India - Afghanistan: పహల్గామ్ ఉగ్రదాడి తర్వాత, భారత్ పాకిస్తాన్‌తో ‘‘సింధూ జలాల ఒప్పందాన్ని’’ నిలిపేసింది. పాకిస్తాన్‌కు ఈ నదీ జలాలు అత్యంత కీలకం. ఆ దేశ వ్యవసాయం సింధూ దాని ఉప నదులపైనే ఆధారపడి ఉంది. అయితే, ఇప్పుడు ఆఫ్ఘానిస్తాన్ కూడా భారత దారిలోనే నడుస్తోంది. ఆఫ్ఘాన్ నుంచి పాకిస్తాన్ లోకి ప్రవహించే నదులను నీటిని సమర్థవంతంగా ఉపయోగించుకోవాలని భావిస్తోంది. ఈ నేపథ్యంలోనే ‘‘కునార్’’ నదిపై డ్యామ్ నిర్మించాలని ఆఫ్ఘనిస్తాన్ భావిస్తోంది.