Pakistan Suicide Bomber: పాకిస్తాన్‌లో ఆత్మాహుతి దాడి.. 9 మంది పోలీసులు మృతి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
9 policemen killed in Balochistan blast after suicide bomber hits truck from behind: సోమవారం పాకిస్తాన్‌లోని బలోచిస్తాన్ ప్రావిన్స్‌లో జరిగిన ఆత్మాహుతి దాడిలో తొమ్మిది మంది పోలీసు అధికారులు మృతిచెందగా.. మరికొందరు తీవ్రంగా గాయపడ్డారు. ఓ సూసైడ్ బాంబర్ మోటార్ సైకిల్‌తో పోలీసు ట్రక్కును వెనుక నుండి ఢీకొట్టినట్టు అధికారులు తెలిపారు. ఈ ఘటన బలోచిస్తాన్ ప్రావిన్స్ రాజధాని క్వెట్టాకు తూర్పున 160 కి.మీ.ల దూరంలో సిబి, కచ్చి బార్డర్ వద్ద కాంబ్రీ బ్రిడ్జ్ ప్రాంతంలో చోటు చేసుకుంది. బలోచిస్తాన్ రక్షకదళం తమ విధులు నిర్వర్తించుకొని తిరిగి పయనమవుతున్నప్పుడు.. ఈ ఘటన సంభవించింది. ఈ సంఘటన జరిగిన వెంటనే.. సంఘటనా స్థలానికి బాంబ్ స్క్వాడ్, భద్రతా సిబ్బంది హుటాహుటినా చేరుకొని సహాయక చర్యలు చేపట్టింది. బలూచిస్తాన్ రక్షకదళం అనేది ఒక ప్రత్యేక విభాగం. ఇది సున్నితమైన ప్రదేశాలలో, ముఖ్యమైన కార్యక్రమాల సమయంలో భద్రతను అందిస్తుంది.
Poonam Kaur: నా మతం చూపించి తెలంగాణ నుంచి నన్ను వెలి వేస్తున్నారు.. కంటతడి పెట్టిన పూనమ్
Also Read
- CJP Protest: "మా అంతర్గత వ్యవహారాల్లో జోక్యం వద్దు".. ఐక్యరాజ్యసమితికి భారత్ స్ట్రాంగ్ కౌంటర్..
- Trump vs Zelenskyy: జెలెన్స్కీపై ట్రంప్ సంచలన వ్యాఖ్యలు.. ఉక్రెయిన్ కొత్త అధ్యక్షుడిని ఎన్నుకోవాలంటూ సూచన!
- Saudi: రియాద్ ఎయిర్‌పోర్టులో మరోసారి భారీ పేలుడు.. విమానాలు దారి మళ్లింపు
- Solar Storm: రేపు భూమిని తాకనున్న శక్తివంతమైన సౌర తుఫాను.. భారత్‌పై ప్రభావం ఎంత?
ప్రాథమిక విచారణలో భాగంగా.. సూసైడ్ బాంబర్ వల్లే ఈ ఘటన జరిగిందని, అయితే ఈ కేసుపై ఇంకా విచారణ జరుగుతోందని అధికారులు పేర్కొన్నారు. ఓ సూసైడ్ బాంబర్ మోటార్ బైక్ నడుపుతూ.. ఈ రక్షకదళం వాహనాన్ని వెనుక వైపు నుంచి ఢీకొట్టాడని అబ్దుల్ అమీర్ అనే ఓ సీనియర్ అధికారి తెలిపారు. ఈ పేలుడు సంభవించగా.. బ్లూ & వైట్ రంగులో ఉన్న పోలీసుల వాహనం పల్టీలు కొట్టి.. ఉల్టా పడింది. లోపలున్న 9 మంది పోలీసు అధికారులు మరణించడంతో.. ఆ వాహనం నుంచి రక్తం ఏరులైపారింది. మరో 15 మంది తీవ్రంగా గాయపడ్డారు. ఈమధ్య పోలీసులపై వరుసగా జరుగుతున్న ఆత్మాహుతి దాడుల్లో.. ఇది తాజా ఎటాక్ అని అధికారులు వెల్లడించారు. బలూచిస్తాన్ ముఖ్యమంత్రి మీర్ అబ్దుల్ బిజెంజో ఈ దాడిని ఖండించారు. మరణించిన పోలీసు అధికారుల కుటుంబాలకు సంతాపం తెలిపారు. కాగా.. బలోచిస్తాన్‌లో పుష్కలంగా లభించే గ్యాస్, ఖనిజ వనరుల్ని ప్రభుత్వం దోపిడీ చేస్తోందని బలూచి జాతి గెరిల్లాలు దశాబ్దాలుగా పోరాడుతున్నారు. ఇందులో భాగంగానే ఈ ఆత్మాహుతి దాడికి పాల్పడినట్టు తెలుస్తోంది.
Extramarital Affair: వివాహిత ప్రాణాల్ని బలిగొన్న వివాహేతర సంబంధం
తాజావార్తలు
-
Nepal Flood Alert: నేపాల్‌లో వరద హెచ్చరిక.. బుధి గండకి నదికి భారీ వరద ముప్పు
-
Abhishek Sharma: సూర్యకుమార్ ప్రపంచ రికార్డుపై కాటేరమ్మకొడుకు కన్ను..
-
RT 78 : జెట్ స్పీడ్‌లో రవితేజ.. వివేక్ ఆత్రేయతో ‘తులాభారం’ స్టార్ట్
-
Thaman : తెలుగులో థమన్ బ్యాక్ ఆన్ ట్రాక్
-
BC Reservations: సర్కార్ కీలక ఉత్తర్వులు.. పంచాయతీ, మున్సిపల్ ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్లకు గ్రీన్ సిగ్నల్..!
ట్రెండింగ్
-
Cockroach Control Tips: వంటింట్లో బొద్దింకలు తిరుగుతూ చికాకు తెప్పిస్తున్నాయా.? ఈ చిట్కాతో శాశ్వతంగా సమస్యకు చెక్ పెట్టండి..!
-
Least Eligible Bachelor: లీస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ రివ్యూ..
-
Onion Peel Benefits: ఉల్లిపాయ తొక్కలను పారేస్తున్నారా? వీటి ఉపయోగాలు తెలిస్తే చెత్తబుట్టలో అస్సలు వేయరు..!
-
Tirumala: నవరాత్రి బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ.. నేటి నుంచి ప్రత్యేక దర్శనాలు రద్దు.!
-
WCL 2026: ఉతప్ప మెరుపులు వృథా.. భారత్ ఛాంపియన్స్‌పై సౌతాఫ్రికా విజయం.!