QS Rnakings: ప్రపంచ స్థాయి యూనివర్సిటీల్లో చేరిన ఐఐటీ బాంబే
- Follow Us :
-
-
Add as a preferred
source on google
QS Rnakings: ఐఐటీ బాంబే ప్రపంచస్థాయి యూనివర్సిటీల్లో ఒకటిగా గుర్తింపు పొందింది. ప్రపంచస్థాయి యూనివర్సిటీల గుర్తింపుకు సంబంధించి ఒక సంస్థ నిర్వహించిన సర్వేలో ఐఐటీ బాంబే 149వ స్థానలో నిలిచింది. క్వాక్వెరెల్లి సైమండ్స్ (QS) వరల్డ్ యూనివర్సిటీ ర్యాంకింగ్స్ తాజా జాబితాను ప్రకటించింది. ఐఐటీ బాంబే.. టాప్ 150లో నిలిచింది. గత జాబితాతో పోలిస్తే.. 23 స్థానాలను అధిగమించి 149వ ర్యాంక్‌ను సాధించింది. ఈ జాబితాలో ఐఐటీ ఢిల్లీ 197, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ (IISc) బెంగళూరు 225 స్థానాల్లో నిలిచాయి. తాజా ర్యాంకింగ్స్‌లో 45 భారతీయ విశ్వవిద్యాలయాలు చోటు దక్కించుకున్నాయి. గత సంవత్సరం ఈ సంఖ్య 41. భారతీయ విశ్వవిద్యాలయాల విషయానికి వస్తే.. 149వ ర్యాంకుతో ఐఐటీ బాంబే మొదటి స్థానం, 197వ ర్యాంకుతో ఐఐఐటీ ఢిల్లీ రెండో స్థానం, ఐఐఎస్‌సీ బెంగళూరు 225 ర్యాంకింగ్‌తో మూడో స్థానం, ఐఐటీ ఖరగ్‌పూర్ 271 ర్యాంకింగ్‌తో నాల్గవ స్థానంలో ఉన్నాయి. ఆ తర్వాత స్థానాల్లో ఐఐటీ కాన్పూర్ (278 ర్యాంకు), ఐఐటీ మద్రాస్ (285 ర్యాంకు), ఐఐటీ గౌహతి (364 ర్యాంకు), ఐఐటీ రూర్కీ (369 ర్యాంకు), ఢిల్లీ విశ్వవిద్యాలయం (407 ర్యాంకు), అన్నా విశ్వవిద్యాలయం (427 ర్యాంకు)తో ఉన్నాయి.
Read also: Urfi Javed: ఏంటి ఉర్ఫీ.. ఓ వైపు విప్పుకున్నావు.. మరోవైపు కప్పుకున్నావ్.. ఇదేం డ్రెస్
Also Read
- Central Govt: అడ్వాన్స్ టిప్ విధానాన్ని ఆపేయండి.. క్యాబ్ కంపెనీలకు కేంద్రం ఆదేశాలు
- UPI Charges: ‘‘యూపీఐ ఛార్జీలు రద్దు చేయాలి’’.. సుప్రీంకోర్టులో పిటిషన్..
- UPI Charges: మళ్లీ క్యాష్ ఎకానమీ వైపు భారత్? రిటైలర్ల ఆందోళన
- Cooking Oil Prices: పండగల వేళ సామాన్యుడికి ఊరట.. వంటనూనెలపై దిగుమతి కేంద్రం కీలక అడుగు!
