Corona Cases: దేశంలో 46వేలకు పైగా కరోనా యాక్టివ్ కేసులు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Corona Cases In India: దేశంలో కరోనా కేసులు స్వల్పంగా తగ్గాయి. నిన్నటితో పోలిస్తే.. గురువారం నుంచి శుక్రవారం ఉదయం 8 గంటల వరకు 6,298 మందికి కరోనా వైరస్ సోకినట్లు నిర్ధరణ అయింది. కరోనా మహమ్మారి బారిన పడి 23 మంది ప్రాణాలు కోల్పోయారు. రికవరీ రేటు 98.71 శాతంగా ఉంది. యాక్టివ్ కేసులు 0.10 శాతంగా ఉన్నాయని కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది. ఇక యాక్టివ్ కేసుల సంఖ్య 46 వేల పైకి చేరుకుంది. దేశంలో ప్రస్తుతం యాక్టివ్ కేసులు 46,748కు చేరాయి.
దేశంలో కరోనా మొదలైనప్పటి నుంచి ఇండియాలో మొత్తం కేసుల సంఖ్య 4,45,22,777కి చేరుకుంది. దేశంలో మొత్తం కరోనా మరణాల సంఖ్య 5,28,273గా ఉంది. ఇండియాలో 4,39,47,756 మంది వ్యాధి బారినుంచి కోలుకున్నారు. మరణాల రేటు 1.19 శాతంగా ఉంది. డైలీ పాజిటివిటీ రేటు 1.89 శాతంగా ఉంది. భారతదేశంలో కోవిడ్ మహమ్మారి ప్రారంభం అయినప్పటి నుంచి చూస్తే.. డిసెంబర్, 2020లో కోటి కేసులు నమోదు అవ్వగా.. ఈ సంఖ్య మే 4,2021 నాటికి రెండు కోట్లకు, జూన్ 23,2021 నాటికి మూడు కోట్లకు.. జవవరి 25, 2022 నాటికి నాలుగు కోట్ల మైలురాయిని చేరుకుంది.
Also Read
- Ketan Agarwal Case: కేతన్ హత్య 5 వేల పేజీల ఛార్జిషీట్.. పిచ్చిగా ప్రేమించిన కేతన్, హత్య చేసిన సియా..
- Student Protests: రేప్ నుంచి దెయ్యం వరకు.. పుకార్లతో రగిలిపోతున్న యూనివర్సిటీలు.!
- Kaveri Engine: రష్యాలో ‘‘కావేరి ఇంజన్’’ సత్తా.. భారత స్వేదేశీ ఇంజన్ సిద్ధం.!
- Congress: ప్రధాని మోదీ, జ్ఞానేష్ కుమార్ రాజీనామా చేయాలి.. సీడబ్ల్యూసీలో కాంగ్రెస్ 5 డిమాండ్లు..
Wall Collapse: విషాదం.. భారీ వర్షం కారణంగా గోడకూలి 9 మంది దుర్మరణం
ఇక ప్రపంచ వ్యాప్తంగా కూడా కొన్ని దేశాల్లో కొవిడ్ వ్యాధి విజృంభిస్తోంది. కొత్తగా 4,81,338 కేసులు వెలుగుచూశాయి. ఒక్కరోజులో 1,330 మరణాలు నమోదయ్యాయి. మొత్తం కేసులు 61,59,24,979కు చేరుకున్నాయి. ఇప్పటివరకు వైరస్‌తో 65,25,291 మంది మరణించారు. మరో 6,74,255 మంది కోలుకున్నారు. దీంతో మొత్తం కోలుకున్నవారి సంఖ్య 59,50,39,999కు చేరింది. జపాన్‌లో కొత్తగా 99,546 కేసులు నమోదయ్యాయి. వైరస్ వల్ల 192 మంది ప్రాణాలు కోల్పోయారు. దక్షిణ కొరియాలో కొత్తగా 71,432 కేసులు వెలుగుచూశాయి. మరో 72 మంది మరణించారు.రష్యాలో 56,126 కొత్త కేసులు నమోదయ్యాయి. వైరస్‌తో 99 మంది మృతి చెందారు.తైవాన్‌లో 45,470 కొవిడ్ కేసులు నమోదుకాగా, వైరస్ వల్ల 57 మంది ప్రాణాలు కోల్పోయారు.అమెరికాలో 40,692 కొత్త కేసులు నమోదయ్యాయి. వైరస్‌తో 249 మంది మృతి చెందారు.
తాజావార్తలు
-
CDSCO: పదేపదే ట్యాబ్లెట్లు వాడుతున్నారా?
-
HMD Vibe2 Pro: 64ఎంపీ సోనీ కెమెరా, 6000mAh బ్యాటరీ, 120Hz రిఫ్రెష్ రేట్.. HMD కొత్త 5G ఫోన్.. అక్టోబర్ 8న లాంచ్..
-
Ketan Agarwal Case: కేతన్ హత్య 5 వేల పేజీల ఛార్జిషీట్.. పిచ్చిగా ప్రేమించిన కేతన్, హత్య చేసిన సియా..
-
Explainer: మరిన్ని విపత్తులు తప్పవా?
-
Lava Smart Phone: 6000mAH బ్యాటరీ, 120Hz రిఫ్రెష్ రేట్.. లావా నుంచి బడ్జెట్ ధరలో స్మార్ట్ ఫోన్ లాంచ్..
ట్రెండింగ్
-
100HP టర్బో ఇంజిన్‌తో Renault Triber Turbo కొత్త వేరియంట్ లాంచ్.. ధర ఎంతంటే.?
-
Rohit-Kohli: నేను కోహ్లీకి పెద్ద ఫ్యాన్.. కానీ ఇప్పుడు చాలా బాధగా ఉంది.. రోహిత్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
మారిన లుక్, సరికొత్త ఫీచర్లతో Suzuki Hayabusa Special Edition లాంచ్.. ధరనే కాస్త ఎక్కువే.!
-
Woman Auto Driver: ఐటీ To ఆటో డ్రైవర్.. హృదయాలను కదిలిస్తున్న యువతి కథ..!
-
Ai+ నుంచి మూడు కొత్త డివైజ్‌లు.. కొత్త స్మార్ట్ ఫోన్ తోపాటు, 5G ట్యాబ్లెట్ సెగ్మెంట్ లాంచ్.!