Maharashtra: ‘‘హిందీ వివాదం’’.. ఉద్ధవ్ ఠాక్రే, రాజ్ ఠాక్రే మళ్లీ కలిసే అవకాశం..
- మహారాష్ట్రకు పాకిన ‘‘హిందీ వివాదం’’..
- రాజ్‌ఠాక్రే, ఉద్ధవ్ ఠాక్రే కలిసే అవకాశం..
- మరాఠీ కోసం విభేదాలు పక్కన పెట్టాలని నిర్ణయం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Maharashtra: జాతీయ విద్యా విధానం(ఎన్ఈపీ) అమలు, హిందీ వివాదంపై తమిళనాడు, కర్ణాటక తర్వాత మహారాష్ట్రలోని పొలిటికల్ పార్టీలు కూడా ఈ వివాదంలో చేరాయి. మహారాష్ట్రంలో హిందీ వివాదం నేపథ్యంలో ఠాక్రే కుటుంబాల మధ్య సయోధ్య కుదిరే అవకాశం కనిపిస్తోంది. ఉద్ధవ్ ఠాక్రే, రాజ్ ఠాక్రేల మళ్లీ కలిసిపోయేందుకు మార్గం సుగమం అయింది. మరాఠీ గుర్తింపు, సంస్కృతికి ముప్పు ఉందనే ఆందోళనల మధ్య విడిపోయిన ఇద్దరు నేతలు నుంచి కీలక వ్యాఖ్యలు వచ్చాయి.
2005లో ఠాజ్ ఠాక్రే సొంత పార్టీ మహారాష్ట్ర నవ నిర్మాణ సేన(ఎంఎన్ఎస్) ఏర్పాటు తర్వాత ఠాక్రే కుటుంబం విడిపోయింది. శివసేన (UBT), మహారాష్ట్ర నవనిర్మాణ సేన (MNS) లకు నాయకత్వం వహిస్తున్న ఇద్దరు నాయకులు వేర్వేరు కార్యక్రమాలలో మాట్లాడుతూ, మహారాష్ట్ర భాషా , సాంస్కృతిక ప్రయోజనాలు రాజకీయ శత్రుత్వాలకు అతీతమైనవని అన్నారు.
Also Read
- Success Story: రూ.150తో మొదలైన ప్రయాణం.. ఇప్పుడు రూ.10 లక్షల టర్నోవర్.. గృహిణి అద్భుత విజయం..!
- PM SVANidhi: వీధి వ్యాపారులకు బంపర్ ఆఫర్.. 50 రోజుల వరకు రూపాయి వడ్డీ లేకుండా లోన్.. అప్లై చేసుకోండిలా..
- Rs50,000 FD for Third Child: కొత్త పథకం.. మూడో సంతానం పుడితే భారీ ప్రోత్సాహం.. రూ.50 వేల ఫిక్స్డ్ డిపాజిట్
- PM Kisan: రైతులకు బిగ్ అలర్ట్.. మీ అకౌంట్లోకి రూ.2,000 రావాలంటే ఈ పని తప్పనిసరి..!
నటుడు-చిత్రనిర్మాత మహేష్ మంజ్రేకర్‌తో పాడ్‌కాస్ట్ సందర్భంగా బంధువుల మధ్య పునఃకలయిక అవకాశం గురించి అడిగినప్పుడు.. తనకు, తన బంధవులకు మధ్య విభేదాలు చిన్నవని, మహారాష్ట్ర ప్రయోజనాలు పెద్దవని రాజ్ ఠాక్రే అన్నారు. ‘‘ఉద్ధవ్ , నా మధ్య వివాదాలు, తగాదాలు చిన్నవి. మహారాష్ట్ర వాటన్నిటి కంటే చాలా పెద్దది. ఈ తేడాలు మహారాష్ట్ర, మరాఠీ ప్రజల ఉనికికి ప్రమాదంగా మారుతున్నాయి. కలిసి రావడం కష్టం కాదు, ఇది సంకల్పానికి సంబంధించిన విషయం. ఇది నా కోరిక లేదా స్వార్థం గురించి మాత్రమే కాదు, మనం పెద్దగా ఆలోచించాలి. రాజకీయ పార్టీలలోని అందరు మరాఠీ నేతలు ఐక్యమై ఒకే పార్టీని ఏర్పాటు చేయాలి’’ అని అన్నారు.