QS విశ్లేషకులు విడుదల చేసిన ఒక ప్రకటన ప్రకారం, ర్యాంకింగ్స్ యొక్క తాజా ఎడిషన్ దాని అతిపెద్ద పద్దతి మెరుగుదలని అమలు చేసింది, స్థిరత్వం, ఉపాధి ఫలితాలు మరియు అంతర్జాతీయ పరిశోధన నెట్‌వర్క్ అనే మూడు కొత్త కొలమానాల ద్వారా ఇప్పటికే ఉన్న నిర్దిష్ట సూచికలు, విద్యాపరమైన ప్రతిష్ట, మరియు అధ్యాపక విద్యార్థుల నిష్పత్తి తదితర అంశాలను దృష్టిలో పెట్టుకొని ఈ ర్యాంకింగ్స్ ను జారీ చేశారు. క్యూఎస్ వరల్డ్ యూనివర్సిటీ ర్యాంకింగ్స్‌లో భారతీయ విశ్వవిద్యాలయాల పనితీరుపై కేంద్ర మంత్రి రాజీవ్ చంద్రశేఖర్ సంతోషం వ్యక్తం చేశారు. గత 9 ఏళ్లలో ప్రధాని మోదీ భారతదేశంలో విద్యా వ్యవస్థలో అద్భుతమైన మార్పులు తీసుకొచ్చారని.. నేడు దేశంలో యూనివర్సిటీలో ప్రపంచ స్థాయికి చేరుకున్నాయని అన్నారు. ఈ సంవత్సరం క్యూఎస్ వరల్డ్ యూనివర్సిటీ ర్యాంకింగ్స్‌లో 45 భారతీయ విశ్వవిద్యాలయాలు ర్యాంకింగ్స్‌లో చేరడం సంతోషంగా ఉందన్నారు. గత 9 సంవత్సరాలలో.. ప్రధాని మోదీ భారతదేశంలో విద్యను సమూలంగా మార్చారని.. నేడు భారతీయ విశ్వవిద్యాలయాలు ప్రపంచ స్థాయికి చేరుకున్నాయని కేంద్ర మంత్రి రాజీవ్ చంద్రశేఖర్ పేర్కొన్నారు.
Read also: Amit Malviya: రాహుల్ గాంధీపై బీజేపీ ఐటీ సెల్ చీఫ్ అమిత్ మాల్వియా ట్వీట్లు.. కేసు నమోదు
ఈ ర్యాకింగ్స్‌లో భారతీయ విశ్వవిద్యాలయాలు సంఖ్య గత తొమ్మిదేళ్లలో 297 శాతం పెరిగింది. భారతీయ విశ్వవిద్యాలయాలు తమ పనితీరును ఎప్పటికప్పుడు మెరుగుపరుచుకుంటున్నందుకు వారిని అభినందించాలనుకుంటున్నానని క్యూఎస్ ఫౌండర్, సీఈవో నన్జియో క్వాక్వారెల్లి పేర్కొన్నారు. తాము ఈ సంవత్సరం ర్యాంకింగ్ సిస్టమ్ కోసం 2900 సంస్థలను రేటింగ్ చేశామన్నారు. ర్యాంకింగ్‌లో 45 భారతీయ విశ్వవిద్యాలయాలు ఉన్నాయని తెలిపారు. గత తొమ్మిదేళ్లలో ఇండియాలో 297 శాతం పెరుగుదల ఉందన్నారు. భారతీయ విశ్వవిద్యాలయాల్లో నిరంతర, స్థిరమైన అభివృద్ధి ఉందని క్వాక్వారెల్లి పేర్కొన్నారు.
తాజావార్తలు
-
NTV Comment : కంటెంట్ బాగుంటే ఏ సినిమాని ఎవ్వరూ ఆపలేరు బాస్!
-
OTR : చంద్రగిరి కూటమి పార్టీల ముఖ్యుల మధ్య విభేదాలు
-
Story Board: ఆర్థిక ఊబిలో తెలుగు రాష్ట్రాలు
-
Central Govt: అడ్వాన్స్ టిప్ విధానాన్ని ఆపేయండి.. క్యాబ్ కంపెనీలకు కేంద్రం ఆదేశాలు
-
UPI Charges: ‘‘యూపీఐ ఛార్జీలు రద్దు చేయాలి’’.. సుప్రీంకోర్టులో పిటిషన్..
ట్రెండింగ్
-
Meta One వచ్చేసింది.. ఇంస్టాగ్రామ్, వాట్సాప్, ఫేస్ బుక్ కు కొత్త సబ్స్క్రిప్షన్ ప్లాన్ ధరలు ఇదిగో.!
-
రూ.15,999కే 7,000mAh బ్యాటరీ, 2TB వరకు స్టోరేజ్ సపోర్ట్, 120Hz డిస్ప్లేతో OPPO K14 Lite లాంచ్.!
-
IPL 2027 Auction: బీసీసీఐ కీలక నిర్ణయం.. భారత్‌లోనే ఐపీఎల్ 2027 వేలం!
-
Sanju Samson vs Vaibhav: వైభవ్ సూర్యవంశీతో పోటీ.. సంజు శాంసన్ సంచలన వ్యాఖ్యలు!
-
Nitish Kumar Reddy: నా టార్గెట్ అదే.. అందుకోసమే కష్టపడుతున్నా!