యువత రోజురోజుకు ఎక్కడ ఎలా ఉండాలో ఎలా ప్రవర్తించాలో కూడా వారికి తెలియడంలేదు. సామాజిక విలువలను మర్చిపోయి.. సీక్రెట్ చేయాల్సిన పనులన్ని అందరి ముందు కానిచ్చేస్తున్నారు. దీంతో చుట్టు పక్కన ఉన్న వారు ఇబ్బంది పడుతున్నారు. ఢిల్లీలోని మెట్రోలో ఓ జంట హద్దులు దాటి ప్రవర్తించింది. అందరూ చూస్తుండగానే ముద్దులు పెట్టుకున్నారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది.
పూర్తి వివరాల్లోకి వెళితే… ఢీల్లీ మెట్రో స్టేషన్ లో ఓ జంట హద్దులు దాటి ప్రవర్తించింది. ఎంతో మంది ప్రయాణించే మెట్రోలో ఓ జంట రెచ్చిపోయింది. చుట్టూ జనాలు ఉన్నా వారిని పట్టించుకోకుండా ముద్దుల్లో మునిగిపోయింది. ఈ సంఘటన భారతదేశంలోని అనేక ప్రాంతాలలో ఆధునిక సామాజిక ప్రవర్తనలు, లోతుగా పాతుకుపోయిన సాంప్రదాయిక సాంస్కృతిక నిబంధనల మధ్య కొనసాగుతున్న ఉద్రిక్తతను హైలైట్ చేస్తుంది.
Read Also:Dog Attacks: కుక్కలపై నాటకం.. ఎగబడి కరిచిన కుక్క
ఈ ఘటన ఢిల్లీ మెట్రోలో అది కూడా లేడీస్ కంపార్ట్‌మెంట్‌లో జరిగినట్లు సమాచారం. పక్కపక్కన కూర్చున్న యవతీయువకులు పక్కన వారిని పట్టించుకోకుండా ఘాటు రొమాన్స్ లో మునిగిపోయారు. వాళ్ల రొమాన్స్ చూసీ చూడనట్టుగా ఉంటూ పక్కన వ్యక్తి ఇబ్బందిపడుతున్నా వాళ్లు మాత్రం లోకాన్నే మర్చిపోయారు. ఈ ఘటనను ఓ వ్యక్తి రికార్డ్ చేసి ఎక్స్‌లో పెట్టడంతో వైరల్ అవుతోంది. ఈ దృశ్యాలు ఆన్‌లైన్‌లో విమర్శలకు దారితీశాయి. నెటిజన్లు వీరి చేసిన పని చూసి రకరాకాలుగా కామెంట్లు పెడుతున్నారు. కొందరేమో ఎంత కరువులో ఉన్నార్రా బాబు అంటూ కామెంట్లు పెట్టారు. మరి కొందరు ఇదేమైనా ఓయో రూమ్ అనుకున్నావా అంటూ విచిత్రంగా కామెంట్లు పెడుతున్నారు.
ఏదేమైనప్పటికి ఇలా చేయడంతో అసభ్యకరంగా ఫీలవుతున్నారు ప్రయాణీకులు. మెట్రోలో పెద్ద వాళ్లు, చిన్న వాళ్లు ఉంటారు. వాళ్ల ముందే ఇలా ప్రవర్తించడంతో … ముందు తరాలకు మీరిచ్చే మెసేజ్ అన్నట్లుగా ఆ జంట ప్రవర్తన ఉంది. ఇలాంటి గతంలో కూడా వచ్చినప్పటికి ఎలాంటి తీసుకోకపోవడం గమానార్హం.