INDIA Alliance: బీహార్, తమిళనాడు, పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల ముందు, ప్రతిపక్ష ఇండియా కూటమిలో విభేదాలు కనిపిస్తున్నాయి. పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు జూలై 21,2025 నుంచి ప్రారంభం కానున్నాయి. ఈ నేపథ్యంలో జూలై 19న ఇండియా కూటమి నేతలు సమావేశం కావాలని భావిస్తున్నాయి. అయితే, ఈ సమావేశానికి ముందే, ఇండియా కూటమి నుంచి బయటకు వస్తున్నట్లు ఆమ్ ఆద్మీ పార్టీ(ఆప్) ప్రకటించింది.
Read Also: IMD Warning: దక్షిణాది రాష్ట్రాలకు భారీ వర్ష సూచన.. తెలంగాణకు ఎల్లో అలర్ట్ జారీ
మరోవైపు, గతేడాది అధికార బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే కూటమిని ఓడించేందుకు ఆప్, ఎస్పీ, తృణమూల్ కాంగ్రెస్‌తో సహా అన్ని యూపీఏ పార్టీ ఇండియా కూటమి పేరుతో జట్టు కట్టిన సంగతి తెలిసిందే. అయితే, అన్ని పార్టీలు కలిసి వచ్చినా, మరోసారి ఎన్డీయే కూటమి ప్రభుత్వం ఏర్పడింది. ఇదిలా ఉంటే, తాము గతేడాది లోక్‌సభ ఎన్నికల విషయంలో పనిచేసిన మాట వాస్తమే కానీ, ఇప్పుడు కూటమిలో లేము అని ఆప్ కుండ బద్ధలు కొట్టింది.
ఈ నేపథ్యంలోనే ఇండియా కూటమి నిర్వహించబోతున్న సమావేశానికి హాజరుకాబోవడం లేదని ఆప్ చెప్పింది. దీనిని బట్టి చూస్తే కూటమి బీటలు వారుతున్నట్లు తెలుస్తోంది. ఇకపై ఇండియా కూటమిలో తాము భాగం కాదని ఆప్ వెల్లడించింది.