Honeymoon Murder: రాజా లాగే మరో మహిళను హత్య చేయాలని ప్లాన్.. సోనమ్ కేసులో సంచలన విషయం..
- హనీమూన్ మర్డర్ కేసులో సంచలన విషయాలు..
- రాజాలాగే మరో మహిళను హత్య చేయాలని ప్లాన్..
- సోనమ్‌గా నమ్మించే యత్నం..
- పెళ్లికి ముందు నుంచే హత్యకు కుట్ర..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Honeymoon Murder: మేఘాలయ హనీమూన్ మర్డర్ కేసులో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. రాజా రఘువంశీని అత్యంత దారుణంగా హత్య చేయించింది భార్య సోనమ్ రఘువంశీ. తన ప్రియుడు రాజ్ కుష్వాహాతో కలిసి ప్లాన్ చేసి, ఈ దారుణానికి తెగబడింది. ముగ్గురు కిరాయి హంతకులతో మేఘాలయలోని కాసీ హిల్స్‌లో రాజాను మర్డర్ చేశారు. మే 23న రాజా హత్య జరిగితే, జూన్ 02న పోలీసులకు అతడి మృతదేహం లభ్యమైంది. చివరకు, జూన్ 08న నిందితురాలు సోనమ్ యూపీలోని ఘాజీపూర్ పోలీసుల ముందు లొంగిపోయింది.
అయితే, ఇప్పుడు నిందితులందర్ని మేఘాలయ పోలీసులు విచారిస్తున్నారు. ఈ దర్యాప్తులో మరిన్ని సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. రాజా రఘువంశీని హత్య చేసిన తర్వాత, మరో మహిళను కూడా హత్య చేయాలని నిందితులు ప్లాన్ చేసినట్లు తేలింది. సోనమ్ కూడా చనిపోయిందని నమ్మించాలనే ప్రయత్నంలో మహిళను హత్య చేయాలని భావించారు.
Also Read
- IMD Weather Alert: రేపు దేశవ్యాప్తంగా దంచికొట్టనున్న వానలు.. ఈ రాష్ట్రాలకు ఐఎండీ అలర్ట్
- Shocking Incident: రూ. 60 లక్షల ప్యాకేజ్ అల్లుడు.. చిన్న గొడవకే చంపేసిన అత్తింటివారు..
- PM Modi: బీజేపీ కొత్త టీమ్‌తో మోడీ భేటీ.. జెన్-జీపై ప్రత్యేక ఫోకస్
- Abhijeet Dipke: స్కూల్లోకి ఎంట్రీ.. టీచర్లకు బెదిరింపు! అభిజీత్ దీప్కేపై కేసు
Read Also: Netherlands: వన్డేల్లో చరిత్ర సృష్టించిన పసికూన నెదర్లాండ్స్.. టీమిండియాకు కూడా సాధ్యం కాలేదు!
రాజాను చంపడానికి కుట్ర ఇండోర్‌లో జరిగింది. మే 11న సోనమ్‌తో అతడి వివాహం జరిగింది. దీనికి ముందే హత్య చేయాలని ప్లాన్ చేసుకున్నారు. ఈ హత్యకు ప్రధాన సూత్రధారి సోనమ్ లవర్ రాజ్. ఈ కుట్రకు సోనమ్ అంగీకరించిందని తూర్పు ఖాసీ హిల్స్ జిల్లా ఎస్పీ వివేక్ సయీమ్ చెప్పారు. హత్య తర్వాత బుర్ఖా ధరించి సోమన్ అక్కడి నుంచి తప్పించుకున్నట్లు పోలీసు విచారణలో తేలింది. ఈ హత్యకు పాల్పడిన కాంట్రాక్ట్ కిల్లర్స్ విశాల్, ఆకాష్, ఆనంద్‌లను కూడా పోలీసులు అరెస్ట్ చేశారు.
మేలో వీరిద్దరి వివాహం జరిగితే ఫిబ్రవరి నుంచే హత్యకు ప్లాన్ చేశారు. ఒక పథకం ప్రకారం, సోనమ్ నదిలో కొట్టుకుపోతున్నట్లు ప్రజల్ని నమ్మించడం, మరొక పథకం ప్రకారం, ఎవరైనా మహిళను హత్య చేసి మృతదేహాన్ని తగులబెట్టడం వంటివి ప్లాన్ చేశారు. ముందుగా మేఘాలయలో కాకుండా, గౌహతిలోనే రాజాను హత్య చేయాలని ప్లాన్ చేశారు.
తాజావార్తలు
-
Hockey World Cup 2026: భారత్‌కు షాక్.. చివరి 15 నిమిషాల్లో కథ మారింది.. నెదర్లాండ్స్ చేతిలో ఓటమి
-
Huma Qureshi: ‘టాక్సిక్’ తర్వాత టాలీవుడ్లోకి హ్యూమా.. దిల్ రాజు ముందే మాట ఇచ్చేసిందా?
-
Rukmini Vasanth: యశ్‌తో పనిచేయడం బకెట్ లిస్ట్ మూమెంట్.. ‘టాక్సిక్’ హీరోయిన్ కామెంట్స్ వైరల్!
-
IMD Weather Alert: రేపు దేశవ్యాప్తంగా దంచికొట్టనున్న వానలు.. ఈ రాష్ట్రాలకు ఐఎండీ అలర్ట్
-
Off The Record: జగన్‌కు బీఆర్ఎస్ నేతలు ఘన స్వాగతం.. కారణం ఇదేనా…!
ట్రెండింగ్
-
Maharashtra: “ఇది కదా విశ్వాసం అంటే”.. యజమానులు తిరిగిరారని తెలియక.. తిండి, నీళ్లు మానేసిన పెంపుడు కుక్క
-
Karnataka: పెళ్లి కొడుకు రాహుల్ గాంధీ ఫ్యాన్.. పెళ్లి క్యాన్సల్ చేసిన యువతి? షాకింగ్ కారణం!
-
64MP కెమెరా, 5,700mAh బ్యాటరీతో వచ్చేసిన Philips S7221 5G ఫోన్.. ధర ఎంతంటే?
-
Crispy Veggie Fingers: బయట క్రిస్పీ.. లోపల సాఫ్ట్.! నోరూరించే ‘క్రిస్పీ వెజ్జీ ఫింగర్స్’ సింపుల్ అండ్ టేస్టీ స్నాక్ చేసేయండి ఇలా.!
-
7 సీటర్‌కు బదులు 6 సీటర్.. క్యాప్టెన్ సీట్లతో Mahindra XEV 9S కొత్త వేరియంట్..!