ముంబై, ఢిల్లీ అంతర్జాతీయ విమానాశ్రయాల్లో భారీగా విదేశీ గంజాయి పట్టుబడింది. రూ.9 కోట్ల విలువ చేసే 9 కేజీల గంజాయిను కస్టమ్స్ అధికారులు సీజ్ చేశారు. బ్యాంకాక్ నుంచి ముంబై, ఢిల్లీకి తరలిస్తుండగా ఇద్దరు స్మగ్లర్ల దగ్గర గంజాయి గుర్తించి స్వాధీనం చేసుకున్నారు.