Honeymoon: పెళ్లి కావడంలేదు.. అమ్మాయి దొరకడం లేదంటూ అబ్బాయిలు అందరూ బాధపడుతుంటే ఒకడేమో భార్యపట్లు అమానుషంగా ప్రవర్తించిన తీరు తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది. పెళ్లై హనీమూన్ కి వెళ్లిన వధువుపై షాడిస్టులా వ్యవహరించాడు వరుడు. తనతో వున్న న్యూడ్ ఫోటోలు, వీడియోలు చిత్రీకరించి తనతో శోభనం చేయాలంటే పది లక్షలు ఇస్తేనే శోభనం చేస్తానని అనడంతో వధువు షాక్ కు గురైంది. నిర్ఘాంత పోయే ఈఘటన ఉత్తరప్రదేశ్‌లోని బడాయూలో చోటుచేసుకుంది.
ఉత్తరప్రదేశ్‌లోని బడాయూకు చెందిన ఓ యువకుడికి ఈ ఏడాది ఫిబ్రవరి 6న పిలిభిత్‌కు చెందిన యువతితో వివాహమైంది. పెళ్లి సమయంలో రూ. 15 లక్షలతో భారీ మొత్తంలో నగదు, ఆభరణాలు కట్నంగా ఇచ్చారు. కానీ వరుడుకు మాత్రం దాంతో సంతోషపడలేదు. వధువును శోభనం జరగనీయకుండా దూరంగా పెట్టాడు. ఎందుకు భర్త దూరం పెడుతున్నాడో వధువుకు అర్థం కాలేదు. కొద్దిరోజుల పాటు ఎదురుచూసిన యువతి మార్చి 29న ఈ విషయాన్ని తన అత్తకు చెప్పింది.. కానీ అత్త అసలు పట్టించుకోకపోవడంతో పుట్టింటికి వచ్చి జరిగినదంతా తల్లికి వివరించింది. ఏప్రిల్ 22న కుమార్తెను తీసుకొచ్చిన బాధితురాలి తల్లిదండ్రులు ఇదే అంశంపై మాట్లాడారు. దీంతో అతని నిజస్వరూపం బయటపడింది. రూ.10 లక్షలు ఇస్తేనే తన భార్యను హనీమూన్ కు తీసుకెళ్తానని, శోభనం కూడా అప్పుడే అని వరుడు చెప్పడంతో షాక్ తిన్నారు. ఇప్పటికే చాలా వరకు ఇచ్చామని ఇది కరెక్ట్ కాదని ఎంతచెప్పినా వరుడు వినలేదు.
కూతురు జీవితం కోసం అప్పుతీసుకుని వచ్చి అంత ఇవ్వలేమని రూ.5 లక్షలు వరకు ఇచ్చారు. మే 7న భార్యాభర్తలిద్దరూ హనీమూన్ కోసం నైనిటా వెళ్లారు. తన భర్తతో ఎంతో సంతోషంగా గడిపేందుకు వెళ్లిన భార్యపై షాడిజం చూపించాడు. ఒక రూంలో తనపై అసహ్యంగా ప్రవర్తించి ఆమెను వివస్ర్తను చేసి అసభ్యకరమైన ఫోటోలు, వీడియోలు తీసి భార్యను బ్లాక్ మెయిల్ చేశాడు. తనకు ఇంకా రావాల్సిన మిగిలిన రూ.5 లక్షలు తీసుకురాకపోతే సోషల్ మీడియాలో పెట్టి వైరల్ చేస్తానని భార్యను బెదిరించాడు. దీంతో భర్త చేష్టలకు విసిగిపోయిన బాధితురాలు మే 13న పుట్టింటి తిరిగి వచ్చింది. దీంతో ఆమె తన తల్లిదండ్రులను పోలీస్ స్టేషన్‌కు తీసుకెళ్లి తన అత్త, ఆమె భర్తపై పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. తన భర్త ఎందుకు అలా ప్రవర్తిస్తున్నాడు. ఇంతకు ముందే ఇలాంటి ఘటనలు తన ఖాతాలో వున్నాయా? అనే విషయంలో పోలీసులు ఆరా తీస్తున్నారు.
Marriage : యువతి పెళ్లి జరుగుతుండగా లవర్ ఎంట్రీ.. మ్యారేజ్ క్యాన్సిల్