Buffalo Solved Problem: బర్రె పంచాయితీని బర్రే.. తేల్చేసింది.. ఎలాగంటే?
- బర్రె వివాదాన్ని పరిష్కరించింది..
- పెద్ద మనుషులు..పోలీసులు తెంచలేని పంచాయితీని బర్రె తేల్చింది..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Buffalo Solved Problem: ఓ బర్రె తన యజమాని వివాదాన్ని పరిష్కరించింది. పంచాయితీ పెద్ద మనుషులు, స్థానిక పోలీసులు తేల్చలేకపోయిన పంచాయితీని బర్రె తేల్చింది. ఇది వింతగా అనిపించినప్పటికీ నిజంగానే జరిగింది. తప్పిపోయిన ఓ బర్రె తనదంటే తనదని ఇద్దరు వ్యక్తులు గొడవకు దిగారు. వారిద్దరి మధ్య గొడవ తేలకపోవడంతో పంచాయితీ పెద్దల వద్దకు వెళ్లారు. పంచాయితీ పెద్దల వద్ద పరిష్కారం లభించకపోవడంతో స్థానిక పోలీసులను ఆశ్రయించారు. పోలీసులు కూడా దీనిని తేల్చలేక చేతులెత్తేశారు. దీంతో ఇక లాభం లేదనుకొని బర్రెకే నిర్ణయం వదిలేయగా.. ఆ బర్రె అసలు యజమానిని గుర్తించి అతడి ఇంటికి చేరడంతో సమస్యకు పరిష్కారం లభించింది.
Read Also: Falaknuma Express: వీల్ బ్రేక్ లాక్.. మిర్యాలగూడలో ఫలక్ నుమా ఎక్స్ ప్రెస్ నిలిపివేత..
Also Read
- CJP Protest: ఢిల్లీలో హై అలర్ట్.. ఇంటర్నెట్ బంద్, మెట్రో స్టేషన్ల మూసివేత.. రంగంలోకి 35,000 మంది భద్రతా సిబ్బంది
- Supreme Court: ‘‘రవాణాను పూర్తిగా నిలిపివేయలేరు’’.. ఢిల్లీ ఆంక్షలపై సుప్రీంకోర్టు
- Amit Shah: రాహుల్ గాంధీ అబద్ధాల మధ్య బీజేపీ వరస విజయాలు..
- Delhi Traffic: ఢిల్లీ ట్రాఫిక్‌పై ఆంక్షలు.. 30 ప్రాంతాల్లో వాహనాల రాకపోకలకు అంతరాయం..
అసలు ఏం జరిగిందంటే.. ఉత్తరప్రదేశ్‌లోని ప్రతాప్‌గఢ్ జిల్లా మహేశ్ గంజ్ పోలీస్ స్టేషన్ పరిధిలోని అక్షరాంపూర్ గ్రామంలో నందలాల్ సరోజ్‌కు చెందిన బర్రె కొన్ని రోజుల క్రితం తప్పిపోయింది. అది పొరుగున ఉన్న పూరే హరికేశ్ గ్రామానికి చేరింది. ఆ గ్రామానికి చెందిన హనుమాన్ ఆ బర్రెను కట్టేశాడు. నందలాల్ ఎంత వెతికినా బర్రె ఆచూకీ దొరకలేదు. చివరికి హరికేశ్ గ్రామంలో హనుమాన్ వద్ద ఉందని తెలిసి, అక్కడికి వెళ్లి అడగ్గా ఆ బర్రె తనదేనని వాదించాడు. దాంతో హనుమాన్‌ను నందలాల్ రెండు గ్రామాల పెద్దల సమక్షంలో పంచాయితీకి పిలిపించాడు. తప్పిపోయిన బర్రె తనదంటే తనదని ఇద్దరూ వాదులాడుకోగా.. ఏం చేయాలో పాలుపోకపోవటంతో పంచాయితీ పెద్దల సూచన మేరకు స్థానిక పోలీస్ స్టేషన్‌లో పరస్పరం ఫిర్యాదు చేసుకున్నారు. పోలీస్ స్టేషన్‌లో కూడా ఈ వివాదం తేలలేదు.
ఏం చేయాలో పాలుపోకపోవడంతో పోలీసు అధికారి ఓ నిర్ణయానికి వచ్చారు. ఆ బర్రెను రెండు ఊళ్ల మధ్య విడిచిపెట్టి, ఆ బర్రె ఏ యజమాని చెంతకు చేరితే వారే అసలైన యజమాని అని ప్రతిపాదన చేశారు. ఈ ప్రతిపాదనకు ఇద్దరూ ఒప్పుకున్నారు. దాంతో బర్రెను రెండు ఊళ్ల మధ్య వదిలేశారు. ఆ బర్రె నేరుగా అక్షరాంపూర్ గ్రామంలోని నందలాల్ సరోజ్ ఇంటికి వెళ్లింది. దాంతో ఆ బర్రె నందలాల్‌దే అని నిర్ధారణకు వచ్చారు. తప్పుడు కేసు పెట్టి సమయాన్ని వృథా చేసినందుకు హనుమాన్‌ను హెచ్చరించి వదిలేశారు. పంచాయితీ పెద్దలు కూడా అతడిని మందలించారు.
తాజావార్తలు
-
Shreyas Iyer: “ఆ ఇద్దరి వల్లే మ్యాచ్ ఓడిపోయాం”.. కెప్టెన్ సంచలన వ్యాఖ్యలు..
-
Saturday Horoscope: శనివారం దిన ఫలాలు.. ఆ రాశుల వారికి పట్టిందల్లా బంగారమే!
-
CJP Protest: ఢిల్లీలో హై అలర్ట్.. ఇంటర్నెట్ బంద్, మెట్రో స్టేషన్ల మూసివేత.. రంగంలోకి 35,000 మంది భద్రతా సిబ్బంది
-
Panama Earthquake: 7.7 తీవ్రతతో భారీ భూకంపం.. ఊగిపోయిన భవంతులు.!
-
AP Cabinet: రేపు ఏపీ కేబినెట్ అత్యవసర సమావేశం.. వాటిపైనే కీలక చర్చ..
ట్రెండింగ్
-
Pitod Ki Sabzi: ఇంట్లో కూరగాయలు లేవా? శనగపిండితో సింపుల్‌గా రాజస్థానీ స్టైల్లో ఈ రుచికరమైన పితోడ్ కూర చేసేయండి!
-
Bathroom Design Tips: బాత్రూమ్ ఎంత శుభ్రం చేసినా మళ్లీ తడిగానే ఉంటోందా? కారణం మీ క్లీనింగ్ కాదు.. ఈ సమస్య కావచ్చు!
-
AI Dance Video: “ప్రాంప్ట్ ఇదిగో”.. ఇద్దరు డ్యాన్స్.. కారులో నుంచి మూడో వ్యక్తి ఎంట్రీ! ఈ వైరల్ ఏఐ వీడియోను మీరే ఈజీగా చేసుకోండి..!
-
10,000mAh బ్యాటరీ, IP68/IP69-రేటెడ్ ప్రొటెక్షన్ తో రాబోతున్న Redmi Turbo 6 Max..!
-
Gen Z Side Hustles: జీతం ఒక్కటే సరిపోవడం లేదు.. అదనపు సంపాదన కోసం జెన్‌జీ కొత్త దారులు