S JaiShankar: చైనా రుణ ఉచ్చుతో జాగ్రత్త.. జైశంకర్ హెచ్చరిక
- Follow Us :
-
-
Add as a preferred
source on google
S JaiShankar: హిందూ మహాసముద్రం ప్రాంతంలోని అభివృద్ధి సవాళ్లను ఎదుర్కోవాలని బుధవారం ఇండియా పిలుపునిచ్చింది. శ్రీలంక రాజధాని కొలంబోలో జరుగుతున్న ఇండియన్ ఓషియన్ రిమ్ అసోసియేషన్(IORA) సమావేశంలో విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ పాల్గొన్నారు. ఆయన మాట్లాడుతూ.. యూఎన్ కన్వెన్షన్ ఆధారంగా హిందూ మహాసముద్రం స్వేచ్ఛా, బహిరంగ, సమ్మిళిత ప్రదేశంగా ఉండాలని అన్నారు.
ఈ సమావేశంలో చైనాను ఉద్దేశించి కీలక వ్యాఖ్యలు చేశారు. ఆచరణ సాధ్యం కాని ప్రాజెక్టులు, భరించలేని రుణాలతో ‘హిడెన్ ఎజెండా’ ప్రమాదాలపై జాగ్రత్తగా ఉండాలని పరోక్షంగా చైనాను ఉద్దేశించి అన్నారు. చైనా రుణ ఉచ్చు గురించి పరోక్షంగా సభ్యదేశాలకు తెలియజేశారు.
Also Read
- Delhi High Court: ఊపిరాడక చనిపోవాల్సి వస్తుంది.. ‘దేవుడే కాపాడాలి’.. ఢిల్లీ పరిస్థితిపై హైకోర్టు తీవ్ర ఆందోళన
- Petrol-Diesel: పెట్రోల్‌లో ఇథనాలు, డీజిల్‌లో ఐసోబ్యుటానాల్.. కేంద్రం మరో నిర్ణయం.!
- Tejashwi Yadav: బ్యాలెట్‌తో ఎన్నికలు జరిపితే బీజేపీ గెలవదు.. తేజస్వి యాదవ్ కీలక వ్యాఖ్యలు
- Gas Cylinder Subsidy: గ్యాస్ వినియోగదారులకు బిగ్ షాక్.. ‘రాయితీ’కి కత్తెర.. వంటగదిలో ఇక కట్టెల పొయ్యే...
Read Also: IND vs AFG: భారీ స్కోరు చేసిన అఫ్గాన్ జట్టు.. భారత టార్గెట్ ఎంతంటే?
చైనా, శ్రీలంకకు భారీగా రుణాలు ఇచ్చి, అవి చెల్లించకపోవడంతో హంబన్ టోటా ఓడరేవును 2017లో ఈక్విటీ కోసం 99 ఏళ్లకు లీజుకు తీసుకుంది. 1.2 బిలియన్ రుణం ఇచ్చి ఏకంగా శ్రీలంక హంబన్ టోటా నౌకాశ్రయాన్ని చైనా స్వాధీనం చేసుకుంది. ఇదే కాకుండా చైనా తన ‘‘బెల్ట్ అండ్ రోడ్ ఇన్షియేటివ్(బీఆర్ఐ) ద్వారా పలు పేద, వెనకబడిన దేశాలకు అభివృద్ధి పేరుతో రుణాలు అందిస్తూ, వాటిని నెమ్మదిగా రుణ ఊబిలోకి దించుతోంది.
మరోవైపు హిందూ మహాసముద్రంలో భారత్ ఆధిపత్యానికి చెక్ పెట్టేందుకు చైనా తీవ్ర ప్రయత్నాలు చేస్తోంది. ఇప్పటికే శ్రీలంకలో పాగా వేయగా.. ఇటీవల మాల్దీవుల్లో చైనా అనుకూల అధ్యక్షుడు గెలుపొందడంతో ఆ దేశంలో కూడా పాగా వేయాలని అనుకుంటోంది. ఈ నేపథ్యంలోనే భారత్, హిందూ మహాసముద్ర దేశాలను హెచ్చరించారు. బంగ్లాదేశ్, మారిషస్, మలేషియా, దక్షిణాఫ్రికా వంటి దేశాల విదేశాంగ మంత్రలు సమావేశానికి 16 మంది మంత్రులు హాజరయ్యారు.
తాజావార్తలు
-
Ram Charan: ఈ సినిమాలో ఆయన నటన చూసి నాకు కంట్లో నీళ్లు వచ్చాయి: రామ్‌చరణ్
-
Vizag Steel Plant Accident: స్టీల్ ప్లాంట్ ప్రమాదం.. దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన సీఎం చంద్రబాబు, వైఎస్ జగన్..
-
Delhi High Court: ఊపిరాడక చనిపోవాల్సి వస్తుంది.. ‘దేవుడే కాపాడాలి’.. ఢిల్లీ పరిస్థితిపై హైకోర్టు తీవ్ర ఆందోళన
-
Petrol-Diesel: పెట్రోల్‌లో ఇథనాలు, డీజిల్‌లో ఐసోబ్యుటానాల్.. కేంద్రం మరో నిర్ణయం.!
-
Iran-Israel Ceasefire: ఇజ్రాయెల్‌తో కాల్పుల విరమణ ప్రకటించిన ఇరాన్.. మళ్లీ దాడులు చేస్తే మాత్రం..!
ట్రెండింగ్
-
Manav Suthar Record: అరంగేట్ర స్పిన్నర్ మానవ్ సుతార్ అరుదైన రికార్డు.. ఈ శతాబ్దంలోనే ‘ఒకే ఒక్కడు’!
-
Harmanpreet Kaur: ‘నేను రిటైర్ అవ్వాలనుకుంటున్నారా?’.. రిపోర్టర్ కు ధోనీ స్టైల్లో మహిళా కెప్టెన్ కౌంటర్.!
-
Birth Rate: భారత్‌లో పడిపోతున్న జననాల రేటు.. విద్యావంతులు తక్కువ మంది పిల్లలను కనడమే కారణమా.?
-
Sugar Cravings Control : తీపి తినాలనే కోరికా..? ఈ చిట్కాలతో మీ స్వీట్ క్రేవింగ్స్‌కు చెక్ పెట్టండి.!
-
Monsoon Tips: వర్షాకాలంలో ప్రయాణమా..? ఈ చిన్న జాగ్రత్తలు ప్రాణాలను కాపాడతాయి.!