NTV Telugu Site icon

INDIA bloc Rift widens: ‘ఇండియా’ కూటమిలో చీలిక.. మమతాకి నాయకత్వం అప్పగించాలని డిమాండ్

India Bloc

India Bloc

INDIA bloc Rift Widens: ఇండియా కూటమిలో చీలిక వచ్చినట్లు స్పష్టంగా కనిపిస్తుంది. కూటమి అధ్యక్ష బాధ్యతలను తృణమూల్ కాంగ్రెస్ పార్టీ చీఫ్, పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీకి అప్పగించాలని ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్ తెలిపారు. దానికి కాంగ్రెస్ పార్టీకి కూడా ఎలాంటి అభ్యంతరం లేదన్నారు. మమతకు తాము మద్దతు ఇస్తామని ఆయన ఈ రోజు (డిసెంబర్ 10) పాట్నాలో వెల్లడించారు. బెంగాల్ సీఎంకు ఇండియా బ్లాక్ బాధ్యతలు అప్పగిస్తే.. 2025లో మళ్లీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామని లాలూ ప్రసాద్ యాదవ్ జోస్యం చెప్పుకొచ్చారు.

Read Also: Supreme Court: ఉచితాలు ఇంకెంత కాలం?.. కేంద్రాన్ని ప్రశ్నించిన సుప్రీంకోర్టు

అలాగే, దేశవ్యాప్తంగా కాంగ్రెస్‌పై వ్యతిరేకత వల్ల ఇండియా కూటమిలో ఎలాంటి మార్పు రాదని బీహార్ మాజీ సీఎం లాలూ ప్రసాద్ యాదవ్ అన్నారు. అంతకుముందు ఆయన కుమారుడు తేజస్వి యాదవ్ కూడా మమతా బెనర్జీ కూటమికి నాయకత్వం వహించడంలో ఎలాంటి అభ్యంతరం లేదని ప్రకటించారు. ఇండియా బ్లాక్ లోని అన్ని పార్టీలు ఏకాభిప్రాయంతో తుది నిర్ణయం తీసుకోవాలని పిలుపునిచ్చారు.

Read Also: AUS vs IND: భారత్- ఆసీస్ మధ్య బాక్సింగ్ డే టెస్టు.. హాట్‌ కేకుల్లా అమ్ముడైన టికెట్లు

మరోవైపు ఇండియా కూటమి అధ్యక్ష బాధ్యతలు ముఖ్యమంత్రి మమతా బెనర్జీకి అప్పగించాలని ఇప్పటికే టీఎంసీ పార్టీలో డిమాండ్ వినిపిస్తుంది. బీజేపీని పలుమార్లు మమతా ఓడించారని.. అలాంటిది భారత కూటమి బాధ్యతలు ఆమెకు అప్పగించడం మంచిదని ఎంపీ కీర్తి ఆజాద్ పేర్కొన్నారు. అయితే, భాగస్వామ్య పక్షాలు కోరితే ఈ కూటమికి నాయకత్వం వహించేందుకు తాను రెడీగా ఉన్నానని ఇప్పటికే మమతా బెనర్జీ తేల్చి చెప్పింది. దీంతో ఇండియా బ్లాక్ లో చర్చ ప్రారంభమైంది. అయితే, మమతా బెనర్జీ చేసిన ప్రకటనపై కూటమిలోని భాగస్వామ్య పక్షాల నుంచి కూడా మద్దతు లభిస్తుంది.

Read Also: Zelensky: నేనంటే రష్యా అధ్యక్షుడికి భయం.. తర్వలోనే యుద్ధం ముగుస్తుంది!

అయితే, ఆసక్తికరమైన విషయం ఏమిటంటే.. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్‌డీయే చేతిలో ఓడిపోయేంత వరకు బీజేపీకి సన్నిహితంగా ఉన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, ఇండియా కూటమి నాయకత్వాన్ని మమతా బెనర్జీకి అప్పగించాలని తన వాయిస్ ని వినిపించింది. దీనిపై వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి ఎక్స్ (ట్విట్టర్) వేదికగా పోస్ట్ చేశారు.. అందులో, మమతా బెనర్జీ భారత కూటమికి నాయకత్వం వహించడానికి అన్ని రకాలుగా అర్హురాలని తెలిపారు. దీదీ కూడా 42 లోక్‌సభ స్థానాలతో ఒక పెద్ద రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా తన సత్తా ఏంటో నిరూపించుకున్నారని వైఎస్సార్‌సీపీ రాజ్యసభ ఎంపీ విజయసాయిరెడ్డి ట్వీట్ చేశారు.