Ibrahim Zadran: మేము బాగా ఆడాం.. ఐయామ్ ఫుల్ హ్యాపీ.. అఫ్గాన్ కెప్టెన్ ఆసక్తికర వ్యాఖ్యలు!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Ibrahim Zadran Reaction Afghanistan Series Loss To India: భారత్‌తో జరిగిన మూడు టీ20ల సిరీస్‌ను అఫ్గానిస్థాన్ ఘోర పరాజయంతో ముగించింది. ఢిల్లీలో గురువారం జరిగిన మూడో టీ20లో టీమిండియా ఏకంగా 127 పరుగుల తేడాతో అఫ్గానిస్థాన్‌ను ఓడించింది. తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 221 పరుగులు చేయగా.. లక్ష్య ఛేదనలో అఫ్గాన్ 14.1 ఓవర్లలో 94 పరుగులకే ఆలౌటైంది. ఈ మ్యాచ్‌లో అఫ్గాన్ ఏ దశలోనూ పోటీ ఇవ్వలేకపోయింది. అన్ని విభాగాల్లో విఫలమైన అఫ్గానిస్థాన్ మూల్యం చెల్లించుకుంది. అయితే మ్యాచ్ అనంతరం అఫ్గాన్ కెప్టెన్ ఇబ్రహీం జద్రాన్ మాట్లాడుతూ.. జట్టు ప్రదర్శనపై సంతోషం వ్యక్తం చేశాడు. పవర్‌ప్లేలో గత మ్యాచ్‌లతో పోలిస్తే మెరుగ్గా ఆడామని, ఆటగాళ్లలో కనిపించిన దూకుడు ఉద్దేశం తనకు పూర్తిగా సంతృప్తినిచ్చిందని చెప్పాడు.
‘జట్టు ప్రదర్శనపై సంతోషంగా ఉన్నా. పవర్‌ప్లేలో గత మ్యాచ్‌లతో పోలిస్తే కొంత మెరుగ్గా ఆడాం. ఆటగాళ్లలో కనిపించిన ఉద్దేశం నాకు సంతృప్తినిచ్చింది. అయితే కీలక సమయంలో జట్టు నుంచి ఆశించిన సహకారం లభించలేదు. వరుసగా వికెట్లు కోల్పోవడం మా విజయవకాశాలను దెబ్బతీసింది. మేము ఈ అంశంపై కూర్చుకుని మాట్లాడుకుంటాం. మా ఆటలో దూకుడును ఎలా కొనసాగించాలనే దానిపై ఇప్పటికే ఆలోచించాం. ఒకటి లేదా రెండు సిరీస్‌ల్లో కొంత ఇబ్బంది ఎదురవ్వొచ్చు. కానీ సమయం గడిచే కొద్దీ కచ్చితంగా మెరుగుపడతామని నమ్ముతున్నాను’ అని ఇబ్రహీం జద్రాన్ తెలిపాడు.
Also Read
‘అంతర్జాతీయ స్థాయిలో పెద్ద జట్లను ఓడించాలంటే ఆటగాళ్లలో దూకుడైన ఆలోచనా విధానం చాలా అవసరం. ఆ ఉద్దేశం లేకుండా కేవలం సాధారణ క్రికెట్ ఆడితే ప్రపంచంలోని అగ్రశ్రేణి జట్లను ఓడించడం చాలా కష్టం. టీ20 ప్రపంచ కప్ తర్వాత అఫ్గానిస్థాన్‌కు ఇదే తొలి సిరీస్. మా జట్టు మరిన్ని మ్యాచ్‌లు, ముఖ్యంగా పెద్ద జట్లతో ఎక్కువ సిరీస్‌లు ఆడాల్సిన అవసరం ఉంది. మనం ఎంత ఎక్కువగా ఆడితే అంత ఎక్కువగా మెరుగుపడతాం. జింబాబ్వే, ఐర్లాండ్ వంటి జట్లతో కూడా మేము ఆడుతున్నాం. మాకు అవసరమైన నైపుణ్యాలు ఉన్నాయి. అయితే మరింత మెరుగవ్వాలంటే బాగా కష్టపడాలి. ఫిట్‌నెస్‌పై కూడా దృష్టి పెట్టి ప్రపంచంలోని అగ్రశ్రేణి జట్ల స్థాయికి చేరుకోవాలి’ అని ఇబ్రహీం జద్రాన్ పేర్కొన్నాడు.
