కోట్ల మైలురాయిని చేరుకుంది.

Wall Collapse: విషాదం.. భారీ వర్షం కారణంగా గోడకూలి 9 మంది దుర్మరణం

ఇక ప్రపంచ వ్యాప్తంగా కూడా కొన్ని దేశాల్లో కొవిడ్ వ్యాధి విజృంభిస్తోంది. కొత్తగా 4,81,338 కేసులు వెలుగుచూశాయి. ఒక్కరోజులో 1,330 మరణాలు నమోదయ్యాయి. మొత్తం కేసులు 61,59,24,979కు చేరుకున్నాయి. ఇప్పటివరకు వైరస్‌తో 65,25,291 మంది మరణించారు. మరో 6,74,255 మంది కోలుకున్నారు. దీంతో మొత్తం కోలుకున్నవారి సంఖ్య 59,50,39,999కు చేరింది. జపాన్‌లో కొత్తగా 99,546 కేసులు నమోదయ్యాయి. వైరస్ వల్ల 192 మంది ప్రాణాలు కోల్పోయారు. దక్షిణ కొరియాలో కొత్తగా 71,432 కేసులు వెలుగుచూశాయి. మరో 72 మంది మరణించారు.రష్యాలో 56,126 కొత్త కేసులు నమోదయ్యాయి. వైరస్‌తో 99 మంది మృతి చెందారు.తైవాన్​లో 45,470 కొవిడ్ కేసులు నమోదుకాగా, వైరస్ వల్ల 57 మంది ప్రాణాలు కోల్పోయారు.అమెరికాలో 40,692 కొత్త కేసులు నమోదయ్యాయి. వైరస్​తో 249 మంది మృతి చెందారు.

Show comments