PM Modi: బీజేపీ కొత్త టీమ్‌తో మోడీ భేటీ.. జెన్-జీపై ప్రత్యేక ఫోకస్
- బీజేపీ కొత్త టీమ్‌తో మోడీ భేటీ
- జెన్-జీపై ప్రత్యేక ఫోకస్
- త్వరలో యువతతో సమావేశాలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
బీజేపీ కొత్తగా నియమించిన జాతీయ కార్యవర్గ సభ్యులతో ప్రధాని మోడీ భేటీ అయ్యారు. ఢిల్లీలోని బీజేపీ ప్రధాన కార్యాలయానికి చేరుకున్న ప్రధాని.. పార్టీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్ నియమించిన కొత్త టీమ్‌తో సమావేశమయ్యారు. ఈ భేటీలో యువతతో పార్టీ అనుసంధానం, పార్టీ సిద్ధాంతాలను మరింత విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెళ్లడం వంటి అంశాలు ప్రధానంగా చర్చకు వచ్చినట్లు తెలుస్తోంది.
భేటీకి ముందు బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్ కొత్తగా ఏర్పాటైన జాతీయ కార్యవర్గంతో తొలి పరిచయ సమావేశాన్ని నిర్వహించారు. దీంతో బీజేపీ కొత్త ఆఫీస్ బేరర్ల కొత్త ఇన్నింగ్స్ అధికారికంగా ప్రారంభమైంది. పార్టీ సంస్థాగత కార్యకలాపాలను మరింత బలోపేతం చేయడంతో పాటు.. దేశవ్యాప్తంగా యువతను మరింతగా చేరుకునేందుకు బీజేపీ ప్రణాళికలు సిద్ధం చేస్తోంది.
Also Read
- Aadhaar Name Update: ఆధార్‌లో పేరు మార్చాలా? UIDAI కొత్త SOP.. ఇక ప్రతి మార్పుకు ప్రత్యేక అఫిడవిట్!
- Asaduddin Owaisi: ‘‘హైదరాబాద్‌లో జంతర్ మంతర్ కన్నా పెద్ద నిరసన’’..ఓవైసీ వార్నింగ్..
- KCC Loan Limit: రైతుకు KCC ద్వారా ఎంత డబ్బు వస్తుంది? భూమి, పంట ఆధారంగా లోన్ లిమిట్ ఎలా నిర్ణయిస్తారంటే
- Rahul Gandhi: ‘‘రాహుల్ గాంధీ భయపడ్డారు’’.. అఖిలేష్ హామీతో రాయ్‌బరేలీలో పోటీ..
జెన్-జీపై ప్రత్యేక దృష్టి
యువతతో ప్రత్యక్షంగా, నిరంతరం సంభాషించేందుకు బీజేపీ త్వరలో ‘జెన్ జెడ్ అవుట్‌రీచ్ ప్రోగ్రామ్’’ను ప్రారంభించనుంది. ఈ కార్యక్రమం ద్వారా కొత్త తరం యువత ఆకాంక్షలు, సమస్యలు, అభిప్రాయాలు, భవిష్యత్ అంచనాలను తెలుసుకోవడంపై పార్టీ దృష్టి పెట్టనుంది. అలాగే యువత నేరుగా బీజేపీ నేతలతో మాట్లాడేందుకు.. తమ సమస్యలు, అభిప్రాయాలను పంచుకునేందుకు వేదిక కల్పించనున్నట్లు తెలుస్తోంది. చర్చలు, పరస్పర సమావేశాలు, ఇతర కార్యక్రమాల ద్వారా యువ ఓటర్లతో పార్టీ అనుబంధాన్ని మరింత బలోపేతం చేయాలని బీజేపీ భావిస్తోంది.
టీమ్‌లో కీలక నేతలు
ఈ ప్రత్యేక కార్యక్రమం కోసం ఏర్పాటు చేసిన టీమ్‌లో బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్, జాతీయ ప్రధాన కార్యదర్శులు స్మృతి ఇరానీ, వినోద్ తావ్డే, గుజరాత్ మంత్రి హర్ష్ సంఘవి, ఛత్తీస్‌గఢ్ మంత్రి ఓపీ చౌదరి సహా పలువురు నేతలకు చోటు కల్పించారు. సంస్థాగత అనుభవం ఉన్న నేతలతో పాటు యువతకు చేరువగా ఉండే నాయకత్వాన్ని కలిపి కొత్త తరంతో అనుసంధానం పెంచుకోవాలన్న బీజేపీ వ్యూహాన్ని ఈ టీమ్ ప్రతిబింబిస్తోందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.
త్వరలో కార్యక్రమం ప్రారంభం
జెన్-జీ ప్రోగ్రామ్ త్వరలోనే ప్రారంభించే అవకాశం ఉంది. కార్యక్రమం ఎప్పుడు, ఎక్కడ, ఏ విధంగా నిర్వహించాలనే దానిపై మరిన్ని వివరాలను పార్టీ త్వరలో ప్రకటించనుంది. దేశవ్యాప్తంగా యువతతో ప్రత్యక్ష సంబంధాలను పెంచుకోవడం, వారి ఆలోచనలు, సమస్యలను తెలుసుకోవడం, పార్టీ కార్యకలాపాల్లో యువత భాగస్వామ్యాన్ని పెంచడం ఈ కార్యక్రమం ప్రధాన లక్ష్యాలుగా ఉండనున్నాయి.
Delhi: Prime Minister Narendra Modi meets newly appointed BJP office-bearers at the BJP headquarters.
(Source: DD) pic.twitter.com/jfUNROOv4z
— IANS (@ians_india) August 22, 2026
- Tags
- bjp
- Narendra Modi
- new team
- PM Modi
తాజావార్తలు
-
Singeetam Srinivasa Rao: ప్రయోగాలు ప్రేక్షకులను మెప్పించాయి.. సింగీతంకు డిప్యూటీ సీఎం పవన్ నివాళి!
-
Aadhaar Name Update: ఆధార్‌లో పేరు మార్చాలా? UIDAI కొత్త SOP.. ఇక ప్రతి మార్పుకు ప్రత్యేక అఫిడవిట్!
-
Asaduddin Owaisi: ‘‘హైదరాబాద్‌లో జంతర్ మంతర్ కన్నా పెద్ద నిరసన’’..ఓవైసీ వార్నింగ్..
-
KCC Loan Limit: రైతుకు KCC ద్వారా ఎంత డబ్బు వస్తుంది? భూమి, పంట ఆధారంగా లోన్ లిమిట్ ఎలా నిర్ణయిస్తారంటే
-
Prahaar : సాలిడ్ సక్సెస్ కోసం యంగ్ హీరోపై చాలా నమ్మకం పెట్టుకున్న నిర్మాణ సంస్థ
ట్రెండింగ్
-
Shreyas Iyer: పాకిస్థాన్ బ్యాటర్లు భయపెట్టారు.. గోల్డ్ మెడల్ పోతుందనుకున్నా.. అతడే కాపాడాడు!
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!