Off The Record: జగన్‌కు బీఆర్ఎస్ నేతలు ఘన స్వాగతం.. కారణం ఇదేనా…!
- జగన్‌కు స్వాగతం పలుకుతూ స్వాగత తోరణాలు, కటౌట్లు..
- కటౌట్స్, బ్యానర్స్ ఏర్పాటు చేసిన బీఆర్ఎస్ నేతలు..
- జగన్‌కు వెల్కమ్ పలకడం వెనుక రాజకీయ అవసరం..?..
- గ్రేటర్ పరిధిలో జగన్ అభిమానులు, వైసీపీ కార్యకర్తలు..
- జగన్ అభిమానుల ఓట్ బ్యాంక్‌ను బీఆర్ఎస్కు మళ్లించడమే లక్ష్యమా..?..
- జగన్ అభిమానుల ఓట్లు బీఆర్ఎస్కు పడేలా చేయడమే వ్యూహం..?..
- కటౌట్స్, బ్యానర్స్ వెనుకలా బీఆర్ఎస్ పెద్దల పాత్ర లేదా..?..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Off The Record: తెలంగాణ రాజకీయాలు ఆసక్తికరంగా మారాయి. దానికి ప్రధాన కారణం ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి హైదరాబాద్ వచ్చిన సమయంలో జరిగిన హడావుడే. ఈ నెల 21న ఓ పెళ్లికి వచ్చిన జగన్ మోహన్ రెడ్డిని రిసీవ్ చేసుకునేందుకు వందలాది మంది బేగంపేట ఎయిర్‌పోర్ట్‌కు వచ్చారు. ఎయిర్పోర్ట్ నుంచి నెక్లెస్ రోడ్ వరకు జగన్‌కు స్వాగతం పలుకుతూ స్వాగత తోరణాలు, కటౌట్లు ఏర్పాటు చేశారు. ఇవన్నీ వైసీపీ నేతలో, కార్యకర్తలలో చేసి ఉంటే ఇంతలా చెప్పుకోవాల్సిన అవసరం ఉండదు. కానీ తెలంగాణలో ప్రధాన ప్రతిపక్షంగా ఉన్న బీఆర్ఎస్ నేతలు జగన్‌కు స్వాగతం పలుకుతూ కటౌట్స్, బ్యానర్స్ ఏర్పాటు చేశారు. దీనిపై రాజకీయ చర్చ మొదలైంది. అసలు తెలంగాణలో వైసీపీ యాక్టివిటీ ఏమీ లేదు. అది పూర్తిగా ఆంధ్రప్రదేశ్ రాజకీయాలకు పరిమితమైన పార్టీ. అలాంటప్పుడు తెలంగాణలో జగన్‌కు ఈ రేంజ్లో స్వాగత కటౌట్లు పెట్టాల్సిన అవసరం ఏమొచ్చిందనే చర్చ రాజకీయ వర్గాలతోపాటు జనంలోనూ జరుగుతోంది.
అయితే… జగన్‌కు వెల్కమ్ పలకడం వెనక రాజకీయ అవసరం కూడా ఉండి ఉంటుందనే మాటలు వినిపిస్తున్నాయి. గ్రేటర్ పరిధిలో త్వరలో జరగబోయే మూడు కార్పోరేషన్ల ఎన్నికలే కారణమనే విశ్లేషణలు జరుగుతున్నాయి. జగన్మోహన్ రెడ్డి ఏపీ రాజకీయాలకే పరిమితమైనప్పటికీ ఆయన అభిమానులు, వైసీపీ కార్యకర్తలు గ్రేటర్ పరిధిలో చాలామందే ఉన్నారు. వారి ఓట్లపై బీఆర్ఎస్ కన్నేసిందనే మాట వినిపిస్తోంది. జగన్‌కు ఇంత ఘనంగా స్వాగతం పలకడం… వచ్చే ఎన్నికల్లో తమకు కలసి వస్తుందని బీఆర్ఎస్ భావిస్తోందట. మూడు కార్పొరేషన్ల పరిధిలో ఉన్న జగన్ అభిమానుల ఓటు బ్యాంకు బీఆర్ఎస్ వైపు మళ్ళించడం కోసమే ఇలాంటి ఏర్పాట్లు చేశారట గులాబీ నాయకులు. మూడు కార్పొరేషన్ల పరిధిలో ఏపీకి చెందిన చాలామంది తమ ఓట్లను ఎస్ఐఆర్ ప్రక్రియలో తొలగించుకున్నారు. అదే సమయంలో కొందరు తమ ఓట్లను ఇక్కడే కొనసాగించుకున్నారు. వారిలోని జగన్ అభిమానులను తమవైపు తిప్పుకోవడం, వారి ఓట్లను తమ పార్టీకి మళ్లించుకోవడమే బీఆర్ఎస్ వ్యూహం అని చెప్పుకుంటున్నారు. ఇంత పెద్ద ఎత్తున ఏర్పాటు చేసిన కటౌట్లను, స్వాగత తోరణాలను జగన్ చూసీచూడనట్టు వదిలేసినా… కేటీఆర్, కేసీఆర్, జగన్ ఫొటోలతో కూడిన కటౌట్లు మాత్రం అభిమానుల మనసులో నిలిచిపోతాయనే భావన ఉంది.
