CJI BR Gavai: సోషల్ మీడియాలో భారత ప్రధాన న్యాయమూర్తి(సీజేఐ) బీఆర్ గవాయ్ తీవ్ర వ్యతిరేకతను ఎదుర్కొంటున్నారు. ఒక కేసులో ‘‘విష్ణువు’’ను ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలపై హిందువులు మండిపడుతున్నారు. ఖజురహోలో పురాతన విష్ణువు విగ్రహాన్ని పునరుద్ధరించాలని దాఖలైన పిల్‌ను ఆయన తోసిపుచ్చారు. ఛతర్‌పూర్ జిల్లాలోని జవారీ ఆలయంలో దెబ్బతిన్న విగ్రహాన్ని భర్తీ చేసి ప్రతిష్టించాలని కోరుతూ రాకేష్ దలాల్ అనే వ్యక్తి దాఖలు చేసిన పిటిషన్‌ను ప్రధాన న్యాయమూర్తి గవాయ్ నేతృత్వంలోని ధర్మాసనం తిరస్కరించింది.
దీనిని విచారించిన సుప్రీం ధర్మాసనం..‘‘ఇది పూర్తిగా ప్రచార ప్రయోజన వ్యాజ్యం. వెళ్లి దేవుడినే ఏదైనా చేసుకోమని అడగండి. మీరు విష్ణువు భక్తులని మీరు అనుకుంటే, మీరు ప్రార్థన చేసి, కొంత ధ్యానం చేయండి’’ అని సీజేఐ అన్నారు. ఈ ఆలయం ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా అధికార పరిధి కిందకు వస్తుందని పేర్కొంటూ పిటిషన్‌ను తోసిపుచ్చింది.
Read Also: Tariff On India: అమెరికాకు తత్వం బోధపడింది.. భారత్‌పై 25% టారిఫ్ తగ్గించే ఛాన్స్..
అయితే, సీజేఐ చేసిన వ్యాఖ్యలపై వివాదం చెలరేగింది. విష్ణువుపై ఇలాంటి వ్యాఖ్యలు చేయడం హిందువుల మనోభావాలను దెబ్బతీశాయని పలువురు న్యాయవాదులు బహిరంగ లేఖ రాశారు. మరికొందరు ఆయన క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. చర్యల కోసం రాష్ట్రపతికి లేఖ రాశారు. ఈ మొత్తం వివాదంపై సీజేఐ గవాయ్ స్పందిస్తూ.. ‘‘ నేను చేసిన వ్యాఖ్యలనున సోషల్ మీడియాలో ఒక నిర్దిష్ట పద్ధతిలో చిత్రీకరించారని ఎవరో నాకు చెప్పారు. నేను అన్ని మతాలను గౌరవిస్తాను’’ అని ఆయన అన్నారు. సోషల్ మీడియా దెబ్బను నేపాల్‌లో సీజేఐ పోల్చారు. నేపాల్ లో కూడా ఇలాగే జరిగిందని వ్యాఖ్యానించారు.
ఈ రోజు ధర్మాసనం ముందు హాజరైన సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా మాట్లాడుతూ.. గత 10 ఏళ్లుగా సీజేఐ గవాయ్ తనకు తెలుసునని, ప్రధాన న్యాయమూర్తి అన్ని మతపరమైన ప్రదేశాలను సందర్శించారని చెప్పారు. మేము న్యూటన్ సూత్రాన్ని తెలుసుకున్నాము. ప్రతీ చర్యకు సమాన ప్రతిచర్య ఉంటుంది. ఇప్పుడు ప్రతి చర్యకు అసమాన సోషల్ మీడియా ప్రతిచర్య ఉంటుంది’’ అని అన్నారు. మరో సీనియర్ న్యాయవాది కపిల్ సిబల్ మాట్లాడుతూ.. మేము ప్రతీ రోజు సోషల్ మీడియా వల్ల బాధపడుతున్నామని, సోషల్ మీడియా వికృత గుర్రం, దానిని మచ్చిక చేసుకునే మార్గం లేదు అని అన్నారు.
