Kerala: ఆ ఆలయంలో ఛాయ్‌నే తీర్థం.. ప్రసాదంగా పెసర గుడాలు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Kerala: గుడికి వెళ్లిన వారు.. దేవుడిని దర్శించుకున్న తరువాత గుడిలో పెట్టే ప్రసాదం తీసుకుని తమ మొక్కులు తీర్చుకుంటారు. అయితే గుడికి వెళ్లిన వారికి సాదారణంగా గుళ్లో ప్రసాదంగా పులిహోర, దద్దోజనం, పాయసం, అటుకులు, బెల్లం, అరటిపండు ఇస్తారు. ప్రసాదంతోపాటు తీర్థం ఇస్తారు. దాదాపు అన్ని దేవాలయాల్లో ఇలానే తీర్థ, ప్రసాదాలు ఇస్తుంటారు. కానీ ఆ ఆలయంలో ఇచ్చే తీర్థం వెరైటీ.. అక్కడ పెట్టే ప్రసాదం కూడా వెరైటీనే. అవేంటో అనుకుంటున్నారా? అక్కడ ఛాయ్ ని తీర్థంగా ఇస్తారు.. ఇక ప్రసాదంగా అయితే పెసర గుడాలను ఇస్తారు. అదేంటీ ఇదేదో వింతగా ఉందనుకుంటున్నారా? వీటిని తీర్థ ప్రసాదాలుగా ఇస్తున్న గుడి ఎక్కడ ఉందో తెలుసుకుందాం..
Read also: Durga devi stotram: ఆషాఢమాసం, భానుసప్తమి సందర్భంగా ఈ స్తోత్రాలు వింటే సంతాన సౌభాగ్యాలు
Also Read
- US LPG Supply: భారత్‌కు ఎల్పీజీ సరఫరాలో అమెరికా సరికొత్త రికార్డు..
- Heavy Rainfall: వర్ష బీభత్సం.. ఉత్తరప్రదేశ్‌లో 65 గంటల పాటు భారీ వర్షం.. 14 రాష్ట్రాల్లో అలర్ట్
- LNG Dual-Fuel Train in India: భారత రైల్వేలో కొత్త అధ్యాయం.. నేడు అమిత్ షా చేతుల మీదుగా తొలి LNG రైలు ప్రారంభం
- Gyanesh Kumar: ‘‘నాకు బీజేపీ టికెట్ ఆఫర్ చేశారు’’.. జ్ఞానేష్ కుమార్‌పై మాజీ కేరళ సీఎస్ సంచలన ఆరోపణలు
పత్రం, పుష్పం, ఫలం, నీరు.. ఏదైనా భక్తితో సమర్పిస్తే దానిని తాను సంతోషంగా స్వీకరిస్తానని గీతాచార్యుడు శ్రీకృష్ణ పరమాత్మ తను బోధించిన గీతలో చెబుతాడు. అయితే వాటికి అదనంగా తేనీరు(చాయ్) కూడా జతచేర్చారు కేరళీయులు. పరమాత్మకు నివేదించిన ఉష్ణోదకాన్ని ఆ గుడికి వచ్చేవారందరికీ ప్రసాదంగా పంచుతుంటారు. ఏకాక్షరికి ఇంతటి ఘనత కట్టబెట్టిన ఆలయం పేరు ముత్తప్పన్ కోవెల. కేరళలోని కన్నూరు జిల్లా పరాసినిక్కడవు గ్రామంలో ఉంటుందీ గుడి. ఇక్కడ వెలసిన ముత్తప్పన్ ఆదివాసీల ఆరాధ్య దైవం. హరిహరుల అంశగా ఈ స్వామిని కొలుస్తారు. ముత్తప్పన్‌ను అయ్యప్పగా భావిస్తారు కొందరు.
Read also: Health Tips: రోజూ వెల్లుల్లిని ఇలా చేసుకొని తాగండి.. ఏమౌతుందో మీరే చూడండి..
ఉత్తర మలబారులో ప్రముఖ పర్యాటక ప్రాంతంగా విలసిల్లుతున్న పరాసినిక్కడవులో ముత్తప్పన్ ఆలయం మరింత ప్రత్యేకం. ఏడాది పొడవునా ఉత్సవాలు జరుగుతూనే ఉంటాయిక్కడ. అందులో పాలుపంచుకోవడానికి కేరళ నలుమూలల నుంచి మాత్రమే కాకుండా పక్క రాష్ర్టాల నుంచి కూడా పర్యాటకులు, భక్తులు అక్కడికి వస్తుంటారు. ఈ సంగతి పక్కనపెడితే, ఇక్కడ తేనీటిని నైవేద్యంగా సమర్పించడం, ప్రసాదంగా భక్తులకు పంచడం మాత్రం ఆశ్చర్యం కలిగిస్తుంది. ఎప్పుడు మొదలైందో తెలియదు కానీ, దశాబ్దాలుగా ఈ సంప్రదాయం కొనసాగుతున్నదని స్థానికులు చెబుతుంటారు. ఇక్కడ
తేనీటితోపాటు పెసర సొండెలు ప్రసాదంగా అందిస్తారు. వినడానికి వింతగా ఉన్నా.. నేటికీ ఇక్కడ తేనీరే తీర్థంగా ఇస్తారు. ఆ మాటకొస్తే ఉదయం పూట కాచే తొలి టీని దేవుడి పటం ముందుంచి నైవేద్యం పెట్టే కుటుంబాలు మన దగ్గరా కనిపిస్తాయి. ఈ ఉష్ణోదకం ముందు అమృతం కూడా దిగదుడుపే.. అందుకే టీ నివేదనం అంటారు తేనీటి ప్రేమికులు.
తాజావార్తలు
-
US LPG Supply: భారత్‌కు ఎల్పీజీ సరఫరాలో అమెరికా సరికొత్త రికార్డు..
-
Tribal Boy: అత్యవసర పరిస్థితి.. తాడు పట్టుకుని వాగు దాటిన గిరిజన బాలుడు!
-
AK47 : ‘ఆదర్శ కుటుంబం’ ఫస్ట్ సింగిల్ ‘నారాయణమ్మ’.. ఈరోజైన వస్తుందా?
-
Chintur Rains: చింతూరు ఏజెన్సీలో తగ్గుముఖం పట్టిన వర్షాలు.. కూనవరం వద్ద 30 అడుగులకు చేరిన గోదావరి!
-
Bangladesh: బంగ్లాదేశ్‌లో మరో హిందూ వ్యక్తి దారుణ హత్య.. డ్రమ్‌లో శవమై తేలిన వ్యాపారి
ట్రెండింగ్
-
Xiaomi Pocket Guitar: చేతిలో ఫోన్.. వెనుక గిటార్..! Xiaomi సరికొత్త యాక్సెసరీ మాములుగా లేదుగా.!
-
Hardik Pandya: రీఎంట్రీకి మరో బ్రేక్.. స్కాన్‌లో బయటపడ్డ కొత్త గాయం.!
-
Saturday Horoscope: ఆ రాశి వారికి నేడు పట్టిందల్లా బంగారమే.. నేటి రాశిఫలాలు ఇలా.!
-
Nuclear Weapons: 12 వేలకుపైగా అణ్వాయుధాలు.. ప్రపంచానికి పొంచి ఉన్న ముప్పేంటి.?
-
iPhone 18 Pro Max Review: ఐఫోన్ 18 ప్రో మ్యాక్స్ పర్ఫార్మెన్స్ ఎలా ఉంది? రూ.1.79 లక్షలు పెట్టి కొనాలా? వద్దా?