Also Read
- OTR: నామినేటెడ్ పోస్టులు ఫర్ సేల్? ఒక్కో పోస్టుకు ఒక్కో రేటు?
- Vande Bharat Sleeper: ఏపీ మీదుగా వందే భారత్ స్లీపర్ ట్రైన్.. ఆగే స్టేషన్లు ఇవే..
- Punjab: ఎన్నికల వేళ హస్తం పార్టీకి షాక్.. కాంగ్రెస్ అధ్యక్షుడు అమరీందర్ వారింగ్ రాజీనామా
- Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
జగన్మోహన్ రెడ్డిని చూసేందుకు ఆయనకు స్వాగతం పలికేందుకు, వీడ్కోలు చెప్పేందుకు బేగంపేట ఎయిర్‌పోర్ట్‌కు వచ్చే ప్రతీ అభిమాని చూసే విధంగా కటౌట్లు ఏర్పాటు చేశారు. రాబోయే ఈ మూడు కార్పొరేషన్ల ఎన్నికల్లో వైసీపీ పోటీ చేయదు. ఎవరికి సపోర్ట్ చేయాలో కూడా బహిరంగ ప్రకటన చేసే అవకాశం కూడా లేదు. ఈ నేపథ్యంలో జగన్ ఫోటోలతో బీఆర్ఎస్ నేతల ఫోటోలు కటౌట్లలో పెట్టడం ద్వారా వైసీపీ అభిమానులను తమ వైపు తిప్పుకోవచ్చనే ఆలోచన బీఆర్ఎస్ నేతలు చేశారట. ఈ మొత్తం వ్యవహారంలో బీఆర్ఎస్ కీలక నేతలు, గులాబీ పార్టీ పెద్దల పాత్ర ఉండకపోవచ్చని తెలంగాణ భవన్ వర్గాలంటున్నాయి. బీఆర్ఎస్లో ఉండి జగన్మోహన్ రెడ్డి అంటే అభిమానం ఉన్న నాయకులే ఇలా కటౌట్లు, బ్యానర్లు పెట్టి ఉంటారని పార్టీలో చర్చ జరుగుతోంది.
తాజావార్తలు
-
Harish Rao: టీజీ ట్రాన్స్‌కో వాటాల విక్రయంపై రాహుల్ గాంధీకి హరీశ్ రావు లేఖ
-
OTR: తాడేపల్లిలో జగన్ మార్క్ క్లాస్! స్థానిక ఎన్నికల్లో పోటీ చేసి తీరాల్సిందేనా?
-
Off The Record: విజయవాడ మేయర్ సీటుపై వైసీపీ మైండ్ గేమ్?
-
OTR: నామినేటెడ్ పోస్టులు ఫర్ సేల్? ఒక్కో పోస్టుకు ఒక్కో రేటు?
-
Vande Bharat Sleeper: ఏపీ మీదుగా వందే భారత్ స్లీపర్ ట్రైన్.. ఆగే స్టేషన్లు ఇవే..
ట్రెండింగ్
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!
-
Breakfast Quesadillas: రోజూ టిఫిన్ గురించి టెన్షన్ వద్దు.. జస్ట్ 20 నిమిషాల్లో రెడీ అయ్యే ఈ బ్రేక్‌ఫాస్ట్‌ను ట్రై చేయండి..