MLC Kavitha: నేడు ఎమ్మెల్సీ కవిత బెయిల్ పిటిషన్ పై విచారణ..
- సుప్రీం కోర్టులో నేడు ఎమ్మెల్సీ కవిత బెయిల్ పిటిషన్ పై విచారణ ..
- విచారణ జరపనున్న జస్టిస్ బి ఆర్ గవాయ్
- జస్టిస్ విశ్వ నాథన్ ల ధర్మాసనం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
MLC Kavitha: సుప్రీం కోర్టులో నేడు ఎమ్మెల్సీ కవిత బెయిల్ పిటిషన్ పై విచారణ జరగనుంది. ఢిల్లీ లిక్కర్ సీబీఐ, ఈడీ కేసుల్లో బెయిల్ కోసం సుప్రీం కోర్టును కవిత ఆశ్రయించిన విషయం తెలిసిందే. ట్రయల్ కోర్టు, హైకోర్టులు బెయిల్ పిటిషన్లను తిరస్కరించడంతో కవిత సుప్రీం కోర్టు ను ఆశ్రయించింది. మహిళగా, రాజకీయ నేత, ప్రజా ప్రతినిధిగా కవిత బెయిల్ కి అర్హురాలు అంటూ కవిత తరపున వాదనలు వినిపించనున్నారు. కవిత బెయిల్ పిటిషన్ పై జస్టిస్ బి ఆర్ గవాయ్, జస్టిస్ విశ్వ నాథన్ ల ధర్మాసనం విచారణ జరపనుంది.
Read also: Adilabad Agency: నేడు ఆదిలాబాద్ ఏజెన్సీ బంద్..
Also Read
- Danish Kaneria: “పోలీసులు టాస్ గెలిస్తే బ్యాటింగ్ ఎంచుకోవాలి”.. సీజేపీ నిరసనలపై పాకిస్థాన్ మాజీ క్రికెటర్ సంచలన పోస్ట్..
- Delhi Protest: కన్నాట్ ప్లేస్‌లో హైటెన్షన్.. పోలీసులపై రాళ్లు రువ్విన నిరసనకారులు..!
- Abhijit Dipke: అరెస్టుకు ముందే వీడియో.. ఉద్యమానికి కొత్త నాయకుడిని ప్రకటించిన అభిజీత్ దీప్కే!
- Mamata Banerjee: "జానీ జానీ ఎస్ పప్పా.. జ్ఞానేశ్ కుమార్ నో పప్పా!".. ఢిల్లీలో మమతా బెనర్జీ హల్చల్
కాగా మరోవైపు బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, ఎమ్మెల్యే హరీష్ రావు నిన్న ఢిల్లీకి బయలుదేరిన విషయం తెలిసిందే. వీరితో పాటు 20 మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, పార్టీకి చెందిన కీలక నేతలను ఢిల్లీకి తీసుకెళ్లారు. అయితే ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసులో కేటీఆర్ సోదరి ఎమ్మెల్సీ కవిత బెయిల్ పిటిషన్‌పై సుప్రీంకోర్టు ఇవాళ తుది తీర్పు వెలువరించనుంది. ఈ క్రమంలో వారంతా హస్తినకు వెళ్లారు. కవిత ప్రస్తుతం ఢిల్లీలోని తీహార్ జైలులో ఉన్న సంగతి తెలిసిందే. ఆమె మద్యం కుంభకోణానికి సంబంధించిన సీబీఐ, ఈడీ కేసులో సుమారు 6 నెలలుగా తీహార్ జైలులో వున్నారు.
Read also: Patika Bellam: పటిక బెల్లంను తింటే ఇన్ని ఆరోగ్య ప్రయోజనాలా..
కానీ ఈ కేసుల్లో ఆమె ట్రయల్, హైకోర్టులో బెయిల్ కోసం దరఖాస్తు చేసుకోగా.. కోర్టులు తిరస్కరించాయి. దీంతో కవిత సుప్రీం కోర్టుకు ఆశ్రయించారు. ఈ క్రమంలో ఇవాళ సుప్రీంకోర్టు వెలువరించే తీర్పుపై ఉత్కంఠ నెలకొంది. ఈ కేసులో ఇప్పటికే నిందితులుగా ఉన్న కేజ్రీవాల్, మనీష్ సిసోడియాలకు కూడా బెయిల్ లభించింది. దీంతో కవితకు కూడా బెయిల్ వస్తుందని బీఆర్ ఎస్ శ్రేణులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు అటు కవిత ఆరోగ్యం కూడా బాగా లేకపోవడంతో ఆమెకు బెయిల్ వస్తుందని భావిస్తున్నారు. బెయిల్ రాకపోతే సీబీఐ, ఈడీ తీరుకు నిరసనగా బీఆర్ ఎస్ ఆధ్వర్యంలో ఢిల్లీలో ధర్నా చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.
PM Modi: ప్రధాని మోడీకి అమెరికా అధ్యక్షుడు ఫోన్.. కీలక అంశాలపై చర్చ..!
తాజావార్తలు
-
Danish Kaneria: “పోలీసులు టాస్ గెలిస్తే బ్యాటింగ్ ఎంచుకోవాలి”.. సీజేపీ నిరసనలపై పాకిస్థాన్ మాజీ క్రికెటర్ సంచలన పోస్ట్..
-
Tollywood Movie Releases: కుర్రళ్లోయ్.. కుర్రాళ్లు..! బాక్సాఫీస్ వద్ద యంగ్ హీరోల దండయాత్ర..
-
Alias Rukmini Heroine: ‘అలియాస్ రుక్మిణీ’.. టైటిల్ రోల్ పోషించేది ఈమేనా?
-
Delhi Protest: కన్నాట్ ప్లేస్‌లో హైటెన్షన్.. పోలీసులపై రాళ్లు రువ్విన నిరసనకారులు..!
-
Abhijit Dipke: అరెస్టుకు ముందే వీడియో.. ఉద్యమానికి కొత్త నాయకుడిని ప్రకటించిన అభిజీత్ దీప్కే!
ట్రెండింగ్
-
3D ఎఫెక్ట్‌తో మెకానికల్ లుక్.. లిక్విడ్ కూలింగ్ సిస్టమ్‌తో భారత్‌లోకి Infinix GT 50 Pro..!
-
కొత్త అల్లాయ్ వీల్స్, అప్డేటెడ్ లుక్ తో Toyota Fortuner 2026 Leader ఎడిషన్ లాంచ్.. ధర ఎంతంటే.?
-
IND vs WI: 249 పరుగులు చేసినా ఓటమి తప్పలేదు.. భారత్ కొంపముంచిన 5 కారణాలు ఇవే!
-
Hair Combs Cleaning: ₹1 ఖర్చుతో దువ్వెనలను ఇలా క్లీన్ చేయండి.. మీ జుట్టుకు చేరే మురికి, బ్యాక్టీరియా మాయం.!
-
Crispy Snacks: నూనెను ఎక్కువగా పీల్చుకోకుండా బొంబాయి రవ్వతో ‘క్రిస్పీ బైట్స్’.. తినడం మొదలు పెడితే గిన్నె ఖాళీ కావాల్సిందే.!