Read Also: Samantha: తిరుమలలో డిక్లరేషన్ సమర్పించి శ్రీ వారి దర్శనానికి సమంత
2005లో తాను శివసేనతో విడిపోవడం, 2022లో శివసేన నుంచి ఏక్‌నాథ్ షిండే విడిపోవడానికి తేడాలను రాజ్ ఠాక్రే వివరించారు. ‘‘ఎమ్మెల్యేలు, ఎంపీలు నాతో ఉన్నప్పటికీ నేను శివసేనను విడిచిపెట్టాను. అయినప్పటికీ, బాలా సాహెబ్ ఠాక్రే తప్ప మరెవరి కింద పనిచేయలేదు. నేను ఒంటరిగా వెళ్లాలని నిర్ణయించుకున్నానున. ఉద్ధవ్‌లో కలిసి పనిచేయడానికి నాకు ఎలాంటి అభ్యంతరం లేదు, ఇక్కడ ప్రశ్నేంటంటే మరొకవైపు తాతో కలిసి పనిచేసే సంకల్పం ఉందా..?’’ అని రాజ్ ఠాక్రే అన్నారు. మహారాష్ట్ర మనం కలిసి రావాలని కోరుకుంటే, మహారాష్ట్రని మాట్లాడనివ్వండి అని, ఇలాంటి విషయంలో తన అహం అడ్డురాదని చెప్పారు.
మరోవైపు, ఉద్ధవ్ ఠాక్రే కూడా ఇలాంటి అభిప్రాయాన్నే వ్యక్తం చేశారు. సయోధ్యకు షరతులతో కూడిన సంసిద్ధతను వ్యక్తం చేశారు. చిన్ని చిన్న వివాదాలను పక్కన పెట్టడానికి నేను సిద్ధం. మహారాష్ట్ర ప్రయోజనాల కోసం మరాఠీ ప్రజలందరూ ఐక్యంగా ఉండాలని నేను విజ్ఞప్తి చేస్తున్నాను. ఒక రోజు వారికి, మరో రోజు వేరే వారికి మద్దతు ఇవ్వడానికి తాము వ్యతిరేకం’’ అని ఉద్ధవ్ అన్నారు. మహారాష్ట్ర ప్రయోజనాలకు వ్యతిరేకంగా వ్యవహరించే ఎవరినైనా తాను స్వాగతించనని ఆయన అన్నారు.
అన్ని మరాఠీ మరియు ఇంగ్లీష్-మీడియం పాఠశాలల్లో 1 నుండి 5 తరగతుల వరకు హిందీని తప్పనిసరి సబ్జెక్టుగా చేయాలనే మహారాష్ట్ర ప్రభుత్వం నిర్ణయానికి ఇద్దరు నాయకులు వ్యతిరేకత వ్యక్తం చేసిన సమయంలో ఈ వ్యాఖ్యలు వచ్చాయి. బీజేపీ నేతృత్వంలోని మహాయుతి ప్రభుత్వం ప్రారంభించిన ఈ విధానాన్ని రెండు పార్టీలు మరాఠీ భాషకు అవమానంగా భావిస్తున్నాయి.
తాజావార్తలు
-
Khairatabad Ganapathi Shobha Yatra: అంగరంగ వైభవంగా ఖైరతాబాద్ మహాగణపతి శోభాయాత్ర..!
-
RRB NTPC Recruitment 2026: రైల్వేలో 3,477 ఉద్యోగాలు.. అర్హత, ఫీజు, దరఖాస్తు తేదీలు ఇవే
-
Varanasi Movie Update: 30 నిమిషాల వార్ సీన్.. అంటార్కిటికా నుంచి రోమ్ వరకు.. రాజమౌళి ప్లాన్ ఇదేనా?
-
Success Story: రూ.150తో మొదలైన ప్రయాణం.. ఇప్పుడు రూ.10 లక్షల టర్నోవర్.. గృహిణి అద్భుత విజయం..!
-
Minapa Jantikalu: నూనె పీల్చకుండా, నెల రోజులు క్రిస్పీగా శెనగపిండి లేకుండానే కరకరలాడే “మినప జంతికలు” చేసేయండి ఇలా..!
-
Minister Atchannaidu: తుఫాన్ ఎఫెక్ట్.. అధికారులకు మంత్రి అచ్చెన్నాయుడు కీలక ఆదేశాలు
ట్రెండింగ్
-
IND vs WI: రోహిత్ శర్మ ముందు అరుదైన రికార్డులు.. సెంచరీ చేస్తే సచిన్ సరసన.!
-
Amazon నుంచి Meesho వరకు.. YouTube Shoppingలోకి కొత్త ఈ-కామర్స్ ప్లాట్‌ఫామ్స్!
-
itel ACE 4 Shine: రూ.1,059కే కొత్త ఫీచర్ ఫోన్.. టైప్-C ఛార్జింగ్‌తో పాటు అదిరిపోయే ఫీచర్లు.!
-
LIC Smart Pension Plan: రిటైర్మెంట్ తర్వాత ఆర్థిక భద్రత ఇచ్చే బెస్ట్ స్కీమ్.. జీవితాంతం నెలకు రూ. 25,000 పెన్షన్..!
-
Wall Weeds: గోడలు మొలిచే పిచ్చి మొక్కలతో భవనాలకే ముప్పు.. సింపుల్ చిట్కాలు ఇవే..!