Bangladesh MP: చర్మం వలిచి, శరీరం నుంచి ఎముకలు వేరు చేసి.. బంగ్లా ఎంపీ హత్య కేసులో సంచలన విషయాలు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Bangladesh MP: బంగ్లాదేశ్ ఎంపీ అన్వరుల్ అజీమ్ అన్వర్ హత్యలో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. వైద్యం కోసం బంగ్లాదేశ్ నుంచి ఆయన ఈ నెల 12న కోల్‌కతా వచ్చారు. మే 14 నుంచి కనిపించకుండా పోయారు. ఎంపీ హత్యకు సంబంధించి ఓ అనుమానితుడి బెంగాల్ సీఐడీ టీం ఒకరిని అరెస్ట్ చేయడంతో భయంకర విషయాలు వెలుగులోకి వచ్చాయి. బంగ్లాదేశ్ ఖుల్నా జిల్లాకు చెందిన అక్రమ వలసదారు ఎంపీని హత్య చేసి, అత్యంత క్రూరంగా శరీరాన్ని ముక్కలు ముక్కలు చేసినట్లు విచారణలో వెల్లడైంది.
అనుమానితుడు జిహాద్ హవ్లాదర్ వృత్తిరీత్యా కసాయి. బంగ్లాదేశ్‌లోని ఖుల్నా జిల్లాలోని బరాక్‌పూర్ నివాసి. ముంబైలో అక్రమంగా ఉంటున్నట్లు సీఐడీ వర్గాలు తెలిపాయి. హవ్లాదార్‌ని ఎంపీకి స్నేహితుడైన అక్తరుజ్జమాన్ అనే అమెరికా సిటిజన్ నియమించుకున్నాడు. కోల్‌కతాలో ఇతని అపార్ట్‌మెంట్‌లోనే ఎంపీ అన్వరుల్ అజీమ్ హత్యకు గురయ్యాడు. రెండు నెలల క్రితమే హంతకుడు కోల్‌కతా వచ్చినట్లు తేలింది.
Also Read
- Flydubai: రక్తమోడుతున్నా పట్టువదల్లేదు.. 180 మందిని కాపాడిన భారతీయ పైలట్ ఈయనే.!
- Modi-Trump: మోడీ-ట్రంప్ ఫోన్ కాల్.. ట్రేడ్, డిఫెన్స్, ఎనర్జీపై కీలక చర్చలు!
- Central Cabinet: కీలక నిర్ణయాలు తీసుకున్న కేంద్ర కేబినెట్.. గ్రీన్ ఎనర్జీ కారిడార్-3కు ఆమోదం..
- Flydubai: హైజాక్ అలర్ట్‌తో ఇజ్రాయెల్‌లో కలకలం.. ‘‘శత్రువును వదలం’’ అంటూ మంత్రి హెచ్చరిక!
Read Also: Dinesh Karthik-Virat Kohli: థ్యాంక్యూ డీకే.. ఎప్పటికీ నీకు రుణపడి ఉంటా: కోహ్లీ
కోల్‌కతా విమానాశ్రయానికి సమీపంలోని ఓ హోటల్‌లో హవ్లాదార్ బసచేసినట్లు, ఎంపీని చంపేందుకు అక్తరుజ్జమాన్ రూ. 5 కోట్లు ఖర్చు చేశాడని, ఇందులో వాటా కూడా హవ్లాదార్‌కి ఇచ్చినట్లు సీఐడీ వర్గాలు తెలిపాయి. కోల్‌కతాలోని న్యూ టౌన్ ప్రాంతంలోని ఒక ఫ్లాట్‌లో తాను, మరో నలుగురు కలిసి బంగ్లాదేశ్ ఎంపీని హతమార్చినట్లు హవ్లాదార్ ఒప్పుకున్నాడు. అక్తరుజ్జమాన్ ఆదేశాల మేరకే హత్య జరిగిందని వెల్లడించారు.
హత్య తర్వాత ఎంపీ మృతదేహం చర్మాన్ని వలిచి, బాడీని గుర్తు పట్టకుండా ముక్కలు ముక్కలుగా నరికి, మాంసం నుంచి ఎముకలను వేరు చేసి, ప్లాస్టిక్ ప్యాకెట్లలో ప్యాక్ చేసి నగరంలోని పలు ప్రాంతాల్లో విసిరేశారు. మే 13న కోల్‌కతా నుంచి అదృశ్యమైన ఎంపీ హత్యకు గురయ్యారని, ముగ్గురిని అరెస్టు చేశామని బంగ్లాదేశ్ హోం మంత్రి అసదుజ్జమాన్ ఖాన్ తెలిపారు. బంగ్లాదేశ్ అధికార షేక్ హసీనా పార్టీ అయిన అవామీ లీగ్ ఎంపీగా ఉన్న అన్వురల్ అజీమ్ అన్వర్ మూడుసార్లు ఎంపీగా ఎన్నికయ్యారు. మే 12న కోల్‌కతా చేరుకున్న అతను, ఆయన స్నేహితుడు బిశ్వాస్ ఇంట్లో ఉన్నాడు. మే 13న వైద్యుడి వద్దకు వెళ్తున్నానని చెప్పి మిస్ అయ్యాడు. ఆ తర్వాత బిశ్వాస్ స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేయడంతో విషయం వెలుగులోకి వచ్చింది.
తాజావార్తలు
-
Shai Hope: ఇంతకంటే ఏం చేయాలి..? చాలా బాధగా ఉంది: వెస్టిండీస్ కెప్టెన్
-
Ind Vs WI: భారీ లక్ష్య ఛేదనలో చరిత్ర సృష్టించిన గిల్ సేన.. విండీస్‌పై టీమిండియా ఘన విజయం.. సిరీస్ కైవసం..
-
Shubhman Gill: డబుల్ ధమాకా.. వన్డే కెరీర్లో రెండో డబుల్ సెంచరీ బాదిన శుభ్‌మన్ గిల్..
-
Range Rover Sport Electric: రేంజ్ రోవర్ స్పోర్ట్ ఎలక్ట్రిక్ బుకింగ్స్ ఓపెన్.. ఒక్క ఛార్జ్‌తో 609 కి.మీ..
-
Team India Record: టీమిండియా రికార్డుల మోత.. 20 ఏళ్ల రికార్డు చెల్లాచెదురు..
ట్రెండింగ్
-
John Campbell Record: భారత్‌పై శివాలెత్తిన జాన్ క్యాంప్‌బెల్.. మొదటి బ్యాటర్‌గా అరుదైన రికార్డు!
-
రూ.1,100కే కొత్త ఫీచర్ ఫోన్.. 1,000mAh బ్యాటరీ, USB-C ఛార్జింగ్ తో HMD 106 Pure లాంచ్.!
-
Diwali Crackers: దీపావళి టపాసులపై సుప్రీం కీలక వ్యాఖ్యలు.. నిర్దిష్ట సమయంపై నిర్ణయం.!
-
Japanese Cleaning Tips: ఇల్లు ఎప్పుడూ నీట్‌గా ఉండాలంటే.. జపాన్ వాళ్ల ఈ 6 అలవాట్లు ఫాలో అవ్వండి..!
-
Gold Medal For India: పతకాల జోరు.. కాంపౌండ్ మిక్స్డ్ టీమ్‌లో చరిత్ర.. ఆసియా గేమ్స్‌లో భారత్‌కు మరో స్వర్ణం..!