పెద్ద జట్లతో తరచుగా ఆడితే అఫ్గానిస్థాన్ కూడా వారికి గట్టి పోటీ ఇవ్వగలదని, భవిష్యత్తులో అగ్రశ్రేణి జట్లను ఓడించే స్థాయికి చేరుకుంటామని జద్రాన్ ధీమా వ్యక్తం చేశాడు. అయితే అందుకు కొంత సమయం పడుతుందని అంగీకరించాడు. ‘మేము ఓ ఏడాదిలో మరిన్ని మ్యాచ్‌లు ఆడాలి. ఎక్కువ సిరీస్‌లు ఆడటం ద్వారా మా ఆటలోని లోపాలను గుర్తించి సరిదిద్దుకోవచ్చు. దాంతో పాటు ఫిట్నెస్ను మెరుగుపరుచుకుంటే అగ్రశ్రేణి జట్లకు మరింత గట్టి సవాల్ విసరగలుగుతాం. భారత్‌తో జరిగిన సిరీస్‌లో మా పరిధిలో బాగానే ఆడాం. మా ఆటగాళ్ల దూకుడు ఉద్దేశంపై ఫుల్ హ్యాపీగా ఉన్నా’ అని అఫ్గాన్ కెప్టెన్ చెప్పుకొచ్చాడు.
తాజావార్తలు
-
Vijay Deverakonda: ఎన్నాళ్లయ్యిందయ్యా హిట్ కొట్టి.. బజ్ లేని ‘రణబాలి’తో విజయ్ కమ్‌బ్యాక్ ఇస్తాడా?
-
iPhone Sales: పండుగల వేళ ఐఫోన్ ప్రియులకు బంపర్ ఆఫర్.. ఐఫోన్ 15, 16, 17లపై ఊహించని తగ్గింపు!
-
Vidyut Jammwal: లైవ్ ఈవెంట్లో 15 నిముషాలు ఊపిరి ఆపిన బాలీవుడ్ హీరో.. సాధ్యమేనా?
-
Fauzi Teaser: ‘ఫౌజీ’ నుంచి 3 నిమిషాల టీజర్.. ప్రభాస్ ఫ్యాన్స్‌కు పండగే!
-
Sabudana Soup Recipe: మార్కెట్లో లభించే ఎనర్జీ డ్రింక్స్‌ను పక్కన పెట్టి.. ఈ సగ్గుబియ్యం సూప్ తాగితే అలసట, నీరసం ఉండవు..
ట్రెండింగ్
-
Oil Less Vada: చుక్క నూనె లేకుండా, పప్పు నానబెట్టకుండా.. దూదిలాంటి సాఫ్ట్ వడలు చిటికెలో చేయండి ఇలా..!
-
రూ.10,999కే 120Hz డిస్ప్లే, 5,000mAh బ్యాటరీతో Infinix Smart 20 HD లాంచ్..!
-
Woolen Clothes: స్వెటర్లపై చిన్న చిన్న రోమాలు పోవడం లేదా? ఈ 2 నిమిషాల హోమ్ ట్రిక్స్‌తో కొత్తవాటిలా మార్చేయండి!
-
Tollywood Most Eligible Bachelors: పెళ్లా? మాకా?!.. వయస్సు ముదురుతున్న ‘నిత్య బ్రహ్మచారి’ బిరుదును వదలని హీరోలు.!
-
Actors To Directors: టాలీవుడ్లో సరికొత్త ట్రెండ్.! యాక్టర్స్ టు డైరెక్టర్స్.. సొంత కథలతోనే హిట్ ప్లాన్.!